News
News
X

Devatha October 7th Update: సత్య ముందు ఆదిత్యని ఇరికించిన రుక్మిణి- జానకమ్మని ఇంటికి తీసుకొచ్చేసిన రాధ

ఆదిత్య తనకి అబద్ధం చెప్పి రుక్మిణి వెంట వెళ్లాడని సత్యకి తెలిసిపోతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 

సత్య రుక్మిణీ ఆదిత్య కలిసి ఉన్న ఫోటో చూపించడంతో షాక్ అవుతాడు. నాకు అబద్ధం చెప్పి నువ్వు వెళ్ళిన క్యాంప్ ఇదే కదా అని సత్య అరుస్తుంది. అక్కతో ఆశ్రమంకి వెళ్ళింది నువ్వు కదా, నువ్వు దేని గురించో బాధపడుతూ నన్ను దూరం పెడుతున్నావ్ అని బాధపడ్డా కానీ అదంతా అబద్దం.. నువ్వు కావాలనే నన్ను దూరం చేసుకుంటున్నావ్ అని సత్య అంటుంది. 
ఆదిత్య: అలా కాదు సత్య అసలు నేను ఎందుకు వెళ్లానో తెలుసా 
సత్య: ఎందుకు వెళ్ళావ్ జానకమ్మ గారికి బాగోలేదు కదా ఆమెని చూపించడానికి అని చెప్తావ్ అంతే కదా.. నువ్వు వెళ్లినందుకు కట్టుకున్న భార్యకి అబద్ధం చెప్తున్నావ్ కదా అది నాకు బాధగా ఉంది. నీకు నీ భార్య కంటే వాళ్ళే ఎక్కువ అయ్యారు కదా అందుకే క్యాంప్ అని అబద్ధం చెప్పి మరి వెళ్ళావ్ అని బాధగా వెళ్ళిపోతుంది. 

Also Read: మలబార్ మాలినినా మజాకా, స్పృహలోకి వచ్చిన సులోచన - యాక్సిడెంట్ చేసిన ఖైలాష్

డాక్టర్ రాధతో మాట్లాడుతూ జానకమ్మ మనసులో దేని గురించో భయపడుతున్నారు. ఇలా అయితే చికిత్స చేసినా ప్రయోజనం ఉండదు. దేని గురించో బాగా ఆలోచిస్తుందని అంటుంది. పేషెంట్ కి నచ్చిన వాతావరణంలో ఉంటేనే ట్రీట్మెంట్ బాగా పని చేస్తుంది. అందుకే ఆమెని ఇంటికి తీసుకుని వెళ్ళండి. మేము చేసే వైద్యం మీరు ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు అందుకు కావాల్సిన మూలికలు ఇస్తానని చెప్తుంది. ఆదిత్యకి సత్య పాలు తీసుకొచ్చి ఇవ్వకుండా నిలబడితే దేవుడమ్మ చూసి ఏంటి మీ ఇద్దఋ సమస్య నాకు అర్థం కావడం లేదు. పాలు ఇచ్చి రమ్మంటే ఇవ్వకుండా తాను నిలబడింది, ఎదురుగా పాల గ్లాసుతో ఉంటే నువ్వు పట్టించుకోవడం లేదని దేవుడమ్మ తిడుతుంది. 

మీరిద్దరు ఇలాగే ఉంటే రేపు పండగ పుట ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పటికీ నువ్వు ఆఫీసు పనుల్లో పడి సత్యని పట్టించుకోవడం లేదని బాధపడుతుంటే నువ్వు ఇలా ఉంటున్నావ్. విజయదశమి రోజు అమ్మవారికి మీ ఇద్దరినీ తీసుకెళ్ళి మీ చేతుల మీదుగా చీర గాజులు పంచుటను అని మొక్కుకున్నా కాస్త మీ కోపటాపాలు తగ్గించుకుని మీరు కళగా ఉంటే ఇల్లు కళకళలాడుతుంది అది గుర్తుంచుకోండి అని చెప్పేసి దేవుడమ్మ వెళ్ళిపోతుంది. రాధ జానకమ్మ దగ్గరకి వచ్చి రేపే మనం ఇంటికి వెళ్తున్నాం అని చెప్తుంది. కానీ అందుకు జానకి వద్దు అన్నట్లు సైగ చేస్తుండి కానీ అది రాధకి అర్థం కాదు. అప్పుడే దేవి, చిన్మయి అక్కడికి వస్తారు. దేవిని దగ్గరకి రమ్మని సైగ చేస్తుంది. దేవిని తీసుకుని వెళ్లిపొమ్మని జానకమ్మ రాధకి సైగ చేస్తుంది. 

