Nuvvunte Naa Jathaga Serial Today October 23rd: నువ్వుంటే నా జతగా: దేవా జైలుకు వెళ్తాడా? మిథున సంచలన నిర్ణయం! జడ్జి తీర్పు ఏంటో!
Nuvvunte Naa Jathaga Serial Today Episode October 23rd దేవా కేసు కోర్టుకి వెళ్లడం ఆదిత్య కేసు వాదించడం హరివర్దన్ ఏం తీర్పు ఇస్తారా అని అందరూ ఎదురు చూడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా కోర్టు దగ్గరకు వస్తే మిథున వెళ్లి మాట్లాడుతుంది. దేవా మిథునతో నేను ఎవరినీ ఊరికే కొట్టను. ఎమ్మెల్యే కొడుకుని కొట్టడానికి కారణం తెలిసిన రోజు నువ్వే పశ్చాత్తాప పడతావ్ అని దేవా చెప్తాడు. మిథున ఆశ్చర్యంగా చూస్తుంది.
మిథున మనసులో నువ్వు ప్రాణాలతో ఉండాలని నేను కోరుకుంటున్నా నా తపన నీకు అర్థం కాదు.. నువ్వు ఎంత ద్వేషించినా కోప్పడినా తప్పదు భరిస్తా అని మిథున అనుకుంటుంది. ఇక రమ్య వాళ్ల అమ్మ దేవా దగ్గరకు వెళ్లి మీ భార్యాభర్తల మాటలు విన్నాను దేవా.. మా కారణంగా మీ మధ్య అపార్థాలు పెరగడం నాకు బాధగా ఉంది.. పది మందికి మంచి చేసే నీ జీవితం జైలు పాలవ్వకూడదు.. అందుకే ఎమ్మెల్యే కొడుకుని నువ్వు ఎందుకు కొట్టావో కోర్టుతో పాటు నీ భార్యకి చెప్తా అని ఆవిడ అంటే దేవా వద్దు అని అలా చేస్తే వాడు చెల్లి మీద చేసిన అఘాయిత్యం లోకానికి తెలిసిపోతుంది. అది ఎవరికీ తెలీకూడదు ఆ బాధతో తను ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంది అని దేవా ఆవిడ చెప్పకుండా ఆపేస్తాడు. 
ఆదిత్య కోర్టుకి వస్తాడు. దేవా ఇక నీ పని అయిపోయిందిరా.. జీవితాంతం నీకు జైల్లోనే ఉంచుతా.. మిథున నేను ఒక్కటవుతాం అని అనుకుంటాడు. సత్యమూర్తి ఫ్యామిలీ కూడా కోర్టుకి వస్తారు. వాళ్లు చూస్తుండగానే ఆదిత్య మిథున దగ్గరకు వెళ్లి తాను ఎమ్మెల్యే లీగల్ అడ్వైజర్ అని ఈ కేసు తన దగ్గరకు వచ్చిందని దేవా జైలుకి వెళ్తే నీ పరిస్థితి ఏమవుతుందా అని ఆలోచించా అందుకే నువ్వు వద్దు అంటే ఈ కేసు వాదించను అని ఆదిత్య మిథునతో చెప్తాడు. ఏం అక్కర్లేదు ఆదిత్య నీ డ్యూటీ నువ్వు చేయ్ అని మిథున చెప్తుంది. నేను కేసు వాదిస్తే దేవా కచ్చితంగా జైలుకి వెళ్తాడు. అందులోనూ నువ్వే ప్రధాన సాక్షివి అని అంటాడు. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి మా నాన్న నాకు అదే నేర్పించాడు అని మిథున అంటుంది. 
కాంతం మిథున దగ్గరకు వెళ్లి చూశారా ఎంత తెగించి మాట్లాడుతుంది. ఆ వకీల్ సాబ్ కేసు వదిలేస్తా దేవాని బయటకు తీసుకొస్తా అన్నా కూడా మేడం గారు దేవా జైలుకి వెళ్లాలి అంటుంది. దేవా మీద ప్రతీకారం తీర్చుకోవడానికే తను ఇలా చేస్తుందని అర్థమైందా అని అంటుంది. భాను శారదతో నా కోడలు బంగారం నా కోడలు బంగారం అన్నారు ఆ కోడలు మీ కొడుకు జీవితం ఎలా చీకటి చేస్తుందో చూడండి అని అంటుంది. శారద ఏడుస్తూ నా కొడుకు జైలుకి వెళ్లడానికి కారణం నువ్వు కాదు నేను.. నమ్మించి ద్రోహం చేశావ్ అని అంటుంది.
మిథున చాలా బాధ పడుతుంది. మనసులో ఏదో ఒక రోజు మీరు నన్ను అర్థం చేసుకుంటారు అని అనుకుంటుంది. ఎమ్మెల్యే కూడా కోర్టుకి వస్తుంది. కోర్టు సీన్ మొదలవుతుంది. దేవా లోపలికి రావడంతో శారద ఏడుస్తుంది. దేవాని బోను దగ్గర నిల్చొపెడతారు. ఇక జడ్జి హరివర్ధన్ వస్తారు. అందరూ లేచి దండం పెడతారు. కేసు ఫైల్ చూసిన హరివర్ధన్ కేసు మొదలు పెట్టమని చెప్తారు. కాంతం జడ్జిని చూసి తీర్పు ఇచ్చేది ఈయన కాబట్టి దేవాకి పెద్ద శిక్ష వేస్తారని కాంతం అంటుంది. భాను కూడా తండ్రీ కూతుళ్లు కావాలనే చేస్తున్నారని అంటుంది. 
జడ్జి కేసు మొదలు పెట్టమని చెప్తారు. దేవా బోనులోకి వస్తాడు. ఆదిత్య దేవా దగ్గరకు వెళ్లి పేరు, ఏం పని చేస్తున్నారు అని అడుగుతాడు. దేవా పేరు చెప్పి పురుషోత్తం దగ్గర పని చేస్తున్నా అని అంటాడు. పురుషోత్తాన్ని అందరూ దాదా అంటారు మీరు రౌడీనా అని అడుగుతాడు. దేవా పురుషోత్తం దగ్గర రౌడీగా పని చేస్తున్నాడు. అతను ఎవరినైనా కొట్టమంటే కొట్టేస్తాడు. చంపమంటే చంపేస్తాడు.. దేవా మీద ఛార్జ్ షీట్ కూడా ఉంది.. ఎమ్మెల్యేని రాజకీయంగా ఎదగనివ్వకూడదు అని ఆమె కొడుకుని చంపడానికి ప్రయత్నించాడని అంటాడు. జడ్జి ఆదిత్యతో రాజకీయ కక్షలు అంటున్నారు ఆధారాలు ఏంటి అని అడుగుతారు. పురుషోత్తం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడని అందుకే దేవుడమ్మని ఎదుర్కొలేక ఇలా చేశాడని చెప్తారు. దేవా రణధీర్ మీద దాడి చేస్తుంటే ప్రత్యక్షంగా చూసిన సాక్షి ఉన్నారు ఆవిడను ప్రశ్నించడానికి అనుమతి ఇవ్వండి అని చెప్తాడు. మిథున బోనులోకి వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















