News
News
X

Devatha October 8th update: 'నువ్వే నా అక్కవని తెలుసు కానీ నా భర్తకి దూరంగా ఉండు' అని రుక్మిణికి వార్నింగ్ ఇచ్చిన సత్య - మాధవ్ పైశాచికానందం

దేవత సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
 
ఏంటమ్మా రాధకి నా గురించి ఏదో చెప్పాలి ఈ ఇంటి నుంచి పంపించాలని చూస్తున్నావ్, కన్నా కొడుక్కి ఇలా ఎవరైనా అన్యాయం చేస్తారా? నువ్వు నాకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ రాధకి సపోర్ట్ చేసి నాకు దూరం చేయాలని చూడకు. నా బాధ చూసి తల్లి మనసు కరగాలి కానీ కోపం రాకూడదు. కోపం వస్తే ఇలా వీల్ చైర్ కె పరిమితం అవ్వాల్సి వస్తుందని మాధవ్ వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే రాధ పిల్లలు, రామూర్తి వచ్చేసరికి మాట్లాడటం ఆపేస్తాడు. దశమి రోజు కదా గుడికి వెళ్ళి పూజ చేసి వస్తామని అంటారు. రాధ ఒక్కతే వెళ్తుంది కదా నువ్వు కూడా వెళ్ళు అని రామూర్తి మాధవ్ కి చెప్తాడు. వెళ్లాలని నాకు ఉంది కానీ అమ్మని చూసుకోడానికి ఉండాలి కదా అని అంటాడు. ఏంటి రాధ నన్ను రమ్మంటావా అమ్మ దగ్గరే ఉండమంటావా అని అడుగుతాడు. దేవి మాధవ్ దగ్గరకి వెళ్ళి రా నాన్న పోదాం అని పిలుస్తుంది.

దేవుడమ్మ కుటుంబం మొత్తం గుడికి వస్తుంది. దశమి రోజు పొర్లు దండాలు పెడితే మనసులో ఉన్న కోరిక తీరుతుందని దేవుడమ్మ చెప్తుంది. నువ్వు సత్య పిల్లా పాపలతో చల్లగా ఉండాలని మొక్కుకున్నా చేసి తిరుతాను అని అంటుంది. ఇంట్లో వాళ్ళు వద్దని ఎంత చెప్పినా మొక్కు నేను తీర్చుకుంటాను అని అంటుంది. దేవుడమ్మ పొర్లు దండాలు పెట్టడం చూసి ఆదిత్యని తిడతాడు తండ్రి. మీ కోసం ఈ వయసులో దానికి ఇన్ని కష్టాలు అవసరమా మీ అమ్మ బాధని ముందు మీరు అర్థం చేసుకొంది, అప్పుడే తాను ఆనందంగా ఉంటుందని ఆదిత్య తండ్రి అంటాడు.

Also Read: తులసి కోసం వచ్చి అనసూయ ముందు అడ్డంగా బుక్కైన సామ్రాట్- తప్పించుకోలేక తిప్పలు

అదే గుడికి రాధ, పిల్లల్ని తీసుకుని వస్తుంది. అటు సత్య గుడిలో వాళ్ళకి చీర, గాజులు పంచుతూ ఉంటుంది. గుడిలో ఆదిత్య వాళ్ళని చూసిన దేవి, చిన్మయి తన దగ్గరకి పరుగులు తీస్తారు. కానీ రాధ మాత్రం మొహం దాచుకుంటూ చీర అడ్డు పెట్టుకుంటుంది. మాధవ్ పిల్లు వచ్చారంటే రుక్మిణీ కూడా వచ్చే ఉంటుంది, సత్య రుక్మిణిని చూస్తే ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటుందని ఆదిత్య టెన్షన్ పడుతూ తన కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు. నువ్వు ఎప్పుడు మా అమ్మని చూడలేదు కదా మాతో గుడికి వచ్చింది నీకు చూపిస్తాను అని దేవి అనేసరికి సత్య, చిన్మయి టెన్షన్ పడతారు.

News Reels

ఇప్పుడు రాధ, ఆదిత్య కలిసి ఉన్న ఫోటో సత్య చూసింది కాబట్టి రచ్చ రచ్చే. రుక్మిణీ కనిపిస్తే జన్మలో ఆదిత్య వైపు చూడకుండా సత్య చేస్తుందని మాధవ్ మనసులో అనుకుంటాడు. సత్య కోపంగా రుక్మిణీ కోసం వెతుకుతూ వెళ్ళిపోతుంది. ఆదిత్య కూడా రుక్మిణీ కోసం వెతకడం చూసిన సత్య నిన్న జరిగిన గొడవ గురించి చెప్పి నా కంట పడకుండా పంపించేద్దామనా అలా జరగదు. ఈరోజు అక్కతో ఆటో యిటో తేల్చుకోవాల్సిందే అని సత్య అనుకుంటుంది. దేవి గుడి నుంచి వెళ్లిపోతుంటే సత్య తనని పిలుస్తుంది. నువ్వు రాధ కాదు మా అక్క రుక్మిణీ అని నాకు ఎప్పుడో తెలుసు. అక్కవే అని తెలిసినా కొత్తగా నువ్వు బతుకుతున్న బతుకు బాగుండాలని ఊరుకున్నా. నా అక్కవి అని నా ప్రతి కష్టం నీకు చెప్పాను. ఆ రోజు ఆదిత్య గురించి నీకు చెప్తే నేనున్నా అని భరోసా ఇచ్చావ్ ఇదేనా అని సత్య నిలదిస్తుంది.

