News
News
X

Ennenno Janmalabandham August 2nd Update: ఖైలాష్ ని విడిపించనని తెగేసి చెప్పిన యష్- ఖుషి క్యూట్ ప్లాన్, గదిలో లాక్ అయిపోయిన వేద, యష్

ఖైలాష్ ని విడిపించమని మాలిని యష్ ని అడుగుతుంది. కానీ అందుకు యష్ ఒప్పుకోడు. ఇక ఖైలాష్ ని ఆయుధంగా చేసుకోవాలని అభిమన్యు ప్లాన్స్ వేస్తాడు. దీంతో కథనం ఉత్కంఠగా మారింది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 

కాంచన ఏమి తినకుండా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే యష్ ఆఫీసుకి వెళ్తుంటే మాలిని పిలుస్తుంది. 'అయ్యిందేదో అయిపోయింది ఒక పీడ కలగా అంతా మర్చిపోదాం అందరం హ్యాపీ గా ఉన్నాం కానీ కంచుని చూడరా లోలోపల ఎంత బాధపడుతుందో. ఇంటి ఆడపడుచు నట్టింట్లో కన్నీరు కారిస్తే మంచిది కాదు అందుకని ఖైలాష్ ని విడిపించరా.. కేసు వాపస్ తీసుకుని జైలు నునహకి బయటికి తీసుకుని రా.. తమ్ముడివి నువ్వు కాక ఎవరు సహాయం చేస్తారు రా' అని మాలిని యష్ ని అడుగుతుంది. అమ్మా సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పమని యష్ అంటాడు. జరిగిన దాంట్లో తప్పు ఎవరిదని అడుగుతాడు. తప్పు ఖైలాష్ ది కాదు.. వేదది కాదు తప్పు నాది అని అంటుంది. ఆ మాటకి కాంచన ఏడుస్తూ లోపల్లికి వెళ్ళిపోతుంది. 'కూతురు ఏమైపోతుందో అని నిజాన్ని అంగీకరించలేని అత్త స్థానంలో ఉన్నాను రా.. కంచు ఏమైపోతుందోనన్న భయంతో నా కోడలితో మాట్లాడలేకపోయాను.. తల్లి ప్రేమ ఇలాగే ఉంటుంది నాన్న.. అది ఎవరికి అర్థం కాదు.. ఆ రోజు ఖైలాష్ గురించి వేద అందరి కంటే ముందు నాకే చెప్పింది ఆ రోజే యాక్షన్ తీసుకుని ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చి ఉండేది కాదు నా వల్ల జరిగిన తప్పుకి ఏ పాపం తెలియని మన ఇంటి కోడలు ఆ పోలీసు లాకప్ లో గడపాల్సి వచ్చింది. ఆ అవమానం మన వేదకే కాదు మన ఫ్యామిలీలో అందరికీ. ఇంతకన్నా ఏం చెయ్యగలను నాన్న. నువ్వు కూడా దీని గురించి తెలిసినప్పుడు మాట్లాడలేకపోయావు.. ఆ పరిస్థితి వల్లే నేను మాట్లాడలేకపోయాను. నా వల్ల జరిగిన తప్పుకి నా కోడలు నష్టపోయింది.. ఇప్పుడు నా కూతురు కూడ నష్టపోతే తట్టుకోలేను. ఆ ఖైలాష్ మంచి వాదో చెడ్డవాడో మన కాంచన భర్త వదులుకోలేము కదా.. అందుకే కేసు వాపసు తీసుకుని ఖైలాష్ ని దానికి అప్పగించేద్దాం. నా మొహం చూసి ఈ ఒక్కసారికి ఖైలాష్ ని విడిపించు' అని బతిమలాడుతుంది.

Also Read: వేద, యష్ ని కలిపేందుకు ఖుషి చీటీల ఆట - ఖైలాష్ గురించి తెలుసుకున్న అభి, కన్నింగ్ ప్లాన్స్ రెడీ

నీ మాట నేను గౌరవిస్తాను, అక్కకి జీవితాంతం నేను అండగా నిలుస్తాను కానీ అక్క విషయం వేరు ఆ ఖైలాష్ విషయం వేరు. ఖైలాష్ కి శిక్ష పడాల్సిందే. వేద విషయంలో ఏది జరగకూడదో అది జరిగింది. ఖైలాష్ విషయంలో ఏది జరగాలో అదే జరిగింది. వాడి భవిష్యత్ నేను కాదు ఆ భగవంతుడు నిర్ణయిస్తాడని యష్ అంటాడు. ఆ మాటలకి మాలిని ఏడుస్తూ ఎప్పుడు నేను నిన్ను ఏమి అడగలేదు ఫస్ట్ టైం అడుగుతున్నాను ఖైలాష్ ని విడిపించేద్దాం ప్లీజ్ నాన్న అని బ్రతిమలాడుతుంది. కానీ యష్ మాత్రం ఒప్పుకోడు.  

