అన్వేషించండి

Jagadhatri Serial Today October 1st: జగద్ధాత్రి సీరియల్: శ్రీవల్లిని వైజయంతి తప్పుదారి పట్టించిందా! శ్రీవల్లి నిర్ణయానికి కారణమెవరు?

Jagadhatri Serial Today Episode October 1st శ్రీవల్లిని వైజయంతి ఇంటి నుంచి పంపాలని చూడటం జగద్ధాత్రి, కేథార్ అడ్డుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode శ్రీవల్లి జగద్ధాత్రిని పట్టుకొని ఏడుస్తుంది. జగద్ధాత్రి శ్రీవల్లితో వదిన చెప్పింది నిజమే బూచి అన్నయ్య మంచోడు అలాంటి వాడు కాదు అని చెప్తుంది. ఇక జగద్ధాత్రి, కౌషిక్‌లు శ్రీవల్లిని తమ గదికి తీసుకెళ్లి పడుకోపెట్టుకుంటారు. శ్రీవల్లిని భయపెట్టడానికే ఎవరో ఇలా చేశారు అని కేథార్ అనుకుంటే ఇందులో అత్తయ్య హస్తం ఉందా అని జగద్ధాత్రి అనుకుంటుంది.  

శ్రీవల్లి జగద్ధాత్రి గదికి వస్తుంటే వైజయంతి ఆపి ఇందాక అలా అన్నాను అని బాధ పడకు మా అల్లుడు మంచోడు కాదు ఆడపిల్లలు కనిపిస్తే వాళ్ల జీవితం నాశనం చేసేస్తాడు. ఈరోజు నేను చూసి కాపాడాను.. రోజూ కాపాడలేను కదా..  నీ మంచి కోసమే చెప్తున్నా ఈ ఇంటి నుంచి వెళ్లిపోయి ఏదైనా ఆశ్రమంలో తలదాచుకో.. నిన్ను నువ్వు కాపాడుకో అని చెప్పుంటుంది. రేపు ఉదయమే ఆశ్రమానికి వెళ్లిపోతా అని శ్రీవల్లి అంటుంది.  ఆ మాటలు తలచుకొని శ్రీవల్లి ఆలోచిస్తుంది.  అమ్మగారు చెప్పినట్లు రేపు ఉదయమే వెళ్లిపోవాలి అనుకుంటుంది. 

శ్రీవల్లి ఉదయం బ్యాగ్ తీసుకొని కౌషికి గదికి వెళ్తుంది. నిద్రలో ఉన్న కౌషికి దగ్గర కూర్చొని క్షమించండి అక్క.. ఈ అనాథ మీద మీరు చూపించిన ప్రేమ నేను ఎప్పుడూ చూడలేదు.. నా క్షేమం కోసం నా సొంత మనుషుల్లా మీరు మదన పడ్డారు. మీరే నా సొంత మనుషులు అనుకున్నా కానీ ఆ దేవుడికి నేను ఇక్కడ ఉండటం ఇష్టం లేదు.. నా వల్ల మీకు ఏ సమస్యలు రాకూడదు అని వెళ్లిపోతున్నా.. మళ్లీ జన్మ ఉంటే మీకు కేథార్ అన్నకి నేను తోడబుట్టిన దాన్ని అవ్వాలని చిన్నఆశ.. వెళ్లిపోతున్నా అక్క నన్ను క్షమించండి అని కౌషికి కాళ్లకి దండం పెట్టి బయటకు వెళ్తుంది. 

జగద్ధాత్రి, కేథార్ బయటే ఉంటారు. శ్రీవల్లి వెళ్తూ వాళ్లని చూసి ఇలా వెళ్తే ఆపేస్తారని వేరే దారిలో వెళ్లాలి అని అనుకుంటుంది. జగద్ధాత్రికి ఎవరో వచ్చినట్లు అనిపిస్తుంది. చూస్తే శ్రీవల్లి కనిపించదు. శ్రీవల్లి వెనక దారిలో గోడ దూకి బయటకు వెళ్లిపోతుంది. తీరా వెళ్లే సరికి ఎదురుగా జగద్ధాత్రి కనిపించి గుడ్ మార్నింగ్ చెప్తుంది. గురువు గారు ఆశ్రమానికి పిలిచారు అందుకే వెళ్తున్నా అని శ్రీవల్లి అంటుంది. కేథార్ వచ్చి ఏమైంది ఎక్కడికి శ్రీవల్లి వెళ్లిపోతుంది అంటే రాత్రి జరిగిన విషయానికి వెళ్లిపోతుందని జగద్ధాత్రి అంటుంది. ఇంతలో అక్కడికి బూచి వచ్చి శ్రీవల్లి అని పిలుస్తాడు. 

శ్రీవల్లి బూచిని చూసి వైజయంతి మాటలు గుర్తు చేసి వణికిపోతుంది. బూచి శ్రీవల్లి చేతులు పట్టుకోగానే శ్రీవల్లి ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. బూచి శ్రీవల్లితో రాత్రి జరిగినదానికి నా మీద నాకే అసహ్యం వేస్తుంది. కానీ నేను నీ మీద పడలేదమ్మా.. నిన్ను నా చెల్లిలా భావిస్తున్నాను.. నాకు తెలిసి ఆ వైజయంతి అత్తే తోసేసింది అని అంటాడు. ఏంటి అని జగద్ధాత్రి అడిగితే బూచి జగద్ధాత్రితో రాత్రి నేను వస్తే అత్తే డోర్ తీసింది.. అని బూచి చెప్తాడు. కేథార్ కూడా శ్రీవల్లితో బూచి అలాంటి వాడు కాదు నిన్ను చెల్లిలా చూసుకుంటాడు అని అంటాడు. అంతా అయోమయంగా ఉందని శ్రీవల్లి ఆలోచిస్తుంది. 

జగద్ధాత్రి, కేథార్ భయపడొద్దు అని ఎవరు ఏం చెప్పినా వినొద్దని శ్రీవల్లితో చెప్తారు. బూచి తన తల్లి మీద ప్రమాణం చేస్తాడు. ఇక శ్రీవల్లి వైజయంతి చెప్పిన మాటలు చెప్తుంది. ఇన్నీ నా గురించి చెప్పిందా చెప్తా ఆగు అని బూచి జగద్ధాత్రి ఆపుతుంది. శ్రీవల్లిని, బూచిని పంపిస్తుంది. కేథార్‌తో శ్రీవల్లిని బయపెట్టి పంపాలి అనుకున్నారు అంటే అత్తయ్యకి శ్రీవల్లికి ఏదో సంబంధం ఉందని జగద్ధాత్రి అంటుంది. ఇద్దరూ ఇక నుంచి వైజయంతిని కనిపెడుతూ ఉండాలని అనుకుంటారు. వైజయంతి శ్రీవల్లి వెళ్లిపోయిందని హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో ఎదురుగా శ్రీవల్లిని చూసి షాక్ అయిపోతుంది. ఇంకా ఇక్కడే ఉన్నావా అని వైజయంతి అంటే తను ఇక్కడే ఉంటుంది మీరు వెళ్లమని చెప్పాల్సిన పని లేదు అని జగద్ధాత్రి అంటుంది. నాకేం సంబంధం లేదని వైజయంతి అంటే అంతేనా పిన్నిఅని కేథార్ అంటాడు. కౌషికి, సుధాకర్ వస్తే శ్రీవల్లి ఇంటి నుంచి వెళ్లిపోవాలని అనుకుందని ఎవరో బూచి గురించి తప్పుగా చెప్పారని కేథార్ అంటాడు. ఎవరు చెప్పారు శ్రీవల్లి అని కౌషికి అడుగుతుంది. వైజయంతి కంగారు పడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 17th: నిండు మనసులు: మంజు ఇంట్లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం! కళ్లు తిరిగి పడిపోయిన ప్రేరణ.. కారణమేంటో తెలుసా!
నిండు మనసులు: మంజు ఇంట్లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం! కళ్లు తిరిగి పడిపోయిన ప్రేరణ.. కారణమేంటో తెలుసా!
Nindu Noorella Saavasam Serial Today August 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆశ్రమంలోకి దూరిన ప్రచండ – ప్రచండకు వార్నింగ్‌ ఇచ్చిన మనోహరి
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆశ్రమంలోకి దూరిన ప్రచండ – ప్రచండకు వార్నింగ్‌ ఇచ్చిన మనోహరి
Jabardasth Pavithra : జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?
జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?
Illu Illalu Pillalu Serial Today August 17th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమకి గోరింటాకు పెట్టిన ధీరజ్! చేతి మీద కల్యాణ్ పేరు రాసిందెవరు?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమకి గోరింటాకు పెట్టిన ధీరజ్! చేతి మీద కల్యాణ్ పేరు రాసిందెవరు?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget