News
News
X

Janaki Kalaganaledu August 2nd Update: రామా చేతికి గాయం, కనికరించని జ్ఞానంబ- జానకి చేతుల మీదగా వరలక్ష్మి వ్రతం పూజ

జ్ఞానంబ తనతో మాట్లాడటం లేదని రామా అల్లాడిపోతాడు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 

వ్రతం అయ్యేదాక నోటికి పని తగ్గించమని గోవిందరాజులు మల్లికకి వార్నింగ్ ఇస్తాడు. జ్ఞానంబ వచ్చి దేవుడి విగ్రహాన్ని శుబ్రం చెయ్యమని మల్లికకి ఇస్తుంది. అది చూసి జానకి గతంలో జ్ఞానంబ తనకి ఇచ్చిన విషయం గుర్తు చేసుకుని బాధపడుతుంది. మరో వైపు రామా వంట చేస్తూ జ్ఞానంబ, జానకి మాటలు తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. ఒకవైపు అమ్మ బాధపడుతుంది.. మరో వైపు అమ్మ మాట్లాడకుండా ఉంటుంది. ఇవి సర్దుకుంటాయని అనుకుంటున్నానే తప్ప ఎప్పటికీ సర్దుకుంటాయో అని అనుకుంటూ ఉండగా రామా చేతి మీద వేడి నూనె పడి అల్లాడిపోతాడు. జ్ఞానంబ అది చూసి మౌనంగా నిల్చుని ఉంటుంది. జానకి వచ్చి మందు రాస్తానని అంటుంది కానీ రామా ఒప్పుకోడు. అమ్మ నాకు ఇంత పెద్ద దెబ్బ తగిలినా నాదగ్గరకి రాకుండా ఉండేసరికి నా ప్రాణమే పోయినట్టు ఉంది దానితో పోలిస్తే ఇదేమి పెద్దది కాదులెండి అని రామా అంటాడు. అది విని జ్ఞానంబ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జానకి మాత్రం రామా మాటలు వినకుండా తీసుకెళ్ళి చేతికి అయిన గాయానికి మందు రాస్తుంది. 

Also Read: సిగ్గులేకుండా వెళ్ళి తులసిని బతిమలాడుకోమంటున్న లాస్య- శ్రుతి కోసం కౌసల్యకి ఫోన్ చేసిన తులసికి ప్రేమ్ విషయం తెలిసిపోతుందా?

రామా బాధపడటం చూసి జ్ఞానంబ గుండె తరుక్కుపోతుంది. జానకి ఏడుస్తూ గాయానికి వెన్న రాస్తుంది. రామా అంతగా బాధపడుతున్నా కానీ జ్ఞానంబ కరగకుండా ఉండేసరికి రామా విలావిల్లాడిపోతాడు. తనకి చిన్న దెబ్బ తగిలినా మా అమ్మ తట్టుకోలేదు, నా కళ్లలో నీళ్ళు వస్తే మా అమ్మ ప్రాణం విలవిల్లాడిపోయేది. నాకు ఇంత పెద్ద గాయం అయ్యిన బాధకంటే మా అమ్మ వైపు దీనంగా చూస్తూ  ఉంటే మా అమ్మ రాకుండా ఉంటే ఆ బాధ న గుండెని మెలిపెడుతుంది. ఆ బాధని భరించడం చాలా కష్టంగా ఉంటుంది. పిల్లలు ఎంత బాధపెట్టినా ఆ పిల్లలు బాధపడితే తల్లి గుండె తట్టుకోలేదు. ఈ విషయంలో మా అమ్మ అందరి కంటే కాస్త ఎక్కువ. ఇక్కడ నేను ఎంతలా బాధపడుతున్నానో అంతలా మా అమ్మ కూడా బాధపడుతుంది. మందు రాయలేకపోతున్నా అని కంట తడి పెట్టుకుంటూ ఉంటుందని రామా అంటాడు. ఆ సన్నివేశంలో తల్లి, కొడుకుల ప్రేమ ప్రేక్షకుల హృదయాలని కత్తిపడేస్తుంది. పాపం ఈ అమ్మ ఇంక మందు రాయలేదని నా బిడ్డ బాధపడుతూ ఉంటాడు. పండగ రోజు ఎందుకు తల్లి నా బిడ్డని ఇలా బాధపెడుతున్నావని జ్ఞానంబ కుమిలిపోతుంది. 

Also Read: ఎవరికి కనిపించకుండా వెళ్లిపోతానన్న రుక్మిణి- దేవి గురించి అదిత్యని నిలదీసిన సత్య

పూజకి ముత్తైదువులందరూ జ్ఞానంబ ఇంటికి వస్తారు. ఇల్లంతా పండగ సందడి ఉంది కానీ నీ ముఖంలో లేదేంటి అని నీలావతి జ్ఞానంబని అడుగుతుంది. అదేమీ లేదని అంటుంది. ఇక వ్రతం పనులన్నీ పెద్ద కోడలు చేయలేదేంటి అని నీలావతి అడుగుతుంది. మల్లిక అసలు విషయం చెప్తుంటే జ్ఞానంబ ఆపుతుంది. పోయినసారి జానకి చేసింది అందుకని ఈసారి మల్లికతో చెపిస్తున్న అని జ్ఞానంబ చెప్తుంది. పుల్లలు పెట్టె నీలావతి గోడ మీద జానకి, రామా ఫోటో లేదేంటి అని అడుగుతుంది. ఫోటో పగిలిపోయింది ఒకసారి ముక్కలు అయితే  అతుక్కోవడం కష్టం కదా అని జ్ఞానంబ అంటుంది. ఇక దేవుడి విగ్రహాన్ని తీసుకుని పీటల మీద పెట్టమని గోవిందరాజులు జానకికి చెప్తాడు. పూజ పనులు జానకితో చేయించేందుకు ప్రయత్నిస్తాడు. జానకి సంతోషంగా వెళ్ళి విగ్రహం పెట్టి పూజ చేస్తుంటే చూసి మల్లిక ఏడుస్తుంది. 

Published at : 02 Aug 2022 11:26 AM (IST) Tags: janaki kalaganaledu serial janaki kalaganaledu serial today Janaki Kalaganaledu Serial Today Episode Written Update Janaki Kalaganaledu August 2nd

సంబంధిత కథనాలు

Dobaaraa: తాప్సీ సినిమాకి షాక్ - ఆడియన్స్ లేక షోస్ క్యాన్సిల్!

Dobaaraa: తాప్సీ సినిమాకి షాక్ - ఆడియన్స్ లేక షోస్ క్యాన్సిల్!

Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన ర‌ణ్‌వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?

Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన ర‌ణ్‌వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?

Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!

Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Wanted PanduGod Review: వాంటెడ్ పండుగాడ్ రివ్యూ: సుధీర్, అనసూయ, సునీల్‌ల పండుగాడు మెప్పించాడా?

Wanted PanduGod Review: వాంటెడ్ పండుగాడ్ రివ్యూ: సుధీర్, అనసూయ, సునీల్‌ల పండుగాడు మెప్పించాడా?

టాప్ స్టోరీస్

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్

Google Maps: మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది..

Google Maps: మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది..

Raashii Khanna: అమ్మ బ్రహ్మ దేవుడో ఎంత గొప్ప సొగసురో- హాట్ ఫోజుల్లో హీట్ పెంచేస్తున్న రాశీ ఖన్నా

Raashii Khanna: అమ్మ బ్రహ్మ దేవుడో ఎంత గొప్ప సొగసురో- హాట్ ఫోజుల్లో హీట్  పెంచేస్తున్న రాశీ ఖన్నా