Ennenno Janmalabandham August 3rd Update: వేద, యష్ రొమాంటిక్ మూమెంట్, ఖుషి ప్లాన్ సక్సెస్
వేద, యష్ ని దగ్గర చేసేందుకు తన చిట్టి బుర్రతో ఖుషి గట్టి ప్లానె వేస్తుంది. ఇరపజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
అమ్మ, నాన్న మీరిద్దరు మళ్ళీ సరిగా మాట్లాడుకోవడం లేడు కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకోండి అని ఖుషి మరో చీటి పెడుతుంది. అది చూసిన వేద యష్ ని కాసేపు ఉండమని చెప్పి మాట్లాడుకుందాం ఖుషి మనల్ని చూస్తూ ఉంటుందని చెప్తుంది. ఏం మాట్లాడుకోవాలో తెలియక ఇద్దరు తంటాలు పడుతూ ఉంటారు. ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉండటాన్ని ఖుషి చూసి సంతోషిస్తుంది. మధ్యలో వేదని ఎవరో ఒకరు పిలుస్తా ఉండేసరికీ ఖుషి తల బాదుకుంటూ ఉంటుంది. ఇక వేదకి డ్రెస్స్ కొనిద్దామని యష్ అనుకుని బయటకి వెళ్ళేటైం కి వసంత్ వచ్చి ఆఫీసు పని ఉందని ఏదో ఫైల్ తెచ్చి చేతిలో పెడతాడు. అది చూసి ఖుషి తిట్టుకుంటూ వసంత్ ని పక్కకి పిలుస్తుంది. డాడీ దగ్గరకి వెళ్ళి ఎందుకు పని పని అంటున్నావ్ అని కొడుతుంది. వాళ్ళిద్దరికీ ప్రైవసీ కావాలి ఎలాగోకల నువ్వే చెయ్యాలి అని పని పురామాయిస్తుంది. ఏదో ఒకటి ప్లాన్ చేసి మమ్మీ, డాడీని బయటకి పంపించేయాలి వాళ్ళిద్దరూ హ్యాపీ గా ఉండాలి అని ఖుషి చెప్తుంది.
ఏదో పార్టీ ఉందని చెప్పి వేద, యష్ ని వెళ్ళమని వసంత్ చెప్తాడు. కాంచన భర్త జైల్లో ఉండటంతో తను చాలా అప్సెట్ లో ఉంది ఇటువంటి టైం లో మనం పార్టీ డిన్నర్ అని బయటకి వెళ్తే బాగోదని వేద అనేసరికి యష్ కూడా అవునని అంటాడు. దాంతో పాపం వసంత్ వేసిన ప్లాన్ ఫెయిల్ అయింది. దీంతో ఖుషి మాలిని దగ్గరకి వెళ్తుంది. అత్తయ్య ఏడుపు మొహంతో ఉంది తన మూడ్ ఏం బాగోలేదు. నేను బుంగమూతి పెట్టినప్పుడు డాడీ నన్ను బయటకి తీసుకెళ్ళి చాక్లెట్స్, ఐస్ క్రీమ్ కొనిస్తారు నన్ను నవ్విస్తారు నా బుంగమూతి పోతుంది అలాగే మనం అత్తయ్యని హుషారు చెయ్యాలి అప్పుడు తను కూడా హ్యాపీగా అయిపోతుందని ఖుషి చెప్తుంది. అవును తను చెప్పింది నిజమే కాంచనని కాసేపు సరదాగా బయటికి తీసుకెళ్తే తన మూడ్ మారుతుందని మాలిని అంటుంది. అది విని వసంత్ ఖుషిని తెగ మెచ్చుకుంటాడు. నీ చిట్టి బుర్రలో ఎన్ని తెలివి తేటలు ఉన్నాయో అని ఖుషిని పొగిడేస్తాడు. ఇక పార్టీకి వెళ్లేందుకు యష్ వాళ్ళు రెడీ అవుతారు. తమ ప్లాన్ సక్సెస్ అయినందుకు ఇద్దరు ఖుషి, వసంత్ డాన్స్ చేస్తూ ఉంటారు.
Also Read: రామా చేతికి గాయం, కనికరించని జ్ఞానంబ- జానకి చేతుల మీదగా వరలక్ష్మి వ్రతం పూజ
ఇక ఛాంబర్ పార్టీ అని చెప్పి యష్ వాళ్ళని హోటల్ కి పంపిస్తాం కానీ అక్కడ పార్టీ లేదని తెలిస్తే యష్ నా పీక పిసికి చంపేస్తాడు వామ్మో అని వసంత్ తల పట్టుకుంటాడు. అయ్యో మరి ఇప్పుడు ఎలా అని ఆలోచించి వసంత్ మరో ప్లాన్ వేస్తాడు. వాళ్ళిద్దరూ బయటకి వెళ్ళడం ఎందుకు ఇంట్లోనే ఉండేలా చేద్దాం అప్పుడు కూడా ప్రైవసీ దొరుకుతుంది కదా అని అంటాడు. దానికి ఖుషి కూడా ఒకే చెప్తుంది. యష్ రెడీ అయ్యి బయటకి వచ్చేస్తాడు. అది చూసి తనని మళ్ళీ గదిలోకి పంపించడం కోసం ఖుషి యష్ సూట్ కోట్ జేబులో ఐస్ క్రీమ్ వేస్తుంది. అది చూసుకున్న యష్ పార్టీకి టైం అవుతుంది డ్రెస్స్ వెంటనే మార్చుకోవాలని తన గదిలోకి వెళతాడు. ఇక బయటికి వెళ్లేందుకు మాలిని, రత్నం, కాంచనని తీసుకుని బయటకి వచ్చేస్తారు. తమ ప్లాన్ సక్సెస్ అయినందుకు తెగ సంతోషిస్తారు ఖుషీ, వసంత్. ఇక అందరూ వెళ్లిపోగా ఇంట్లో వేద, యష్ మాత్రమే మిగిలిపోతారు. వేద అందంగా రెడీ అవడం చూసి యష్ మైమరచిపోతాడు. ఇక ఇద్దరు బయటకి వెళ్లేందుకు చూసేసరికి తలుపు లాక్ అయిపోతుంది. బయటకి ఎలా వెళ్లాలో అర్థం కాక యష్, వేద ఇంట్లోనే ఉండిపోతారు.
తరువాయి భాగంలో..
ఖుషి ప్లాన్ సక్సెస్ అవుతుంది. వేద యష్ కోసం క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేస్తుంది. ఇద్దరు కలిసి రొమాంటిక్ గా గడుపుతారు. అప్పుడే యష్ ఇంట్లోకి ఓ దొంగ వచ్చేస్తాడు.