అన్వేషించండి

Gruhalakshmi August 3rd Update: సామ్రాట్ ముందు నందుని ఇరికించిన లాస్య- సామ్రాట్ తో కలిసి వంట చేసిన తులసి

నందు తులసితో మాట్లాడటానికి తన ఇంటికి వస్తాడు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

నందు తులసితో మాట్లాడటానికి తన ఇంటికి వస్తాడు. పిల్లల గురించా అని అడుగుతుంది. మీరు చెప్పాలనుకున్న విషయం నేను ఇబ్బంది పడేదా మీరు ఇబ్బంది పడేదా అని అడుగుతుంది. నా జీవితానికేమి హ్యపీగా ఉన్నాను. అందమైన భార్య, మంచి ఇల్లు, కారు, నాలుగు చేతులా సంపాదన ఇంకేం కావాలి ఇంతకన్నా అని నందు అంటాడు. మీ కన్న తల్లిదండ్రులు అని అంటుంది. వాళ్ళు లేకుండా ఎన్ని ఉన్నా లేనట్టే అని చెప్తుంది. మన పాస్ట్ గురించి మాట్లాడటానికి రాలేదని చెప్తాడు. మనం అనుకోకుండా సామ్రాట్ గారి దగ్గర పని చేస్తున్నాం. ఒక నిజం సామ్రాట్ గారికి తెలియకుండా ఉంటే మంచిదని అనిపిస్తుందని నందు అంటాడు. ఏంటా నిజం అని తులసి అడుగుతుంది. నేను నీ భర్తని.. అదే మాజీ భర్తని అనే విషయం.

తులసి: తెలిస్తే తెలియనివ్వండి నాకేం అభ్యతరం లేదు

నందు: సమస్య నీకు కాదు నాకు. ఆయనకి నువ్వంటే సాఫ్ట్ కార్నర్, నువ్వంటే ఉండే ఇష్టం అది నా మీద కోపంగా మారొచ్చు. ఏవైనా జరగవచ్చు. అర్థం చేసుకో తులసి

తులసి: నిజం చెప్పినంత మాత్రాన గతం మార్చలేము కదా

నందు: మార్చలేము కానీ దాచగలం కదా

తులసి: ఓడలు బండ్లు అవడం అంటే ఇదేనేమో.. గతంలో నేను మీ భార్యని అని చెప్పుకోడానికి అసహ్యపడే వాళ్ళు. ఇప్పుడు నా మాజీ భర్త అని చెప్పేందుకు భయపడుతున్నారు. అయినా నేను అబద్ధం చెప్పనని మీకు తెలుసు మరి ఏ నమ్మకంతో మీరు నన్ను అడగడానికి వచ్చారు

నందు: ఇది భయం కాదు.. ఈ అబద్ధం వల్ల ఎవరికి నష్టం కూడ లేదు

తులసి: అబద్ధాలు చెప్పే అలవాటు నాకు లేదు. మీరు నా ముగ్గురు పిల్లలకి తండ్రి కాబట్టి ఒక సాయం చేస్తాను సామ్రాట్ గారికి నా అంతట నేను నిజం చెప్పను అడిగితే మాత్రం అబద్ధం చెప్పను మీకోసం నేను నా వ్యక్తిత్వాన్ని మార్చుకొను

