Gruhalakshmi December 21st Episode: ‘గృహలక్ష్మీ’ సీరియల్ : పరంధామయ్యను చంపేందుకు లాస్య కుట్ర - దివ్యను పుట్టింటికి పంపొద్దన్న రాజ్యలక్మీ
Gruhalakshmi Serial Today Episode:పరంధామయ్యను చంపేందుకు లాస్య కుట్ర చేస్తుంది. మరోవైపు దివ్యను పుట్టింటికి పంపేది లేదని రాజ్యలక్ష్మీ చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఆసక్తికరంగా జరిగింది.
Gruhalakshmi Telugu Serial Today Episode: విక్రమ్ పాలల్లో ఏవో టాబ్లెట్స్ కలుపుకుని తీసుకుని వెళ్తుంటే బసవయ్య మోషన్ టాబ్లెట్ కలిపిన పాల గ్లాసుతో వచ్చి ఏంటి అల్లుడు ఏదో కలుపుతున్నావు పాలల్లో అని అడుగుతాడు. బలం కోసం ప్రొటీన్స్ కలిపానని చెప్తాడు విక్రమ్ అయితే ఆ పాలు నాకు ఇవ్వు అల్లుడు అని అడుగుతాడు బసవయ్య. ఆయ్యో ఇవ్వనని చెప్తాడు విక్రమ్.
విక్రమ్‌కు ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడుతుంటే బసవయ్య గ్లాస్ మారుస్తాడు. బసవయ్య గ్లాస్ మార్చడాన్ని గమనించిన విక్రమ్, బసవయ్య మార్చిన పాల గ్లాసుతో వెళ్తుంటే ఐదు వందల రూపాయల నోటు తీసి టేబుల్ కింద పడేసి అక్కడ డబ్బులు పడ్డాయని చెప్పడంతో బసవయ్య ఆబరాగా గ్లాసు టేబుల్ మీద పెట్టి డబ్బులు తీసుకుంటుంటే విక్రమ్ మళ్లీ గ్లాసు మారుస్తాడు.
బెడ్ రూంలోకి ఫుల్ జోష్‌లో వెళ్లిన బసవయ్య కడుపులో గడబిడ మొదలయ్యేసరికి నా గ్లాసు మారిపోయినట్లుంది అనుకుని బాధపడతాడు. కంటిన్యూగా బాత్రూంకు వెళ్తుంటాడు. మరోవైపు విక్రమ్, దివ్య రొమాంటిక్ గా ఉండటం చూసిన రాజ్యలక్ష్మీ కోపంగా లోపలికి వెళ్తుంది. మరోవైపు నంద బాధపడుతూ తులసి మాటలను గుర్తు చేసుకుంటుంటాడు. ఇంతలో లాస్య ఫోన్ చేస్తుంది.
నంద: ఎందుకిలా వెంటపడుతున్నావు. ఎందుకిలా ఇరిటేట్ చేస్తున్నావు. నిన్ను వద్దనుకున్నాను. వదిలేశాను. నా బతుకు నన్ను ప్రశాంతంగా బతకనివ్వొచ్చు కదా. ఏం కావాలి నీకు.
లాస్య: నువ్వ ప్రశాంతంగా బతకడమే నాకు కావాల్సింది కూడా నేను అక్కడకు వచ్చింది మామయ్యగారిని సిన్సియర్‌గా పలకరించాలని. అక్కడ ఎవ్వరూ నా నిజాయితీని నమ్మకపోయేసరికి బాధనిపించింది. నేను మీ దృష్టిలో చెడ్డదాన్ని కావొచ్చు.
నంద: అంత నిజాయితే నీలో ఉంటే ఇష్టమొచ్చినట్లు మాట్లాడేదానివే కాదు. నా పరువు తీసే దానివే కాదు.
లాస్య: నేను చేసిన తప్పు అదే ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అదే అలోచిస్తున్నాను.
