Guppedanta Manasu Serial Today August 14th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: శైలేంద్రను కిడ్నాప్ చేసిన మను – రంగాగా చేయాల్సిన పనుల చేస్తానన్న రిషి
Guppedanta Manasu Today Episode: ఎండీని కాబోతున్నాన్న సంతోషంలో కాలేజీకి ముందుగానే బయలుదేరిన శైలేంద్రను మను కిడ్నాప్ చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Guppedanta Manasu Serial Today Episode: రిషికి బుజ్జి ఫోన్ చేసి నిన్ను వెతుక్కుంటూ సరోజ సిటీకి వచ్చిందని ధనరాజ్ సాయంతో నువ్వు ఎక్కడున్నది కనిపెట్టిందని చెప్పడంతో.. వసుధార ఏమైందని అడుగుతుంది. దీంతో మా సరోజ సిటీకి వచ్చిందట బుజ్జి చెప్పాడు అని రిషి చెప్పడంతో వసుధార రిషి మీద అలుగుతుంది. ఇంకోసారి మా సరోజ అంటూ ఊరుకునేది లేదని రిషికి స్వీట్ వార్నింగ్ ఇస్తుంది వసుధార. మరోవైపు శైలేంద్రకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోతున్నట్లు చెప్పిన పాండు దగ్గరకు శైలేంద్ర వెళ్తాడు.
శైలేంద్ర: నేను ఎన్నో ఏళ్లుగా కంటోన్న కల ఈ రోజు తీరబోతుంది. దానిని చెడగొట్టాలని చూస్తే ఊరుకునేది లేదు.
పాండు: నువ్వు నన్ను ఏం చేయలేవు..
అంటూ పాండు, చాకచక్యంగా శైలేంద్రను కిడ్నాప్ చేస్తాడు. మరోవైపు బోర్డు మీటింగ్‌కు బయలుదేరిన ఫణీంద్ర, శైలేంద్ర ఎక్కడని దేవయానిని అడుగుతాడు. ముందు కాలేజీకి వెళ్లిపోయాడని నేను కూడా కాలేజీకి వస్తానని అడుగుతుంది దేవయాని. నువ్వు రావొద్దని నువ్వు వస్తే ఏదో ఒక గొడవ అవుతుందని దేవయానికి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు ఫణీంద్ర. మరోవైపు వసుధార మనిద్దరిని మళ్లీ ఈ కాలేజీయే కలిపిందని రిషికి చెప్తుంది.
వసుధార: డీబీఎస్‌టీ కాలేజీ మీకు ప్రాణమని నాకు తెలుసు సర్. రంగాగా నటిస్తోన్న మీరు మళ్లీ నా రిషి సర్ లా మారడానికి ఈ కాలేజీనే కారణం. కానీ ఎండీ సీట్ వల్లే మన జీవితాలు మొత్తం తారుమారుఅవుతున్నాయి సార్.
రిషి: అలా ఎలా అనుకుంటావు వసుధార.
వసుధార: లేదు సర్ కాలేజీని మనం వదిలిపెట్టి వెళ్లిపోవడమే మంచిదనిపిస్తుంది నాకు.
రిషి: బయపడి ఎక్కడికైనా పారిపోదామని చెప్తున్నావా? వసుధార. ఎక్కడికో వెళ్లిపోవడం కాదు ఇక్కడే ఉండి పోరాడాలి.
వసుధార: మీ అన్నయ్య ఇన్ని కుట్రలు చేస్తున్న ఎందుకు మౌనంగా ఉంటున్నారు సర్.
రిషి: నేను బంధాలకు బందీని వసుధార అందుకే ఇలా ఉండిపోయాను. రిషిగా చేయలేని కొన్ని పనులను రంగా చేయబోతున్నాను.
అని రిషి చెప్పగానే వసుధార చూస్తుండిపోతుంది. మరోవైపు శైలేంద్ర ముఖంపై ముసుగు వేసి అతడిని కట్టిపడేస్తాడు పాండు. తనను వదిలేయమని పాండును అడుక్కుంటాడు శైలేంద్ర.
పాండు: మిమ్మల్ని కిడ్నాప్ చేయమని మాకు డీల్ వచ్చింది.
శైలేంద్ర: అవునా..? నన్ను కిడ్నాప్ చేయమని చెప్పింది ఎవరు?
అని శైలేంద్ర అడిగిన పాండు మాత్రం సమాధానం చెప్పడు అలాగే చూస్తుండిపోతాడు. ఇంతలో అక్కడికి మను వస్తాడు.
పాండు: శైలేంద్ర మాకు ఎన్నో డీల్స్ ఇచ్చిన ఒక్కటి సక్సెస్ చేయలేకపోయాం సార్. కానీ మా కేరీర్‌లో సక్సెస్ అయిన ఫస్ట్ డీల్ ఇది. అందుకే మాకు డబ్బులు వద్దు సార్
మను: చేసేది తప్పుడు పనులు అయినా అందులో కూడా నిజాయితీ చూపిస్తున్నావు చూడు నువ్వు ఈ శైలేంద్ర కన్నా చాలా గొప్పోడి.
అని మను చెప్పగానే పాండు డబ్బులు మనుకు ఇచ్చి వెళ్లిపోతాడు. మను శైలేంద్ర ముఖానికి ఉన్న ముసుగు తీస్తాడు. మనును చూసిని శైలేంద్ర షాక్ అవుతాడు. మరోవైపు బోర్డు మీటింగ్ మొదలవుతుంది. మీటింగ్‌లో రిషి కాలేజీకి దూరమైన తర్వాత జరిగిన పరిణామాలను ఫణీంద్ర, మహేంద్ర గుర్తు చేసుకుంటారు. కాలేజీ గవర్నమెంట్ హ్యాండోవర్ చేసుకుంటున్న కరెక్ట్ టైం లో రిషి రావడం చాలా ఆనందం వేసిందని మహేంద్ర చెప్తాడు. అలాగే ఎండీ విషయంలో రిషి ఎవరిని సజెస్ట్ చేసినా అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకుంటామని చెప్తారు. అయితే రిషి ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని కాలేజీ మాజీ ఎండీగా తానే కొత్త ఎండీని ప్రకటిస్తానని వసుధార చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.