ఖైలాష్ మన ఆయుధం వాడు ఇప్పుడు తోక తొక్కిన తాచు. వాడిని మన వైపు తిప్పుకుని యష్ మీదకి ప్రయోగించవచ్చు అని అభి అంటాడు. ఆయుధం ఖైలాష్ కాదు కాంచన. భర్తని పిచ్చిగా ప్రేమించే కాంచన ఇప్పుడు గొప్ప ఆయుధం. తన భర్తని జైలుకి పంపించినందుకు పగతో రగిలిపోతూ ఉంటుంది తనని అడ్డు పెట్టుకుని వేద జీవితంతో ఆడుకుంటాను అని మాళవిక అంటుంది. వేద, యష్ కారులో వెళ్తూ ఉండగా ఖైలాష్ ని విడిపించడం గురించి అడుగుతుంది. నిన్ను క్షోభ పెట్టిన ఖైలాష్ ని వదిలిపెట్టేదె లేదు అని యష్ మరోసారి చెప్తాడు. ఏ విషయంలో అయిన నువ్వు చెప్పినట్టు వింటాను వేద కానీ ఈ విషయంలో మాత్రం వినను అని అంటాడు. సమయం చూసుకుని ఎప్పుడు ఏం చెయ్యాలో అది చేస్తాను అని అంటాడు. యష్ వాళ్ళ కారు టైర్ పంక్చర్ అవడంతో టైర్ మార్చమని అంటుంది. రాదని యష్ చెప్పేసరికి వేదనే మారుస్తుంది. అప్పుడు రోడ్డు మీద వెళ్తున్న అందరూ యష్ ని చూసి ఒక ఆడపిల్లతో టైర్ మార్పిస్తావా అని తిడతారు. వేదని పొగుడుతూ ఉంటారు. అప్పుడే అటుగా వెళ్తున్న అభిమన్యు మాళవిక వాళ్ళని చూసి ఆగుతారు. నీకు టైర్ మార్చడం కూడా వచ్చా నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇలాంటివి చూస్తున్నా అని అభి అంటాడు. 

Also Read: రుక్మిణి నీదగ్గరకి వచ్చిందా అని భాగ్యమ్మని నిలదీసిన దేవుడమ్మ- రుక్మిణి దగ్గర సత్య ఆవేదన

అభి వాగుతా ఉంటే మూసుకుని వెళ్ళమని యష్ వార్నింగ్ ఇస్తాడు. నీ పొగరు దించుతాను అని అభి అంటాడు. నేను ఒక మిత్రుడిని కలిసేందుకు వెళ్తున్నాను నీ కొంప ముంచే పని నాకు అల్ ది బెస్ట్ చెప్పవా అని అభి అడుగుతాడు. నీకు మిత్రులు కూడా ఉంటారా..వాళ్ళని కలిసి ఏం చేద్దామని మళ్ళీ కొత్త గొడవలు సృష్టిద్దామనా అని యష్ అంటాడు. పాత గొడవలు ముగిద్దామని.. శత్రువుకి శత్రువు మిత్రుడే అవుతాడు. నువ్వు కామాలు పెడుతూ వెళ్తున్నావ్ నేను నీకు ఒకేసారి ఫులుస్టాప్ పెడదామని అభి అంటాడు. నన్ను గెలవాలంటే ఉక్రోషం కాదు వ్యూహం కావాలి అని యష్ చెప్తాడు. ఆ వ్యూహం రచిద్దామనే వెళ్తున్నాను. టైం ఎప్పుడు నీదే కాదు నాకు వస్తుంది. అందుకే నీ మీద సంధించడానికి ఒక బాణం సిద్ధం చెయ్యడానికి వెళ్తున్నా అని అభి అంటాడు. ఆ బాణం తిరిగి తిరిగి నీ మీదకు రాకుండా చూసుకోమని హెచ్చరిస్తాడు యష్. ఇక వేద, యష్ ని కలిపేందుకు ఖుషి మరో ప్లాన్ రెడీ చేసింది. వేద, యష్ గదిలో ఉండగా వసంత్ తో కలిసి ఆ గది లాక్ చేసేస్తారు.  
Published at : 02 Aug 2022 08:08 AM (IST) Tags: Ennenno Janmalabandham Serial Ennenno Janmalabandham Serial Today Episode Ennenno Janmalabandham Serial Written Update Ennenno Janmalabandham Serial August 2nd

సంబంధిత కథనాలు

Highway Movie Review - హైవే రివ్యూ : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ విజయం అందుకున్నారా? లేదా?

Highway Movie Review - హైవే రివ్యూ : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ విజయం అందుకున్నారా? లేదా?

Liger Movie: 'లైగర్' కోసం ఐదు షోలు - క్యాష్ చేసుకోగలరా?

Liger Movie: 'లైగర్' కోసం ఐదు షోలు - క్యాష్ చేసుకోగలరా?

Bhale Manchi Roju: సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర ఆ చానల్‌లోకి రీ-ఎంట్రీ? ఇదిగో ప్రూఫ్!

Bhale Manchi Roju: సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర ఆ చానల్‌లోకి రీ-ఎంట్రీ? ఇదిగో ప్రూఫ్!

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?

ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?

టాప్ స్టోరీస్

AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !

AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !

Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Harish Rao :  అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ?  -  షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!

WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?

WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?