Gruhalakshmi October 7th Update: తులసి కోసం వచ్చి అనసూయ ముందు అడ్డంగా బుక్కైన సామ్రాట్- తప్పించుకోలేక తిప్పలు
తులసికి దూరంగా ఉండమని అనసూయ చెప్పేసరికి సామ్రాట్ అలాగే చేస్తాడు. దీంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
![Gruhalakshmi October 7th Update: తులసి కోసం వచ్చి అనసూయ ముందు అడ్డంగా బుక్కైన సామ్రాట్- తప్పించుకోలేక తిప్పలు Gruhalakshmi Serial October 7th Episode 757 Written Update Today Episode Gruhalakshmi October 7th Update: తులసి కోసం వచ్చి అనసూయ ముందు అడ్డంగా బుక్కైన సామ్రాట్- తప్పించుకోలేక తిప్పలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/07/019588f0f6162c3c561b32156433f5491665115667538521_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కాలనీ వాళ్ళు అందరూ తులసి ఇంటికి వస్తారు. దసరా పండగ ఎవరింట్లో వాళ్ళు జరుపుకోకుండా కాలనీ అంతా కలిసి ఒకేచోట జరుపుకోవాలని అనుకుంటున్నారని పరంధామయ్య తులసికి చెప్తాడు. నేను రెడీ అయి తులసి అంటుంది. అనసూయని దగ్గరుండి పూజ కార్యక్రమాలు చేయించాలని కాలనీ వాళ్ళు అడుగుతారు. పూజ మాత్రమే కాదు వేరే కార్యక్రమలు కూడా ఉన్నాయి. దాండియా ఆట కూడా పెట్టామని కాలనీ వాళ్ళు చెప్తారు. ఇక ప్రేమ్, శ్రుతి అందరి ముందు చిలిపిగా పోట్లాడుకుంటారు. అది చూసి తులసి నవ్వుతూ ఉంటుంది. జాబ్ నుంచి తీసేసినందుకు సోరి చెప్పడానికి సామ్రాట్ తులసిని కలిసేందుకు కారులో వెళ్తూ ఉంటాడు. అసలు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయం చెప్పేస్తాను కానీ అనసూయమ్మకి ఇచ్చిన మాట తప్పిన వాడిని అవుతాను. కానీ ఏమవుతుందో తులసి గారు ఇలా రిసీవ్ చేసుకుంటారో అని ఆలోచిస్తూ ఉంటాడు.
అనసూయ పరంధామయ్య మీద చితపటలాడుతూ ఉంటుంది. సామ్రాట్ తులసి ఇంటికి రావడం అనసూయ చూసి నా కోసం వచ్చాడా తులసి కోసం వచ్చాడా అని అనుకుంటుంది. సామ్రాట్ కారు దిగగానే అనసూయ తన దగ్గరకి వెళ్తుంది. ఎదురుపడకూడదు అనుకున్న మనిషే ఎదురుపడింది, ఎలాగైనా ఈమెని తప్పించుకుని తులసి గారిని కలిసి క్షమాపణ చెప్పాలని సామ్రాట్ మనసులో అనుకుంటాడు. విషయం చెప్తే గుమ్మం దగ్గర నుంచే బయటకి పంపిస్తుందని అనుకుంటాడు. మనసు చంపుకుని నేను అడిగిన పని చేశావ్, నువ్వు చేసిన ఈ సహాయం చాలా గొప్పది, ఒక విధంగా మా మకుటుంబం పరువు కాపాడావు చాలా థాంక్స్ బాబు అని అనసూయ అంటుంది. నేను మాత్రమ సంతోషంగా ఉన్నానా ఏంటి తన ఎదుగుదలకి అడ్డు పడుతున్నా అని నాకు చాలా బాధగా ఉందని చెప్తుంది.
Also Read: సత్య ముందు ఆదిత్యని ఇరికించిన రుక్మిణి- జానకమ్మని ఇంటికి తీసుకొచ్చేసిన రాధ
తులసిగారితో మాట్లాడదాం అని వస్తే గుమ్మం దగ్గరే ఆపేసింది ఇప్పుడు ఏం చెయ్యాలి అని సామ్రాట్ మనసులో అనుకుంటూ ఉంటాడు. కానీ అదేమీ పట్టించుకోకుండా అనసూయ మాట్లాడుతూనే ఉంటుంది. మిమల్ని ఇంకొక సహాయం అడగాలని అనుకున్నా అని అనసూయ అంటుంది. జరిగిన విషయం మన ఇద్దరి మధ్యే ఉండాలి, మంచి కోసమే ఈ పని చేశాను, ఇక నుంచి తులసి మీ ఇంటికి రాదు, నువ్వు కూడా మా ఇంటికి రావొద్దు అని చెప్తుంది. నువ్వు ఎందుకు వచ్చావ్ నా కోసమా తులసి కోసమా అని అడుగుతుంది. తులసి గారి కోసమే వచ్చాను అని సామ్రాట్ చెప్తాడు.
ఎందుకు వచ్చావ్, ఏం మాట్లాడదామని వచ్చావ్ అని అడుగుతుంది. తులసి గారి దగ్గర ఒక ఫైల్ ఉండిపోయింది అది తీసుకెళ్లిపోదామని వచ్చాను అనేసరికి దాని కోసం మీరు రావాలా అని అనసూయ అంటే సరే వెళ్లిపోతానులే అంటాడు. వద్దు బాబు ఇంటి దాకా వచ్చిన మనిషిని అవమానించినట్టుగా ఉంటుంది, ఫైల్ పంపిస్తాను ఉండండి, కానీ జాబ్ గురించి ఎవరితో మాట్లాడటానికి వీల్లేదని అనసూయ అంటుంది. అనవసరంగా వచ్చాను అని సామ్రాట్ అనుకుంటాడు. తులసి కోసమే వచ్చాడు నేను ఎదురు పడేసరికి అబద్ధం చెప్పి తప్పించుకుంటున్నాడు అని అనసూయ అనుకుంటుంది. అనసూయ ఇంట్లోకి వచ్చి సామ్రాట్ వచ్చాడని చెప్తుంది. ఎక్కడ అని తులసి కంగారుగా వెళ్తుంది. ఏదో ఫైల్ నీ దగ్గర ఉండిపోయిందట తీసుకెళ్లడానికి వచ్చాడని అనసూయ చెప్తుంది. ఇంట్లోకి రమ్మని చెప్పొచ్చు కదా అని తులసి అంటే అవసరమా ఫైల్ ఇస్తే వెళ్లిపోతాడని అంటుంది. ఫైల్స్ తీసుకుని తులసినే సామ్రాట్ దగ్గరకి వస్తుంది. ఫైల్స్ కోసమే వచ్చారా అని అడుగుతుంది. వీటితో మీకు ఉపయోగం కూడా లేదు, ఇవి నిజంగా మీకు కావలసినవి అయితే మీరు ఇక్కడి దాకా రావలసిన అవసరం కూడా లేదని అంటుంది.
Also Read: మలబార్ మాలినినా మజాకా, స్పృహలోకి వచ్చిన సులోచన - యాక్సిడెంట్ చేసిన ఖైలాష్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)