Extra Jabardasth Promo: దెయ్యాలకే క్లాసులు, ‘బేబీ’తో ఆటలు, చంద్రముఖి రచ్చ - నవ్వులు పూయిస్తున్న ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ ప్రోమో
వారం వారం బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న ఎక్స్ ట్రా జబర్దస్త్, ఈ వారం కూడా మరింత ఫన్ గా ఉండబోతోంది. తాజాగా ఈ షోకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదలై అందరినీ ఆకట్టుకుంటోంది.
ప్రతి శుక్రవారం బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్న కామెడీ షో ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’. ఎప్పటిలాగే సరికొత్త స్కిట్లతో ఈ వారం ఎపిసోడ్ కూడా సరదాగా సాగనుంది. ఆగష్టు 11న ప్రసారం కానున్న ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ వారం ఎపిసోడ్‌లో ‘బేబీ‘ స్పూఫ్ తో ఇమ్మాన్యుయేల్, వర్ష జంట కామెడీతో అదరగొట్టారు. దయ్యాలకు స్పెషల్ క్లాసులు చెప్తూ ఆటో రాం ప్రసాద్ అదిరిపోయే పంచులు వేశాడు. రాకింగ్ రాకేష్ తన భార్య సుజాతతో తిట్లు తింటూ అలరించాడు. బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో నరేష్ వేసిన చంద్రముఖి గెటప్ అదుర్స్ అనిపించింది. అదరగొట్టాడు. ఫ్యాక్షనిస్టుల్లా యాదమరాజు టీమ్ నవ్వులు పూయించారు.
‘బేబీ’ స్పూఫ్ తో అలరించిన ఇమ్మాన్యుయేల్, వర్ష
‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ ప్రోమో మొదలు కాగానే ఇమ్మాన్యుయేల్, వర్ష ఆటోలో ఎంట్రీ ఇచ్చారు. ‘బేబీ‘లో వైష్ణవి మాదిరిగా తొలుత బస్తీ అమ్మాయిలా కనిపించింది వర్ష. ఆనంద్ దేవరకొండ పాత్రను ఇమ్మూ చేశాడు. ఆ తర్వాత వర్ష మోడ్రన్ అమ్మాయిలా మారి, ఇమ్మూని ఎలా మోసం చేసిందో చూపించారు. ఈ సందర్భంగా వర్ష, ఇమ్మాన్యుయేల్ పంచులు ప్రేక్షకులను అలరించాయి. అటు అర్జున్ రెడ్డి పాత్ర కూడా కూడా స్కిట్ కు బాగా కలిసి వచ్చింది. ఈ క్యారెక్టర్ ను చూసి ఖుష్బూ, విజయ్ దేవరకొండకు కాల్ చేస్తానని చెప్పడంతో సెట్ లో వాళ్లంతా పడి పడి నవ్వారు.
దయ్యాలకు పాఠాలు చెప్పిన ఆటో రామ్ ప్రసాద్
అటు ఆటో రామ్ ప్రసాద్ వేసిన దయ్యాల స్కిట్ కూడా బాగానే అలరించింది. చనిపోయి దయ్యాలుగా మారిన వారిందరికీ రామ్ ప్రసాద్ పాఠాలు నేర్పుతారు. A ఫర్ ఆత్మ, B ఫర్ భూతం, C ఫర్ కాంచన అని చెప్తాడు. కాంచన అంటే K కదా అని జడ్జి ఖుష్బూ అనడంతో C లెఫ్ట్ సైడ్ స్టాండింగ్ లైన్ గీసి Kగా మార్చడంతో అందరూ నవ్వుతారు.
సుజాత దంపతుల అబద్దాలు, చంద్రముఖిగా మారిన నరేష్
ఇక అమ్మాయిని కంటేనే తన ఆస్తిని రాసిస్తానని రాకేష్ అమ్మ చెప్పడంతో సుజాత దంపతులు కొడుకుకు అమ్మాయి గెటప్ వేసి అమ్మాయిగా పరిచయం చేస్తారు. ఈ సందర్భంగా సదరు అబ్బాయితో పాటు రాకేష్, సుజాత పడే టెన్షన్ ఫుల్ ఫన్ ను జెనరేట్ చేసింది. అటు బుల్లెట్ భాస్కర్ టీమ్ లో చంద్రముఖిగా నరేష్ చేసిన రచ్చ మామూలుగా లేదు. చంద్రముఖి గెటప్ లో నరేష్ ఎక్స్ ప్రెషన్స్, ఆయన డైలాగులు కడుపుబ్బా నవ్వించాయి. ఈ ప్రోమోకు సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ ఆగష్టు 11న రాత్రి 9.30 గంటలకు ఈటీవీ తెలుగులో ప్రసారం కానుంది. మరోవైపు గత కొద్ది రోజులు ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ షోలో కామెడీ అస్సలు ఉండటం లేదని ఆడియెన్స్ ప్రోమో కింద కామెంట్స్ పెడుతున్నారు. కనీసం, ప్రోమోలు కూడా ఫన్నీగా ఉండటం లేదని విమర్శిస్తున్నారు.
Read Also: నువ్వెప్పుడూ నువ్వే - మహేష్ బాబుకు నమ్రత స్పెషల్ విషెష్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial