Chinni Serial Today October 2nd: చిన్ని సీరియల్: లోహిత, వరుణ్‌ల ప్రేమ విషయం తెలిసి మధు, మహి ఏం చేస్తారు? గుడిలో పెళ్లి చేస్తారా!
Chinni Serial Today Episode October 2nd లోహిత, వరుణ్‌ల ప్రేమ విషయం మధుకి తెలియడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode వరుణ్ నిశ్చితార్థం వేడుక మొదలవుతుంది. వరుణ్ దగ్గరకు శ్రేయ వెళ్లి ఎంత అందంగా ఉన్నావ్ అన్నయ్యా అని ఫొటోలు తీస్తుంది. ఇక అతిథి వాళ్లు వచ్చేస్తారు. పంతులు పూజ మొదలు పెట్టాలి అని వరుణ్, అతిథిలను పిలుస్తాడు. దేవా, నాగవల్లి, మహి అందరూ సందడి సందడి చేస్తుంటారు.
మరోవైపు సరళ లోహిత పెళ్లి చూపులకు అన్నీ ఏర్పాట్లు చేస్తుంది. లోహితకు ఓ చీర సెట్ చేయాలని పక్కింటికి వెళ్లి అడగాలి అని వెళ్లి ఆవిడను మీ చీరలు, నగలు బాగుంటాయి అని మీ అమ్మాయి చీర నగలు ఇవ్వవా అని అడుగుతుంది. ఆవిడ నగలు, చీర ఇచ్చి ఎలా ఇచ్చానో అలాగే తీసుకురావాలి అని చెప్తుంది. ఇక నుంచి ఇవి నావి అలాగే చూసుకుంటా అని సరళ అంటే అవసరం లేదు నా నగల్లా చూసుకో చాలు అంటుంది. ఇక చందు తల్లిని పిలిచి లోహిత ఇంకా రాలేదా ఈ ఒక్క రోజు కాలేజ్‌కి వెళ్లకపోతే నష్టం ఏంటి అని అడుగుతాడు. లోహితకు చందు కాల్ చేస్తాడు.. త్వరగా ఇంటికి రమ్మని చెప్తాడు.
లోహితకు తన ఫ్రెండ్ వరుణ్ నిశ్చితార్థం లైవ్‌లో వస్తుందని చెప్పి చూపిస్తుంది. లోహిత ఏడుస్తుంది. ఇంతలో మధు అక్కడికి వచ్చి ఏమైంది లోహి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే నాకు చెప్పు మేం సాయం చేస్తాం అంటుంది. లోహిత ఏడుస్తూ నేను మోసపోయాను.. వరుణ్ నన్ను దారుణంగా మోసం చేశాడు అని ఏడుస్తుంది. చేయి కట్ చేసుకుంటుంది. మధు చాలా కంగారు పడుతుంది. ఏంటి ఈ పిచ్చి పని ఏమైంది అని అడుగుతుంది. లోహిత ఏడుస్తూ నేను వరుణ్ ప్రేమించుకున్నాం మధు అని చెప్తుంది. మధు షాక్ అయిపోతుంది.
వరుణ్‌కి అమ్మాయి వాళ్లు బట్టలు పెడతారు. మార్చుకొని రమ్మని చెప్తారు. వరుణ్ డల్‌గా ఉండటం చూసి వసంత కంగారు పడుతుంది. వరుణ్ బట్టలు మార్చుకోవడానికి వెళ్తే వెనకాలే వసంత వెళ్లి నువ్వు ఇలా డల్‌గా ఉంటే ఎలా నువ్వు ఏ చిన్న మిస్‌టేక్ చేసినా నేను శ్రేయ విషం తాగి చస్తాం అని బెదిరిస్తుంది. మరోవైపు లోహిత ఏడుస్తూ కూర్చొంటుంది. స్టోరీ అంతా విని మధు అస్సలు నమ్మలేకపోతున్నా అని అంటుంది. వరుణ్ అంటే నాకు ప్రాణం తను లేకపోతే నేను బతకలేను అని అంటుంది. వరుణ్ తనని మోసం చేశాడని చెప్తుంది. రాత్రి కూడా పెళ్లి చేసుకుంటా అని ప్రామిస్ చేశాడని తాళి, చీర చూపిస్తుంది. గుడిలో పెళ్లి చేసుకుంటా అంటే వీటిని రెడీ చేసుకున్నా అని చెప్తుంది. లోహితని చూసి మధు, ఫ్రెండ్స్ ఉసూరుమంటారు.
మధు లోహితతో మీ లవ్ మేటర్ మ్యాడీకి చెప్పలేదా అంటుంది. లేదు వరుణ్‌కి చెప్పమని ఎన్నోసార్లు చెప్పా అయినా వరుణ్ చెప్పలేదు అని ఏడుస్తుంది. ఈ టైంలో మనకు మ్యాడీనే హెల్ప్ చేస్తాడు అని ఫోన్ చేస్తాడు. మ్యాడీ లిఫ్ట్ చేయడు.. దాంతో లోహిత చచ్చిపోతా అని ఏడుస్తుంది. మధు లోహితతో నీ ప్రేమ నిజం అయితే వరుణ్ నిన్ను నిజంగా ప్రేమిస్తే మీ ప్రేమను నేను గెలిపిస్తా.. ప్రేమించిన వాళ్లు దక్కకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు నీ ప్రేమని గెలిపిస్తా.. నువ్వు వెళ్లి గుడిలో పెళ్లి ఏర్పాట్లు చేసుకో నేను వెళ్లి మ్యాడీతో కలిసి వరుణ్ తీసుకొస్తా అని చెప్తుంది. లోహిత మనసులో మధు ఎలా అయినా వరుణ్‌ని తీసుకొస్తే బాగున్ను అని అనుకుంటుంది.
చందు లోహిత ఇంకా రాలేదని చాలా చాలా టెన్షన్ పడతాడు. ఇదేం కొంప ముంచుతుందో అని సరళ అంటుంది. ఇంతలో పంతులు వచ్చి పెళ్లి వాళ్లు గంటలో వస్తామని చెప్తారని అంటారు. సరళ వాళ్లు చాలా టెన్షన్ పడతారు. చందుకి కాల్ నుంచి ఒకరు కాల్ చేసి లోహిత లేదని బయటకు వెళ్లిపోయిందని అంటాడు. లోహితను తీసుకొస్తా అని చందు వెళ్తాడు. ఇక మధు మ్యాడీ వాళ్ల ఇంటికి వెళ్తుంది. మధు ఓ పాపతో మ్యాడీని పిలిపించి వరుణ్, లోహితల లవ్ మేటర్ చెప్తుంది. మహి షాక్ అయిపోతాడు. ఈ రోజు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారని.. గుడిలో పెళ్లి చేసుకోవాలని వరుణ్ కోసం ఎదురు చూస్తుందని చెప్తుంది. వరుణ్ లోహితల ప్రేమ నిజం అయితే గెలిపించాలి అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