నందు: తనంతట తాను నిజం చెప్పను అని మాట ఇచ్చింది చాలు

Also Read: వేద, యష్ రొమాంటిక్ మూమెంట్, ఖుషి ప్లాన్ సక్సెస్

సామ్రాట్ పార్టీకి రెడీ అవుతూ ఉంటాడు. అది చూసి హనీ అసలు బాగోలేదు నువ్వు టీ షర్ట్ వేసుకోవాలి అని సెలెక్ట్ చేస్తుంది. ఈరోజు మన ఇంట్లో పార్టీ వాళ్ళందరి ముందు హీరోలా ఉండాలని అంటుంది. హనీ చెప్పినట్టుగానే సామ్రాట్ టీ షర్ట్ వేసుకుంటాడు. నందు వచ్చిన విషయం తులసి ఇంట్లో వాళ్ళకి చెప్తుంది. వాడి అవసరం కోసం నువ్వు ఎందుకు సహాయం చేస్తావ్అని అనసూయ అంటుంది. ఇక నందు గురించి ఎవ్వరూ చెప్పొద్దని తులసి ఇంట్లో వాళ్ళకి చెప్పడంతో అందరూ సరే అంటారు.  ఇక అందరూ కలిసి సామ్రాట్ ఇంటికి వస్తారు. వాళ్ళు వచ్చిన వెంటనే లాస్య, నందు లక్కీని తీసుకుని వస్తారు. కాసేపు లాస్య, ప్రేమ్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. టాపిక్ ఎటో వెళ్తుంది ఇది ఇంతటితో ఆపేయ్యమని సామ్రాట్ అంటాడు. 

Also Read: రుక్మిణి ఇంటికి వచ్చిన భాగ్యమ్మ- తల్లిని చూసి ఆనందపడిన రుక్కు, ఆదిత్యకి క్లాస్ పీకిన సత్య

మీ ఇల్లు చాలా బాగుంది ప్యాలెస్ లాగా ఉందని దివ్య సంతోషంగా చెప్తుంది. అది చూసి లాస్య నందుకి ఎక్కించే ప్రయత్నం చేస్తుంది. హనికి ఇంటి నిండా మనుషులు కావాలి, అలాంటి రోజు ఒకటి రాకపోతుందా అని మేము బిక్కు బిక్కుమంటూ ఎదురు చూస్తూన్నామని సామ్రాట్ అంటాడు. మీరందరూ కూర్చోండి నేను వంట చేస్తానని సామ్రాట్ అంటాడు. మీరు చేస్తారా అని తులసి అంటుంది. మావాడు నలభీముడికి ఏం తీసిపోడని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ చెప్తాడు. మా నందు కూడా కుకింగ్ లో సూపర్ అని లాస్య అంటుంది. అయితే ఈ రోజు వంట నలభీములదే అని సామ్రాట్ అంటాడు. ఇక రెండు టీములుగా విడిపోయి వంట చేద్దామని లాస్య ఐడియా ఇస్తుంది. నందు టీం లో ప్రేమ్, అంకిత ఉంటారు. సామ్రాట్ టీం లో దివ్య, అభి ఉంటారని చెప్తుంది లాస్య. నన్ను ఎందుకు ఇరికించవని లాస్యని తిడతాడు నందు. నేను ఉంటాను కదా నీకు హెల్ప్ చేస్తానని అంటుంది లాస్య.

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today July 31st: 'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
Nindu Manasulu Serial Today July 31st: నిండు మనసులు: ఏంటి గణ సిద్ధూ, ప్రేరణలకు అలా చెప్పాడా! సిద్ధూ బట్టల్లో ప్రేరణ చిందులు!
నిండు మనసులు: ఏంటి గణ సిద్ధూ, ప్రేరణలకు అలా చెప్పాడా! సిద్ధూ బట్టల్లో ప్రేరణ చిందులు!
Karthika Deepam 2 Serial Today July 31st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న షాకింగ్ కంప్లైంట్! ఒక్క ఆల్బమ్‌తో ఇంట్లో తుఫాను..! అడ్డంగా బుక్కైన సూరజ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న షాకింగ్ కంప్లైంట్! ఒక్క ఆల్బమ్‌తో ఇంట్లో తుఫాను..! అడ్డంగా బుక్కైన సూరజ్!
Illu Illalu Pillalu Serial Today July 31st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీమా కలిసిపోయారా! ఇంటి గుమ్మం దగ్గరే ఊహించని షాక్‌! చివరి సీన్‌ అదుర్స్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీమా కలిసిపోయారా! ఇంటి గుమ్మం దగ్గరే ఊహించని షాక్‌! చివరి సీన్‌ అదుర్స్!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Priyanka Jain : ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Embed widget