Also Read: సత్య ముందు ఆదిత్యని ఇరికించిన రుక్మిణి- జానకమ్మని ఇంటికి తీసుకొచ్చేసిన రాధ

రుక్మిణీ మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటే వద్దు అని అరుస్తుంది. ఇంకా నాకు అబద్ధం చెప్పి మోసం చేయాలని చూడకని అరుస్తుంది. మోసమా నిన్ను నేను మోసం చేస్తానా అని రుక్మిణీ అడిగేసరికి సత్య తన ఫోన్లో వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటో చూపిస్తుంది. నీదగ్గరకి రావడానికి నాతో ఆదిత్య క్యాంప్ అని అబద్ధం చెప్పి వచ్చాడని సత్య కోపంగా చెప్తుంది.

Published at : 08 Oct 2022 08:02 AM (IST) Tags: devatha serial devatha serial today episode Devatha Serial Today Written Update Devatha Serial October 8th Episode Devatha Serial Written Update Today Episode

సంబంధిత కథనాలు

Guppedantha Manasu December 3rd Update:  అపార్థాల మాస్టర్ లా తయారైన ఈగో మాస్టర్, గౌతమ్ కి మిత్రద్రోహి ట్యాగ్!

Guppedantha Manasu December 3rd Update: అపార్థాల మాస్టర్ లా తయారైన ఈగో మాస్టర్, గౌతమ్ కి మిత్రద్రోహి ట్యాగ్!

Karthika Deepam December 3rd Update: మోనిత అరెస్ట్, వంటలక్క సేవలో డాక్టర్ బాబు,మరి శౌర్య పరిస్థితేంటి!

Karthika Deepam December 3rd Update: మోనిత అరెస్ట్, వంటలక్క సేవలో డాక్టర్ బాబు,మరి శౌర్య పరిస్థితేంటి!

Gruhalakshmi December 3rd: లాస్యని ఫుట్ బాల్ ఆడుకున్న తోడికోడళ్ళు- బస్సెక్కడానికి సామ్రాట్ తిప్పలు

Gruhalakshmi December 3rd: లాస్యని ఫుట్ బాల్ ఆడుకున్న తోడికోడళ్ళు- బస్సెక్కడానికి సామ్రాట్ తిప్పలు

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో మళ్ళీ ఏకాభిప్రాయం రచ్చ - 'వరస్ట్ డెసిషన్ ఆఫ్ ది సీజన్' అనేసిన ఆదిరెడ్డి

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో మళ్ళీ ఏకాభిప్రాయం రచ్చ - 'వరస్ట్ డెసిషన్ ఆఫ్ ది సీజన్' అనేసిన ఆదిరెడ్డి

Revanth Becomes Father:సింగర్ రేవంత్ ఇంట సంబరాలు, పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అన్విత

Revanth Becomes Father:సింగర్ రేవంత్ ఇంట సంబరాలు, పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అన్విత

టాప్ స్టోరీస్

President Droupadi Murmu : నేడు ఏపీకి ద్రౌపదీ ముర్ము, నేవీ డే కార్యక్రమాల్లో పాల్గోనున్న రాష్ట్రపతి

President Droupadi Murmu : నేడు ఏపీకి ద్రౌపదీ ముర్ము, నేవీ డే కార్యక్రమాల్లో పాల్గోనున్న రాష్ట్రపతి

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

Pawan Kalyan : పదేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్‌తో - సుజిత్, పవర్ స్టార్ సినిమా ప్రకటన వచ్చేసిందోచ్

Pawan Kalyan : పదేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్‌తో - సుజిత్, పవర్ స్టార్ సినిమా ప్రకటన వచ్చేసిందోచ్

IND vs BAN 1st ODI: నేడు భారత్- బంగ్లా తొలి వన్డే- బంగ్లా పులులపై టీమిండియా పైచేయి సాధిస్తుందా!

IND vs BAN 1st ODI:  నేడు భారత్- బంగ్లా తొలి వన్డే- బంగ్లా పులులపై టీమిండియా పైచేయి సాధిస్తుందా!