Chinni Serial Today September 10th: చిన్ని సీరియల్: పెళ్లిలో షాక్ ఇచ్చిన స్వప్న! మధు మ్యాడీని లవ్ చేస్తుందని చెప్పేసిందిగా!
Chinni Serial Today Episode September 10th మధుకి పెళ్లి ఇష్టం లేదని మహిని ప్రేమిస్తుందని స్వప్న అందరితో చెప్పేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode శివ పెళ్లి కొడుకులా రెడీ అయిపోతాడు. తన ఫ్రెండ్‌తో మ్యాడీ వాళ్లకి మన మీద అనుమానం వచ్చినట్లు ఉంది.. పెళ్లి అయి అప్పగింతలు అవ్వగానే మేం కారు ఎక్కగానే మధుకి మత్తు మందు ఇచ్చి పార్టీకి అప్పగించాలని అంటాడు. ఇంతలో శివకి వల్లి కాల్ చేస్తుంది. అంతా మనం అనుకున్నట్లే జరుగుతుంది మేడం.. కాసేపట్లో పెళ్లి తర్వాత అప్పగింతలు అని అంటాడు. ఎవరికీ అనుమానం రాకుండా మ్యానేజ్ చేయమని వల్లి చెప్తుంది.
పెళ్లి పీటల మీద శివ కూర్చొంటాడు. మహి శివని అనుమానంగా చూస్తుంటే శివ డైవర్ట్ చేయడానికి నవ్వుతాడు. మహికి మాత్రం అనుమానం పోదు. ఇక మధుమిత పెళ్లి కూతురిలా రెడీ అయి ఏడుస్తూ ఉంటుంది. తన పెళ్లితో సందడి చేస్తున్న మ్యాడీని చూసి ఏడుస్తుంది. ఏడుస్తున్న మధు దగ్గరకు స్వప్న వెళ్తుంది. మధు మహిని చూస్తూ ఏడ్వడం చూసి నువ్వు ప్రేమించిన వాడు పనులు చేస్తున్నాడు ఏంటా అని చూస్తున్నావా అని స్వప్న అడుగుతుంది. స్వప్న, మధుల మాటలు లోహిత చాటుగా వింటూ మధు మ్యాడీని ప్రేమిస్తుందని తెలుసుకొని షాక్ అయిపోతుంది.
స్వప్న మధుతో నువ్వు ప్రేమించిన వాడు నీ కళ్ల ముందే ఉంటే చెప్పకుండా నిన్ను నువ్వు మోసం చేసుకోకుండా మ్యాడీని కూడా మోసం చేస్తున్నావ్ అని స్వప్న అంటుంది. లోహిత మనసులో ఈ మధు అంతలా ఏడుస్తుంది ఏంటి.. కొంపతీసి మండపంలో బాంబ్ పేల్చుతుందా.. మ్యాడీని లవ్ చేస్తున్న మేటర్ చెప్పి పెళ్లి ఆపేస్తుందా.. అలా జరగకూడదు అని లోహిత అనుకుంటుంది. ఇంతలో లోహితకు శ్రేయ కాల్ చేస్తుంది. నువ్వేం టెన్షన్ పడకు మధు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే.. చిన్ని ప్రాబ్లమ్ సగం పోతుంది అంటుంది. అదేంటి అని శ్రేయ అంటే చిన్ని ఇంకా లైన్ లోకి రాలేదు కదా అని లోహిత కవర్ చేస్తుంది.
మధుతో గౌరీ పూజ చేయిస్తారు. మధు గదిలోకి వెళ్తుంటే స్వప్న ఆపుతుంది. లోహిత తన ఫ్రెండ్స్‌తో పాటు దూరం నుంచి చూస్తుంటుంది. స్వప్న మధుతో చివరి సారి అడుగుతున్నా.. నువ్వు మ్యాడీని లవ్ చేస్తున్నా అని చెప్తావా.. నేను చెప్పాలా.. నేనే చెప్తా అని స్వప్న వెళ్తుంటే మధు స్వప్నని కొట్టి.. ఈ పెళ్లి ఆపాలని ప్రయత్నిస్తే చంపేస్తా.. ఇంకోసారి ఈ విషయం గురించి మాట్లాడినా.. పెళ్లి ఆపాలని చూసినా నా మీద ఒట్టే అని ఏడుస్తూ వెళ్లిపోతుంది. స్వప్న ఏడుస్తూ వెళ్లిపోతుంది. లోహిత చూసి స్వప్నని ఇలా వదిలేయకూడదు స్టోర్ రూం దగ్గరకు తీసుకురావే అని ఫ్రెండ్‌కి చెప్తుంది.
మధుమితని బుట్టలో పెట్టి కల్యాణ మండపానికి తీసుకెళ్తారు. మధు, శివ ఒకరికి ఒకరు జీలకర్రా బెల్లం పెట్టుకునే టైంకి స్వప్న పెళ్లి ఆపమని అరుస్తుంది.అందరితో ఈ పెళ్లి మధుకి ఇష్టం లేదని చెప్తుంది. శివ మధు తల్లిదండ్రుల్ని నిలదీస్తారు. ఇంత వరకు వస్తే పెళ్లి ఇష్టం లేదని చెప్పడం ఏంటి అని అడుగుతాడు. లోహిత మధ్యలో దూరి మధు ఫ్రెండ్ ఫ్రాంక్ చేస్తున్నట్లు ఉంది.. మధుకి ఇష్టం లేకపోతే తనే చెప్పేది కదా అని అంటుంది. స్వరూప మధుతో అమ్మా మధు నీకు నిజంగా ఈ పెళ్లి ఇష్టం లేదా.. నీకు చెప్పి నువ్వు ఇష్టం అన్నాకే కదా ఇక్కడి వరకు వచ్చాం.. సుబ్బారావు మధుతో నువ్వు ముందే వద్దు అనుంటే ఇక్కడి వరకు వచ్చి పరువు పోయేది కాదు కదా అంటాడు.
మహి మధుని నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా చెప్పు మధు అని అడుగుతాడు. దానికి మధు ఈ పెళ్లి నాకు ఇష్టమే అని చెప్తుంది. పెళ్లికొడుకుని కూర్చొమని స్వరూప వాళ్లు చెప్తారు. స్వప్న అబద్ధం అని అంటుంది. ఇంతలో లోహిత స్వప్న మీద అరుస్తుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు మధు ఇష్టమే అని చెప్తుంది కదా.. నువ్వు ఈ పెళ్లి చెడగొట్టాలి అని ఇలా ప్లాన్ చేశావ్.. ఇక్కడి నుంచి వెళ్లిపో అవుట్ గెట్ అవుట్ అని అరుస్తుంది. ఇక మహి మధుతో నా కళ్లలోకి సూటి గా చూసి చెప్పు నీకు ఈ పెళ్లి ఇష్టమేనా అని అడుగుతాడు. మధు చెప్పలేదు.. ఎందుకంటే మధు నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి అని స్వప్న చెప్పేస్తుంది. అందరూ బిత్తరపోతారు. మహి కూడా షాక్ అయిపోతాడు. శివ,అతని తల్లి సుబ్బారావుని పరువు తీశారని నిలదీస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















