(Source: ECI | ABP NEWS)
Chinni Serial Today October 24th: చిన్ని సీరియల్: మ్యాడీ-మధు ప్రేమలో కొత్త మలుపు! ఇంటికొచ్చి మధుని తిట్టిన నాగవల్లి!
Chinni Serial Today Episode October 24th మ్యాడీ మధు వాళ్ల ఇంటికి రాత్రి వచ్చి ఆరు బయట పడుకోవడం మధు కూడా మ్యాడీని చూసి వెళ్లి పక్కనే పడుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మ్యాడీ రాత్రి మధు వాళ్ల ఇంటికి వచ్చి డోర్ కొడతాడు. అందరూ పడుకోవడంతో ఎవరూ డోర్ తీయరు. దాంతో మ్యాడీ అందర్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకొని ఆరు బయట పడుకుంటాడు. సారీ డాడీ సారీ మమ్మీ మళ్లీ మిమల్ని వదిలేసి వచ్చేశా.. కానీ బావని వదల్లేక వచ్చేశా అనుకుంటాడు. ఇక చిన్ని గురించి ఆలోచిస్తూ అలిసిపోయా దేవుడా నా చిన్ని నాకు ఇచ్చేయ్ అని అంటాడు.
మధు గదిలో మ్యాడీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మహి మ్యాడీ ఒక్కరే అని తెలియనప్పుడు మ్యాడీ నా పక్కన ఉన్నాడు.. ఇప్పుడు మ్యాడీనే మహి అని తెలిశాక మ్యాడీ నాకు దూరం అయిపోయాడు అని మధు బాధ పడుతుంటుంది. ఇంతలో కిటికీ నుంచి మ్యాడీని చూస్తుంది. నా మ్యాడీ వచ్చేశాడు అని బయటకు వెళ్తుంది. మ్యాడీ దగ్గరకు వెళ్లి తలగడ పెట్టి దుప్పటి కప్పుతుంది. తర్వాత మ్యాడీ పక్కనే కూర్చొని మహి ఇన్నేళ్లు నువ్వు నీ చిన్నినీ వెతుకుతున్నావా.. ఈ చిన్నీ కోసం వెతుకుతున్నావా.. నా కోసం అమెరికా నుంచి వచ్చి మా కాలేజ్‌లో జాయిన్ అయి నాతోనే గొడవలు పడుతూ.. చివరకు నీకు తెలీకుండా నీ చిన్ని ప్రేమనే గెలిచావ్ అని అనుకుంటుంది. పడుకున్న మ్యాడీకి ముద్దు పెడుతుంది. దేవుడికి మన ప్రేమ నచ్చిందనుకుంటా అందుకే ఇలా నిన్ను నన్ను పక్కపక్కనే పెట్టి ప్రేమలాట ఆడుతున్నాడని అంటుంది. 
మధు మ్యాడీ తలగడ సర్దుతూ ఉంటే మ్యాడీ మధు చేతిని తల కింద పెట్టుకుంటాడు. ఇప్పుడు చేయి తీస్తే నువ్వు ఇబ్బంది అవుతావ్..నిజానికి నాకు తీయాలి అని లేదు నీ పక్కనే ఇలా ఉండాలని ఉంది అనుకుంటూ మ్యాడీని చూస్తూ మధు కూడా అక్కడే మ్యాడీ పక్కనే పడుకుండిపోతుంది. 
లోహిత ఉదయం నిద్ర లేచి బయటకు వచ్చి ఇద్దరినీ అలా చూసి షాక్ అయిపోతుంది. ఇద్దరూ ఇలా భార్యాభర్తల్లా పడుకున్నారేంటి నాకే ఏదోలా ఉంది ఏదో ఒకటి చేయాలి అని ఇద్దరి ముఖం మీద నీరు విసిరేసి పారిపోతుంది. ఇద్దరూ లేచి చూసి షాక్ అయిపోతారు. ఏంటి మధు నువ్వు ఇక్కడ అని మ్యాడీ అంటే నువ్వు నిద్రలో ఉంటే ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అలాగే పడుకున్నా అని అంటుంది. మధు తల్లి వచ్చి మీ ఇద్దరి స్నేహం చూస్తుంటే ముచ్చటగా ఉంది.. ఎవరి కళ్లు మీ మీద పడకూడదు అంటుంది. లోహిత చాటుగా మనసులో వాళ్లు ఫ్రెండ్స్ అని మీరు అనుకుంటున్నారు కానీ వాళ్లు అమర ప్రేమికులు అయిపోయారు అని అనుకుంటుంది. 
వరుణ్ మ్యాడీతో నువ్వు వెళ్లిపోయావ్ అని మధు చెప్పింది చాలా హ్యాపీగా ఫీలయ్యా మళ్లీ ఇక్కడికి వచ్చావ్ ఏంటి బావ అని అడిగితే మిమల్ని ఇంటికి తీసుకెళ్లడానికి ఒప్పించా నాన్న ఒప్పుకోలేదు అందుకే నేను వచ్చేశా అని మ్యాడీ చెప్తాడు. స్వరూప అందర్నిఫ్రెష్ అయి రమ్మని టిఫెన్ పెడతా అంటుంది. ఇక మధు చేయి పట్టేస్తుంది. అది చూసిన మ్యాడీ చేయి నొప్పిగా ఉందా అని అడుగుతాడు. లేదు అని మధు అంటుంది. ఇక తర్వాత నీతో కొంచెం మాట్లాడాలి బయటకు వెళ్దాం అని అంటుంది. ఇంతలో నాగవల్లి మధు వాళ్ల ఇంటికి వస్తుంది. 
నాగవల్లిని మధు చూసి భయంతో బయటకు వెళ్తుంది. మ్యాడీ మళ్లీ వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చాడా.. ఏం మందు పెట్టావే వాడిని.. ఏం చేస్తావో మమల్ని అని కోప్పడుతుంది. నువ్వు ఎదురైనా ప్రతీ సారీ మాకు ఏదో ఒక నష్టం జరుగుతూనే ఉంది అని కోప్పడుతుంది. నీ వల్ల మహారాజులా ఉన్న నా కొడుకు రోడ్డు పక్కన నూడీల్స్ బండి దగ్గర పని చేసే స్థాయికి దిగజార్చేశావ్ అని అంటుంది. వాడికి చిన్నప్పుడు చిన్ని అనే ఓ దెయ్యం పట్టింది.. ఆ దెయ్యం వదిలించడానికి వాడిని ఫారెన్ పంపేశాం.. కానీ వాడికి ఇప్పుడు కూడా ఆ దెయ్యం వదల్దేదు అని తెలిసింది.. అది చాలదు అన్నట్లు ఇప్పుడు నువ్వు ఒకదానివి తయారయ్యావా.. కనపడని ఆ దెయ్యం కనిపించే ఈ దెయ్యం నా బిడ్డను నాకు కాకుండా చేస్తున్నారు. బలవంతంగా మా ఇంటికి వాడిని తీసుకెళ్లినా సరే తెల్లారే సరికి వాడు నీ కొంపకివచ్చేలా చేశావ్.. ఇంకా నా కొడుకుని ఏం చేయాలి అనుకున్నావే అని అడుగుతుంది. 
మధు నాగవల్లితో ప్రమాణం చేసి చెప్తున్నా నేను కావాలని మిమల్ని దూరం చేయలేదు. లోహి, వరుణ్ పెళ్లి చేసుకోకపోతే చనిపోతారేమో అనే భయంతో వాళ్ల పెళ్లి చేశా అంతే కానీ మీ కొడుకు మీకు దూరం అవుతాడు అని అంటుంది. నాగవల్లి కోపంగా నువ్వు మ్యాడీకి దూరం అయితే తప్ప వాడు జీవితం బాగు పడదు.. నువ్వు నిజంగా మ్యాడీ మంచి కోరుకునేదానివే అయితే మ్యాడీ మాతో కలిసి ఉండాలి అని కోరుకుంటే నా బిడ్డను నాకు శాశ్వతంగా వదిలేయ్ అని చెప్తుంది. 
ఇంతలో మ్యాడీ లుంగీ, టీషర్ట్‌తో వస్తాడు. అది చూసి నాగవల్లి షాక్ అయిపోతుంది. నువ్వేంటి మమ్మీ ఇక్కడ అని మ్యాడీ అడిగితే వచ్చేలా చేసింది ఈ మహాతల్లి అని అంటుంది. అమ్మ కంటే ఇది నీకు ఎక్కువ అయిందా అని నాగవల్లి అంటుంది. మధుని ఏం అనొద్దు అని మ్యాడీ అంటాడు. చివరి సారిగా అడగటానికి వచ్చా నువ్వు ఈ కొంప వదిలి పెట్టి వస్తావా రావా అని అడుగుతుంది. లోహి వరుణ్ బావ వస్తే నేను వస్తా అని మ్యాడీ అంటాడు. నా మనసు నా మాట ఎప్పటికీ మారదు మమ్మీ అని మ్యాడీ అంటాడు. నాగవల్లి కోపంగా మధుతో నా బిడ్డను నాకు దూరం చేసినందుకు ఇంతకు ఇంతా అనుభవిస్తావే అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