అంటూ లాస్య కట్టుకథలు చెప్తూ.. నందు మనసు మార్చాలని చెప్తుంది. నువ్వెన్ని చెప్పినా నేను నిన్ను నమ్మనని నందు చెప్తాడు. అయితే పరంధామయ్యను నాకు తెలిసిన డాక్టర్ చూపిద్దాం ఆయన మళ్లీ మామూలు మనిషి కావొచ్చు అని చెప్తుంది. దీంతో నంద ఆలోచనలో పడతాడు. పరంధామయ్య ఆరోగ్యం కోసం డాక్టర్ ను కలుస్తాను. తర్వాతే నాన్నను డాక్టర్ దగ్గరకు తీసుకొస్తానని అని లాస్యకు ఫోన్ చేసి చెప్తాడు నందు.
దివ్య ఫోన్‌లో ఫోటోలు చూస్తూ ఉండగా విక్రమ్ కాఫీ తీసుకుని వస్తాడు. ఒక్కటే తీసుకొచ్చావేంటి అని అడుగుతుంది దివ్య. ఇద్దరం కలిసి షేర్ చేసుకుందామని విక్రమ్ చెప్తాడు. అయితే నువ్వు కాఫీ తీసుకురావడం మీ అమ్మగారు చూశారా? అని అడుగుతుంది. లేదని విక్రమ్ చెప్పడంతో సరేలే నేను రెండు రోజులు మా పుట్టింటికి వెళ్లి వస్తాను అని దివ్య అడుగుతుంది. ఇంతలో అక్కడకు రాజ్యలక్ష్మీ వస్తుంది.
రాజ్యలక్ష్మీ: గడప దాటే వరకు అలాగే అంటావు. అ తర్వాత ఇచ్చిన మాట గుర్తు ఉండదు. కోడలు ఎలా ఉందో చూడ్డానికి వచ్చాను.
విక్రమ్: దివ్యకు ఎంటమ్మా కళ్లల్లో పెట్టి చూసుకుంటున్నాను.
రాజ్యలక్ష్మీ: లేదు చాలా నిర్లక్ష్యంగా చూసుకుంటున్నావు. రాత్రి మీ రూంలోంచి కేకలు, డాన్సులు, పాటలు వినిపించాయి. చూడు నాన్న దివ్య ఇప్పుడు ప్రెగ్నెంట్ అన్న విషయం మర్చిపోతున్నావు. అలా అయితే ఎలా చెప్పు. మీరిప్పుడు నా అబ్జర్వేషన్‌లో ఉన్నప్పుడే కట్లు తెంచుకుని ప్రవర్తిస్తున్నారు. దివ్యను పుట్టింటికి పంపిస్తే ఇంకేమైనా ఉందా? బుద్దిగా ఇక్కడే ఉండండి. ఇంటి వారసుణ్ణి జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత.
అని చెప్పి రాజ్యలక్ష్మీ కోపంగా బయటకు వెళ్లిపోతుంది. దివ్య షాకింగ్ గా నిలబడి చూస్తుండి పోతుంది. మరోవైపు లాస్య వాళ్ల డాక్టర్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి అల్జీమర్ వ్యాధికి తన మాజీ మామకు ట్రీట్‌మెంట్ చేయాలని.. అడుగుతుంది. మొత్తం వ్యాధి తగ్గి్స్తానని వాళ్లకు అబద్దం చెప్పాలని డాక్టర్‌ను ఒప్పిస్తుంది. అయితే తన ట్రీట్‌మెంట్‌లో ఆయన ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని డాక్టర్ చెప్పినా.. పోయినా సరే మీరు ఈ ట్రీట్‌మెంట్ చేయాల్సిందేనని లాస్య చెప్తుంది. ఇంతలో నందు డాక్టర్‌ను కలవడానికి హాస్పిటల్‌కు రావడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: నాకేమైనా పర్లేదు, ఎక్కడికి రమ్మంటారో చెప్పండి వస్తాను - అమర్ ఎమోషనల్ వీడియో