By: ABP Desam | Updated at : 02 Aug 2022 10:22 AM (IST)
image credit: Disney Plus Hotstar/ Star Maa
హనీ బాధగా కూర్చుని ఉంటుంది. ఇంట్లో పని చేసే వాళ్ళకి నేనంటే భయం నాకేమైన అయితే నువ్వు ఎక్కడ వాళ్ళని తిడతావేమో అని భయపడతారు. నాకు ఈ ఇల్లు అసలు నచ్చలేదు. తులసి నటి వాళ్ళ ఇంట్లో చూడు ఎంత మంది ఉంటారో మరి మన ఇంట్లో ఎందుకు నాన్న ఎవరు ఉండరు అని హనీ సామ్రాట్ ని అడుగుతుంది. 'అన్నయ్యా నేను మోసపోయాను అన్నయ్య నన్ను క్షమించు అన్నాయా నిన్ను వదిలేసి వెళ్లిపోతున్నాను' అని తన చెల్లి చెప్పి ఉరి వేసుకున్న ఘటనని సామ్రాట్ గుర్తు చేసుకుని బాధపడతాడు. హనీని కౌగలించుకుని సామ్రాట్ ఏడుస్తాడు. నువ్వు నన్ను అడిగే ప్రతి ప్రశ్న నేను దేవుడిని అడుగుతూనే ఉన్నానమ్మ అని అంటాడు. నువ్వు ఏడవకు నాన్న.. ఇంకెప్పుడు నిన్ను బాధపెట్టేలాగా ప్రశ్నలు అడగను అని హనీ అంటుంది. చెల్లి గుర్తుకొచ్చింది ఆ చేదు జ్ఞాపకం నన్ను వెంటాడుతూనే ఉంటుండని సామ్రాట్ అంటాడు. నువ్వు చెల్లెలి గురించి కాదు ఆలోచించాల్సింది హనీ గురించి ఇల్లు సందడిగా ఉండటం హనికి కావలసింది నేను ఆ పనిలో ఉంటాను అని సామ్రాట్ బాబాయ్ చెప్తాడు.
Also Read: ఖైలాష్ ని విడిపించనని తెగేసి చెప్పిన యష్- ఖుషి క్యూట్ ప్లాన్, గదిలో లాక్ అయిపోయిన వేద, యష్
ప్రేమ్ బాధగా ఆలోచించడం చూసి తులసి ఏమైందని అంకితను అడుగుతుంది. అదేమీ లేదు బాగానే ఉన్నాడని అంటుంది. శ్రుతికి దూరంగా ఉండటం వాడికి చాలా బాధగా ఉందని తులసి అనుకుంటుంది. మనిషివి ఇక్కడ ఉన్నావ్ కానీ మనసు మాత్రం ఇక్కడ లేదు శ్రుతి మీద బెంగ పెట్టుకున్నావా అని తులసి ప్రేమ్ ని అడుగుతుంది. వెంటనే కౌసల్యకి ఫోన్ చేస్తుంది. మీకు ఒంట్లో బాగోలేదంట కదా అందుకని శ్రుతి మీ దగ్గరకి వచ్చిందంట కదా ప్రేమ్ చెప్పాడు అని తులసి అంటుంది. ఆ మాటకి కౌసల్య కోపంగా నాకు ఏమైందో ప్రేమ్ చెప్పలేదా అని అడుగుతుంది. నాకు కాస్త నీరసంగా ఉందని చెప్పి తులసిని మాట్లాడినివ్వకుండా ఫోన్ పెట్టేస్తుంది. నేను ఇక్కడే ఉన్నానని ప్రేమ్ కి ఎలా తెలిసిందని శ్రుతి అంటుంది. మొన్న వచ్చాడు కదా చూసే ఉంటాడు.. నువ్వు వెళ్ళి కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతావనుకున్నాడేమో అందుకే చూసి కూడా వెళ్ళిపోయి ఉంటాడని కౌసల్య అంటుంది. ప్రేమ్ ఇంతలా మారిపోయాడా తను వచ్చి రమ్మని అడిగే దాకా నేను ఇక్కడే ఉంటానని శ్రుతి మనసులో అనుకుంటుంది.
తులసికి సామ్రాట్ బాబాయ్ ఫోన్ చేస్తాడు. హనీ చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది. అందుకు కారణం నువ్వే. తనకి ఒక కొత్త ప్రపంచాన్ని చూపించావ్ ఇప్పుడు హనీ తులసి ఆంటీ ఇంట్లో ఉండే బంధాలని తీసుకురమ్మని అడుగుతుంది. దాని వల్ల మెఊ ఇబ్బంది పడుతున్నాం.. అందుకే నువ్వే కారణమని అంటున్నాను. హనీ కాంపిటీషన్లో గెలిచినందుకు ఇంట్లో చిన్న పార్టీ ఇస్తున్నాను నువ్వు ఫ్యామిలితో కలిసి తప్పకుండా రావాలని అడుగుతాడు. అందుకు తులసి సరే అని చెప్తుంది. ఇక అంకిత ప్రేమ్ ని శ్రుతి వాళ్ళ కౌసల్య అత్తయ్య ఇంట్లో ఉందని నీకు తెలియదా అని అడుగుతుంది. గొడవ జరిగిన మరుసటి రోజే ఆమె ఇంటికి వెళ్ళాను కానీ రివర్స్ లో శ్రుతి ఎక్కడా అని అడిగింది. నేనంటే తనకి ఇష్టం చచ్చిపోయింది అందుకే ఇంట్లో ఉంది కూడా లేదని వాళ్ళ అత్తయ్యతో చెప్పించింది. చూద్దాం ఎన్ని రోజులు ఇలా ఉంటుందో అని ప్రేమ్ అంటాడు. నువ్వు కూడా మీ అన్నయ్య లాగా మాట్లాడకు ప్రేమ్ శ్రుతి అలాంటిది కాదు తప్పుగా అర్థం చేసుకోకు అని అంకిత సర్ది చెప్పేందుకు చూస్తుంది కానీ ప్రేమ్ మాత్రం వినడు.
Also Read: ఎవరికి కనిపించకుండా వెళ్లిపోతానన్న రుక్మిణి- దేవి గురించి అదిత్యని నిలదీసిన సత్య
ఇక పార్టీకి రమ్మని నంది ఫోన్ చేసి చెప్తారు. పార్టీకి వెళ్ళడం తనకి ఇష్టం లేదని నందు లాస్యతో చెప్తాడు. ఆఫీసులోనే వాళ్ళిద్దరి ముఖాలు చూడలేక చస్తున్నాను మళ్ళీ పార్టీలో కూడా వాళ్ళని చూడాలా అని నందు అసహనంగా అంటాడు. మన ప్రాజెక్ట్ సామ్రాట్ దగ్గర ఉంది అది ఒకే అవ్వాలంటే సామ్రాట్ ని మనం ఇంప్రెస్ చెయ్యాలి తప్పదు, అయిన తులసి సామ్రాట్ దగ్గర అయితే మనకి మంచిది. సామ్రాట్ మనకి బంధువు అవుతాడు అప్పుడు మన పని ఇక ఈజీ అవుతుంది నువ్వు చేయాల్సింది ఒక్కటే సిగ్గు ఎగ్గు వదిలేసి వెళ్ళి తులసిని బతిమలాడుకో. నువ్వు తన మాజీ భర్తవని తెలిస్తే అప్పుడు మన పని గోవిందా ఇద్దరి ఉద్యోగాలు పోతాయి, రోడ్డు మీద పల్లిల్లు, బటానీలు అమ్ముకోవాల్సి వస్తుంది. అందుకని ముందు వెళ్ళి తులసిని బతిమలాడుకోమని లాస్య నందుకి క్లాస్ పీకుతుంది.
Puri Jagannadh: క్రేజీ డీల్ వదులుకున్న 'లైగర్' టీమ్ - ఛార్మితో ఎఫైర్ పై స్పందించిన పూరి జగన్నాధ్!
Viruman: ప్రభాస్ ఫ్లాప్ సినిమా పాయింట్తో కార్తీ సినిమా - సూపర్ హిట్ అయిందే!
Jinthaak Song: దుమ్మురేపుతున్న రవితేజ ఊరమాస్ సాంగ్ 'జింతాక్', స్టెప్పులు అదుర్స్!
Liger: 'లైగర్' సెన్సార్ రిపోర్ట్ - ఆ బూతు డైలాగ్స్ కట్!
Thiru Movie Review - తిరు రివ్యూ : ధనుష్, నిత్యా మీనన్ సినిమా ఎలా ఉందంటే?
AP News : గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి రూ. 3 వేల కోట్లు - ఏపీ సర్కార్ కీలక నిర్ణయం !
Bandla Ganesh On Bjp : బీజేపీలోనూ వారసత్వ రాజకీయాలు, అక్కడ పుట్టిఉంటే బండ్లానీ అయ్యేవాడిని - బండ్ల గణేష్
Pawan Kalyan: వాళ్లకీ యాప్ ఉండాలట! పవన్ కల్యాణ్ డిమాండ్ - సీఎం జగన్పై సెటైరికల్ కార్టూన్
IND Vs ZIM 1st ODI: దీపక్ చాహర్ దెబ్బ అదుర్స్ - కష్టాల్లో జింబాబ్వే!