News Reels

Also Read: నిజం బయటపెట్టిన సామ్రాట్- తులసితో కలిసి కోలాటం ఆడి అందరికీ షాక్ ఇచ్చిన సామ్రాట్

మిమ్మలని ఇలా విడిచిపెట్టి మేము ఎలా వెళ్తాం అని రాధ అంటుంది. ఇంత సాయం చేసిన మనిషిని కష్టంలో విడిచి పెట్టి వెళ్లలేను అని అంటుంటే మాధవ్ వచ్చి వింటాడు. నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతా కానీ అది మీకు తగ్గిన తర్వాతే లేకుంటే మిమ్మల్ని విడిచిపెట్టి పోయేదే లేదు, నాగురించి మీరు ఆలోచించకందని చెప్తుంది. నువ్వు మా అమ్మ మాటలు విని ఎక్కడ వెళ్లిపోతావో అని భయపడ్డాను, నీ కోసం ఇంకేం చేయాలో అని కంగారూ పడ్డాను. ఇక మా అమ్మని కోలుకొనిస్తానా, నువ్వు ఇల్లు దాటావు కాబట్టి నిదానంగా నా ప్లాన్స్ నేను చేసుకోవచ్చని మాధవ్ అనుకుంటాడు. దశమి పూజకీ దేవుడమ్మ ఇంట్లో అందరూ గుడికి బయల్దేరతారు. కారులో ఆదిత్య వాళ్ళు వెళ్తుంటే అప్పుడే రుక్మిణీ ఫోన్ చేస్తుంది. అందులో మై లైఫ్ అని పడటం చూసి సత్య షాక్ అవుతుంది. ఆదిత్య ఫోన్ లిఫ్ట్ చేయబోతుంటే సత్య స్పీకర్ ఆన్ చేస్తుంది. పెనిమిటి ఎక్కడ ఉన్నావ్ ఇంట్లో ఉన్నావా ఆఫీసులో ఉన్నావా అని రుక్మిణీ అడగటం విని సత్య షాక్ అవుతుంది. మేము ఇప్పుడే జనకమ్మని తీసుకుని ఇంటికి వచ్చామని చెప్తుంది.

Published at : 07 Oct 2022 09:05 AM (IST) Tags: devatha serial devatha serial today episode Devatha Serial Today Devatha Serial Today Episode Written Update Devatha Serial October 7th

సంబంధిత కథనాలు

YS Jagan: అలీ కూతురు మ్యారేజ్ రిసెప్షన్‌ - నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌

YS Jagan: అలీ కూతురు మ్యారేజ్ రిసెప్షన్‌ - నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్

Bigg Boss 6 Telugu: ఇనయాతో శ్రీహాన్ రొమాన్స్, శ్రీసత్యకు ఊహించని షాక్ - టాస్క్ ఇలా కూడా ఆడొచ్చా?

Bigg Boss 6 Telugu: ఇనయాతో శ్రీహాన్ రొమాన్స్, శ్రీసత్యకు ఊహించని షాక్ - టాస్క్ ఇలా కూడా ఆడొచ్చా?

Dejavu - Repeat : 'రిపీట్' రిలీజుకు ముందు 'డెజావు' సక్సెస్ - ప్రైమ్‌లో పెరిగిన క్లిక్స్

Dejavu - Repeat  : 'రిపీట్' రిలీజుకు ముందు 'డెజావు' సక్సెస్ - ప్రైమ్‌లో పెరిగిన క్లిక్స్

Ram Charan NTR : ఎన్టీఆర్, చరణ్ మధ్య నో గొడవ, నథింగ్ - ముందే అంతా మాట్లాడుకుని

Ram Charan NTR : ఎన్టీఆర్, చరణ్ మధ్య నో గొడవ, నథింగ్ - ముందే అంతా మాట్లాడుకుని

టాప్ స్టోరీస్

Bandi Sanjay : భైంసా పేరు మహిషాగా మారుస్తాం, పీడీయాక్ట్ లు ఎత్తేసి ఉద్యోగాలిస్తాం - బండి సంజయ్

Bandi Sanjay :  భైంసా పేరు మహిషాగా మారుస్తాం, పీడీయాక్ట్ లు ఎత్తేసి ఉద్యోగాలిస్తాం - బండి సంజయ్

Ys Vijayamma Comments : ఆ రాష్ట్రంతో మనకేంటి ? - ఏపీ గురించి వైఎస్ విజయమ్మ సంచలన కామెంట్స్ !

Ys Vijayamma Comments : ఆ రాష్ట్రంతో మనకేంటి ? - ఏపీ గురించి వైఎస్ విజయమ్మ  సంచలన కామెంట్స్ !

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు