అన్వేషించండి

Nindu Manasulu Serial Today October 23rd Episode: నిండు మనసులు: తండ్రి కాలర్ పట్టుకొని నిలదీసిన సిద్ధూ! ప్రేరణ సంచలన ప్రశ్నలు సిద్ధూలో మార్పు తెస్తాయా!

Nindu Manasulu Serial Today Episode October 23rd సిద్ధూ తల్లిని నిర్లక్ష్యం చేశాడని విజయానంద్‌ కాలర్ పట్టుకొని గొడవ పడటం ప్రేరణ సిద్ధూతో గొడవ పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode మంజుల కళ్లు తిరిగి పడిపోయిందని సాహితి సిద్ధూకి కాల్ చేసి చెప్తుంది. సిద్ధూ, ప్రేరణ హడావుడిగా ఇంటికి వస్తారు. సిద్ధూ గుమ్మం వరకు పరుగున వచ్చి ఒక్క క్షణం ఆగిపోతాడు. ప్రేరణ అలా చూస్తుంది. తర్వాత సిద్ధూ వచ్చి తల్లిని హాస్పిటల్‌కి తీసుకెళ్తాడు.
Nindu Manasulu Serial Today October 23rd Episode: నిండు మనసులు: తండ్రి కాలర్ పట్టుకొని నిలదీసిన సిద్ధూ! ప్రేరణ సంచలన ప్రశ్నలు సిద్ధూలో మార్పు తెస్తాయా!

మంజులని డాక్టర్ చూస్తుంటారు. సాహితి ఏడిస్తే సిద్ధూ ఓదార్చుతాడు. అమ్మకి ఏం కాదు నువ్వు టెన్షన్ పడకు అని చెప్తాడు. డాక్టర్ మంజులని చూసి సిద్ధూ మీద కోప్పడుతుంది. ఎలాంటి పరిస్థితిలో ఆమెను తీసుకొచ్చారో తెలుసా బీపీ హైలో ఉంది ఇంకా నార్మల్ అవ్వడం లేదు.. ఏం ఆలోచిస్తున్నారో తెలీదు కానీ ఎక్కువ ఆలోచిస్తున్నారు..  మీ అమ్మకి ఎప్పటి నుంచి బీపీ ఉంది అంటే సాహితి వన్ ఇయర్ నుంచి అని చెప్తుంది. సిద్ధూకి తల్లి ఆరోగ్యం గురించి ఏం తెలీకపోవడంతో డాక్టర్ తిడుతుంది. కొడుకుగా మీకు ఏం తెలీకపోవడం ఏంటి అని కోప్పడుతుంది. హెల్త్ కండీషన్ చెప్పాలి అంటే గంట టైం పడుతుందని అంటారు.
Nindu Manasulu Serial Today October 23rd Episode: నిండు మనసులు: తండ్రి కాలర్ పట్టుకొని నిలదీసిన సిద్ధూ! ప్రేరణ సంచలన ప్రశ్నలు సిద్ధూలో మార్పు తెస్తాయా!

సిద్ధూ కోపంగా ఆ పెద్ద మనిషి ఎక్కడా అని అంటాడు. ఎక్కడో మీటింగ్ ఉందని వెళ్లారు నేను కాల్ చేసి చెప్తా అని సాహితి ఫోన్ చేసి చెప్తుంది. ప్రేరణ సిద్ధూకి మీ అమ్మకి ఏం కాదు అని ధైర్యం చెప్తుంది. విజయానంద్‌ వచ్చి సాహితి అమ్మకి ఎలా ఉంది అని అంటాడు. సిద్ధూ తండ్రి కాలర్ పట్టుకొని ఎందుకు వచ్చావ్ మా అమ్మ చచ్చిందో బతికిందో చూడటానికి వచ్చావా అని అడుగుతాడు. అసలు నువ్వు మనిషివేనా.. నువ్వు నీ బిజినెస్‌లు.. నీ డబ్బు.. అంతేనా మా అమ్మని పట్టించుకుంటున్నావా.. బంధం అంటే జీవితంలో ఓ మనిషిని తెచ్చుకోవడం కాదు.. తనకి ఏం కాకుండా చూసుకోవడం.. భార్య అంటే భ్రమింపచేయడం కాదు.. తన బాధ తెలుసుకొని తీర్చడం.. ఇవేవీ నీకు తెలీదు.. కానీ మా అమ్మ ఆరోగ్య పరిస్థితి నీకు తెలిసే అమ్మని వదిలి వెళ్లావ్ అంటే నిన్ను ఏం అనాలి.. అని అడుగుతాడు. సిద్ధూ ఆవేశంలో ఏం అనొద్దు అని విజయానంద్ అంటాడు. నేను మా అమ్మ దగ్గరకి వెళ్లడం పది నిమిషాలు లేటు అయింటే నాకు జరిగే నష్టాన్ని నీ కోట్ల రూపాయాలు పూడ్చేవి కాదు నేనే నిన్ను పూడ్చేవాడిని అని అంటాడు. ప్రేరణ, సాహితి సిద్ధూని కూల్ చేయాలని చూస్తారు. ఇంతలో డాక్టర్ వచ్చి గొడవ చేయొద్దని అంటుంది.
Nindu Manasulu Serial Today October 23rd Episode: నిండు మనసులు: తండ్రి కాలర్ పట్టుకొని నిలదీసిన సిద్ధూ! ప్రేరణ సంచలన ప్రశ్నలు సిద్ధూలో మార్పు తెస్తాయా!

మంజుల పరిస్థితి బాగానే ఉందని కోలుకున్న తర్వాత చూడమని అంటాడు. విజయానంద్ లోపలికి వెళ్తుంటే సిద్ధూ కోపంగా చూస్తాడు. దాంతో విజయానంద్ బయటే ఉండిపోతాడు. సిద్ధూ అమ్మ అనగానే మంజుల కళ్లు తెరుస్తుంది. సాహితి తల్లితో జరిగింది చెప్తుంది. మంజుల కొడుకు చేయి పట్టుకొని బాధ పడుతుంది. ఏంటి అమ్మా ఇది ఎందుకు అంత టెన్షన్ తీసుకుంటున్నావ్ అని సిద్ధూ అడుగుతాడు. నా బాధ నా ఒత్తిడి నా కడుపున పుట్టిన నీకు తెలీకపోతే ఇంకెవరికి తెలుస్తుందిరా అని అంటుంది.
Nindu Manasulu Serial Today October 23rd Episode: నిండు మనసులు: తండ్రి కాలర్ పట్టుకొని నిలదీసిన సిద్ధూ! ప్రేరణ సంచలన ప్రశ్నలు సిద్ధూలో మార్పు తెస్తాయా!

విజయానంద్ లోపలికి వచ్చి మంజు నిన్ను ఇంకెప్పుడు వదిలేసి వెళ్లను సారీ అని అంటాడు. ఇక సిద్ధూ తల్లితో అమ్మా నీకు ఇక ఏ ప్రమాదం లేదు నేను మళ్లీ వస్తాను అంటాడు. దాంతో మంజు బాధగా హాస్పిటల్‌కి మాత్రమే వస్తావా నాన్న అని అడుగుతుంది. సిద్ధూ బాధగా చూసి తల దించుకుంటాడు. ఏం మాట్లాడకుండా సాహితి అమ్మని జాగ్రత్తగా చూసుకో ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేయ్ అని చెప్పి వెళ్లిపోతాడు. ప్రేరణ కూడా వెనకాలే వెళ్తుంది.
Nindu Manasulu Serial Today October 23rd Episode: నిండు మనసులు: తండ్రి కాలర్ పట్టుకొని నిలదీసిన సిద్ధూ! ప్రేరణ సంచలన ప్రశ్నలు సిద్ధూలో మార్పు తెస్తాయా!

ఇందిర భర్తని బాల్కానీలో కూర్చొపెట్టి ప్రేరణ కాఫీ షాప్ గురించి చెప్తుంది. చిన్నదానికి ఓ దారి దొరికితే అంతకంటే అదృష్టం ఉండదు అని అనుకుంటుంది. ఇంతలో రాజశేఖరం కన్నార్పుడతాడు. ఇందిర మాట్లాడుతుంటే రాజశేఖరం రెప్ప వాల్చడం చూసి చాలా సంతోషపడుతుంది. వెంటనే ఈశ్వరి దగ్గరకు వెళ్లి ఎప్పుడూ లేనిది అయ్యగారు కన్ను రెప్పలు కదిల్చారు.. త్వరలోనే కోలుకుంటారు అని చెప్తుంది. ఈశ్వరి నమ్మదు.. దాంతో ఇందిర ఈశ్వరిని రాజశేఖర్ దగ్గరకు తీసుకెళ్తుంది. ఈశ్వరి పిలిస్తే రాజశేఖరంలో చలనం ఉండదు.. దాంతో ఈశ్వరి అంతా నీ భ్రమ అని తిడుతుంది. తర్వాత నువ్వు ఎందుకు అంత కంగారు ఆనందం కలగలిపి ఏదో సొంత మనిషి లేచినట్లు అలా వణికిపోతున్నావ్ అని అడుగుతుంది.  నేను సేవలు చేస్తున్నా కదా అమ్మ అందుకే అని అంటుంది. అన్ని విషయాలకు అంత అతిగా సంబర పడిపోకు అని ఈశ్వరి చెప్తుంది.
Nindu Manasulu Serial Today October 23rd Episode: నిండు మనసులు: తండ్రి కాలర్ పట్టుకొని నిలదీసిన సిద్ధూ! ప్రేరణ సంచలన ప్రశ్నలు సిద్ధూలో మార్పు తెస్తాయా!

సిద్ధూ, ప్రేరణ కేఫ్‌కి వచ్చేస్తారు. సిద్ధూ కోపంగా ఆ ఇంటికి మా అమ్మకి దూరంగా ఎందుకు ఉంటాను అని అడిగావ్ కదా ప్రేరణ ఇందుకే..చూశావ్ కదా ఆ మనిషి మా అమ్మని ఎలా వదిలేశాడో.. ఇలాంటి మెంటాలిటీతో మనుషులతో ఆడుకుంటాడని ఆ మనిషికి దూరంగా ఉంటున్నాను.. ఆ మనిషి మొదటి నుంచి అంతే ఒళ్లంతా స్వార్థం నచ్చని నన్ను శత్రువులా చూశాడు.. నమ్ముకున్న మా అమ్మ ప్రాణాలు తీయాలి అని చూశాడు.. ఒక్క నిమిషం నేను వెళ్లడం లేటు అయ్యుంటే మా అమ్మ ప్రాణాలు పోయేవి.. వ్యాపారానికి ఇచ్చే విలువ అయిన వాళ్లకి ఇవ్వరు ఆయన అని సిద్ధూ అంటే షట్‌ఆప్ సిద్ధూ అని ప్రేరణ అరుస్తుంది.
Nindu Manasulu Serial Today October 23rd Episode: నిండు మనసులు: తండ్రి కాలర్ పట్టుకొని నిలదీసిన సిద్ధూ! ప్రేరణ సంచలన ప్రశ్నలు సిద్ధూలో మార్పు తెస్తాయా!

సిద్ధూ షాక్ అయిపోతాడు. విలువల్ని మర్చిపోయింది నువ్వు. అయినవాళ్లని అపహేళన చేసింది నువ్వు.. ఆయన కాదు. ఆయన నిన్ను కనకపోవచ్చు. నీకు తండ్రి కాకపోవచ్చు.. కానీ మమీ అమ్మకి బతుకు ఇచ్చాడు.. ఆయన సమయానికి రాలేదు సరే.. మీ అమ్మ అలా దిక్కులేని స్థితిలో పడున్నప్పుడు నీ మనసులో అలా చూసి ఎంత తపన పడాలి.. కానీ నువ్వేం చేశాం.. గుమ్మం దాకా వచ్చిన నువ్వు గమ్మం దాటడానికి క్షణం ఆగిపోయావ్..అలాంటి నిన్ను ఏం అనాలి.. చావు బతుకుల మధ్య ఉన్న తల్లిని చూసిన ఎవరికైనా మరో ఆలోచన వస్తుందా.. అంత అహం అడ్డు పడుతుందా.. అలాంటి నీకు అమ్మ మీద ప్రేమ ఉన్నాట్లా.. అని అడుగుతుంది.
Nindu Manasulu Serial Today October 23rd Episode: నిండు మనసులు: తండ్రి కాలర్ పట్టుకొని నిలదీసిన సిద్ధూ! ప్రేరణ సంచలన ప్రశ్నలు సిద్ధూలో మార్పు తెస్తాయా!

అమ్మ మీద అహం చూపించే అంత మూర్ఖుడికి కాదు నేను అని సిద్ధూ అంటాడు. గతంలో ఏం జరిగిందో ఆయన వల్ల నేను అంత నష్టపోయానో నీకు తెలీదు అని సిద్ధూ అంటాడు. దానికి ప్రేరణ ఏంటి నష్టపోయావ్ నువ్వు నీ గతం మీ అమ్మ కంటే ముఖ్యమైనది కాదు.. నీ గతం మీ అమ్మ ప్రాణాల కంటే ముఖ్యమైనది కాదు అని అంటుంది. నీ ఆత్మాభిమానం మీ అమ్మ నీ మీద పెంచుకున్న ప్రేమ కంటే ఎక్కువ కాదు అని చెప్తుంది. ప్రేరణ కూల్ అయి సిద్ధూని కూర్చొపెట్టి నువ్వు గుమ్మం ముందు ఆగిన ఆ ఒక్క క్షణం చాలు నువ్వు మీ అమ్మని కోల్పోవడానికి అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 18th:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
జగద్ధాత్రి సీరియల్:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
Godavari Serial Today August 18th: 'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
Anu Sri Raj: సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget