Ammayi garu Serial Today October 23rd: అమ్మాయిగారు సీరియల్: కోమలి అనాథని విరూపాక్షికి తెలిసిపోయిందా! కోమలికి ఫుల్ క్లాస్!
Ammayi garu Serial Today Episode October 23rd కోమలి అనాథాశ్రమంలో ఉండటం లేదని అశోక్ తల్లిదండ్రులకు తెలియడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode కోమలి, అశోక్‌లు బైక్ మీద వెళ్తుంటే రాజు ఫాలో అవుతాడు. విజయాంబిక, దీపక్‌ల దగ్గరకు రూప వెళ్లి నేను మీకు ఏం అన్యాయం చేశా అత్త ఎందుకు నన్ను రాజుని విడదీయాలి అని చూస్తున్నారు అని ముఖం మాడ్చుకుంటుంది. నీ విషయంలో తలదూర్చితే ఏదో చేస్తా అన్నావ్ ఏం చేస్తావో చేయ్ అని దీపక్ అంటాడు.
రూప మనసులో రాజు నిజంగానే మారిపోయాడని తెగ సంబరపడిపోతున్నారు అనుకొని పైకి మాత్రం రాజుకి నేను నిజం చెప్తా మీ పాపం ఊరికే పోదు.. అమ్మానాన్నల్ని విడదీశారు ఇప్పుడు నన్ను రాజుని విడదీస్తారా అని ఏడుపు నటిస్తుంది. కోమలి అశోక్‌తో మనం రాజుకి దొరకకూడదు ఏమైనా షార్ట్ కట్స్ ఉంటే అలా వెళ్లి రాజు దారి తప్పేలా చేయమని అంటుంది. లొకేషన్ ట్రేస్ చేస్తాడేమో అని కోమలి ఫోన్ ఆపేస్తుంది.
అనాథాశ్రమంలో అందరూ విరూపాక్షితో మాట్లాడుతారు. విరూపాక్షి అశోక్ తల్లిదండ్రుల్ని చూసి ఎవరు వీరు అని అడుగుతుంది. దాంతో వీళ్లు చాలా మంచివాళ్ల అనాథని కోడలిగా చేసుకుంటున్నారు అని చెప్తారు. విరూపాక్షి వాళ్లతో మీరు చాలా మంచివాళ్లు అండీ అనాథని భార్యగా చేసుకోవాలి అనుకున్న మీ కొడుకుది ఇంకా గొప్ప మనసు మీలాంటి వాళ్లకి ఎలాంటి ఆపద రాకూడదు అని విరూపాక్షి అంటుంది. అశోక్ తల్లిదండ్రులు విరూపాక్షిని కూడా పిలుస్తారు.
రమ్య కోమలికి విషయం చెప్పాలి అనుకుంటే కోమలి ఫోన్ ఆపేసుంటుంది. రమ్య చాలా టెన్షన్ పడుతుంది. అశోక్ రాజుని డైవర్ట్ చేసి వెళ్లిపోతారు. రాజు రూపకి విషయం చెప్తాడు. కోమలి ఏం ప్లాన్ చేసిందో అర్థం కావడం లేదు అని రాజు డిసప్పాయింట్ అవుతాడు. కోమలి సంగతి ఇంట్లో చూద్దాం నువ్వు వచ్చేయ్ అని రూప అంటుంది. కోమలి, అశోక్‌లు పరుగున వచ్చి విరూపాక్షికి చూసి షాక్ అయిపోతారు. ఇద్దరూ దాక్కుంటారు. ఏంటి అశోక్ విరూపాక్షి ఇక్కడే ఉన్నారు.. మీ అమ్మానాన్న ఇక్కడే ఉన్నారు.. వెంటనే ఎక్కడికైనా వెళ్లిపోదాం అని కోమలి అంటుంది. విరూపాక్షి వెళ్తాను అంటే అశోక్ వాళ్ల తల్లిదండ్రులు ఉండమని అడుగుతారు. అశోక్ వాళ్లకి కాల్ చేస్తే బైక్ పాడయింది అని చెప్తారు. దాంతో విరూపాక్షి వెళ్లిపోతుంది.
విరూపాక్షి వాళ్లు వెళ్లగానే కోమలి వాళ్లు వస్తారు. కోమలి అత్తమామలు కోమలితో రెండు నెలలుగా ఇక్కడ ఉండటం లేదంట ఏదో ఉద్యోగం చేస్తున్నావ్ అంట అని అడుగుతుంది. ఇక నిశ్చితార్థం గురించి ఆశ్రమంలో ఎందుకు చెప్పలేదు అని అడుగుతారు. మేం అంతా అనాథలం కదా నాకు ఫ్యామిలీ వస్తే వాళ్లకి లేదు అని బాధ పడతారు అని చెప్పలేదు అంటుంది. ఇక నిశ్చితార్థం ఉంగరం లేకపోవడం చూసి అశోక్ తల్లిదండ్రులు అడుగుతారు. ఉంగరం లూజుగా ఉంది జారిపోతే తీసి దేవుడి దగ్గర పెట్టాను అని అంటుంది. అందరూ అరిష్టం అని జాగ్రత్తగా ఉండమని అంటారు. కోమలి అందరికీ సారీ చెప్తుంది. కోమలి కోసం విజయాంబిక, దీపక్‌లు బయట వెయిట్ చేస్తారు. మేడ మీద నుంచి రాజు, రూపలు చూస్తుంటారు. ఇంతలో సూర్యప్రతాప్ వస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















