Happy Birthday Mahesh Babu: నువ్వెప్పుడూ నువ్వే - మహేష్ బాబుకు నమ్రత స్పెషల్ విషెష్
స్టార్హీ రో మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆయన భార్య నమ్రత, కూతురు సితార స్పెషల్ విషెస్ చెప్పారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. ప్రస్తుతం మహేష్ తన ఫ్యామిలీతో కలిసి స్కాట్లాండ్ లో ఉన్నారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 48వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్తున్నారు. మరెన్నో అద్భుతమైన పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. తాజాగా మహేష్ భార్య నమ్రత శిరోద్కర్, కూతురు సితార విషెష్ చెప్తూ పెట్టిన పోస్టులు బాగా వైరల్ అవుతున్నాయి.
హ్యాపీ బర్త్ డే ఎంబీ- నమ్రత
మహేష్ బాబుకు ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ సింపుల్ గా బర్త్ డే శుభాకాంక్షలు చెప్పారు. ఇన్ స్టా వేదికగా ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. “హ్యాపీ బర్త్ డే ఎంబీ!! ఈ రోజు, ప్రతీ రోజు, నాకు నువ్వే నువ్వే..” అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్టుకు మహేష్ ను తన ఒడిలో కూర్చోబెట్టుకుని తీసుకున్న ఫోటోను యాడ్ చేశారు. ప్రస్తుతం నమ్రత పోస్టు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
View this post on Instagram
హ్యాపీ బర్త్ డే నాన్న- సితార
మహేష్ కూతురు సితార తండ్రికి ఇన్ స్టా వేదికగా శుభాకాంక్షలు చెప్పింది. “జీవితంలోని గొప్ప అడ్వెంచర్స్ ను మనం కలిసి పంచుకునే క్షణాలు!! పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా! లవ్ యు టు ది మూన్ అండ్ బ్యాక్!” అని రాసుకొచ్చింది.
View this post on Instagram
స్కాట్లాండ్ లో ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న మహేష్
ఇక ప్రస్తుతం మహేష్ బాబు స్కాట్లాండ్ లో ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా, ఫ్యామిలీతో సమయాన్ని గడిపేందుకు ఆయన ఎక్కువగా ఇష్టపడతారు. ఓ వైపు సినిమాలతో పాటు మరోవైపు వ్యక్తిగత జీవితాన్ని కూడా బ్యాలెన్స్ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఏమాత్రం సమయం దొరికినా పిల్లలతో ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో కలిసి ఫారిన్ వెకేషన్ కు వెళ్తారు. ప్రస్తుతం స్కాట్లాండ్ లో ఫ్యామిలీతో ఉన్నరు. అక్కడి పురాతన కోటలను సందర్శిస్తున్నారు. తన బర్త్ డేను కూడా అక్కడే జరుపుకుంటున్నారు. ఈ వారంలోనే ఆయన ఇండియాకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడికి రాగానే ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేయనున్నారు. మహేష్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం సినిమా నుంచి కొత్త పోస్టర్ విడుదల చేసింది. ప్రస్తుతం ఇది అభిమానులకు ఆకట్టుకుంటోంది.
View this post on Instagram
Read Also: అందుకే మహేష్ బాబు రీమేక్స్ చేయడు - తనకు తాను పెట్టుకున్న రూల్స్ ఇవే!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial