Chinni Serial Today October 23rd: చిన్ని సీరియల్: మధు కళ్లముందే మ్యాడీని తీసుకెళ్లిపోయిన నాగవల్లి! లోహితకు బిగ్ షాక్!
Chinni Serial Today Episode October 23rd మధు మీద నాగవల్లి కోప్పడి మహిని ఇంటికి తీసుకెళ్లిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధు అలియాస్ చిన్నికి మ్యాడీనే తన చిన్ననాటి మహి అని తెలిసిపోతుంది. మ్యాడీకి ఆ విషయం చెప్పడానికి ఆంజనేయస్వామి విగ్రహం దగ్గరకు తీసుకెళ్తుంది. తాను చిన్ని అని చెప్పే టైంకి నాగవల్లి వచ్చి మధు ముందు నిల్చొంటుంది. మధు షాక్ అయిపోతుంది.
నాగవల్లి కోపంగా ఏంటే నువ్వు చెప్పేది ఏం చెప్తావే మా మ్యాడీకి.. నువ్వు నా కొడుకు జీవితం నాశనం చేయడానికి వచ్చా అని చెప్తావా.. నా కొడుకు కోసం నేను యాగం చేశానే.. అందుకే నా కొడుకు ఇక్కడి వరకు వచ్చాడు. వాడిని అడ్డుకోవడానికి నువ్వు సైంధవుడిలా వచ్చేవే.. అని కోప్పడుతుంది. మ్యాడీ మధ్యలో కలుగజేసుకుంటే మాట్లాడొద్దని నాగవల్లి అంటుంది. నేను చెప్పేది వినండి అని మధు అంటే నువ్వేంటే నాకు చెప్పేది అని నాగవల్లి అంటుంది. 
నాగవల్లి కోపంతో నా కొడుకు ముఖం చూసి ఇప్పటి వరకు నిన్ను వదిలేశాను.. ఇప్పుడు మా యాగఫలం మాకు దక్కకుండా చూస్తే ఊరుకోను అని అంటుంది. మధు తప్పు ఏం లేదు అని మ్యాడీ అంటే పది మందిలో మీ డాడీ పరువు పోయేలా వరుణ్ పెళ్లి చేయడం తప్పు కాదా.. నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు అని తెలిసి కూడా నిన్ను తన ఇంట్లో పెట్టుకోవడం తప్పు కాదా.. అక్కడ యాగం జరుగుతుంటే నువ్వు రాకుండా చేసి ఇక్కడ నీతో మాట్లాడుతూ ఉండటం తన తప్పు కాదా అని అడుగుతుంది. యాగం గురించి నాకు తెలీదు అని మధు అంటుంది. మ్యాడీ మీ ఇంటికి వస్తాను అంటే ఇప్పుడే ఇటు నుంచి ఇటు మీ ఇంటికి తీసుకెళ్లండి నేను అడ్డు రాను అని మధు అంటుంది. 
వల్లీ కోపంతో అంటే నా కొడుకుని దమ్ముంటే తీసుకెళ్లు అని నాతో ఛాలెంజ్ చేస్తున్నావా అని అడుగుతుంది. నేను అలా అనలేదు ఒట్టు అని మధు అంటే నీలాంటి వాళ్లు ఎన్ని ఒట్లు అయినా వేస్తారే అని నాగవల్లి అంటే మధు మర్యాదగా మాట్లాడమని అంటుంది. దాంతో నాగవల్లి మధుని కొట్టబోతే మ్యాడీ మధ్యలో వస్తాడు. దాంతో మ్యాడీకి చెంప దెబ్బ తగులుతుంది. నాగవల్లి షాక్ అయిపోతుంది. నాన్న దెబ్బ గట్టిగా తగిలిందా అని మ్యాడీని అడుగుతుంది. దీని కంటే నువ్వు మధుకి అన్న మాటలకు ఇంకా ఎక్కువ బాధగా ఉందమ్మా అని మ్యాడీ అంటాడు. చూశావే చూశావా వాడికి ఈ తల్లి కంటే నువ్వే ఎక్కువ అన్నట్లు మాట్లాడుతున్నాడు.. ఇప్పుడే తేల్చేస్తా వాడికి నువ్వు ఎక్కువో నేను ఎక్కువో తేల్చేస్తా.. రేయ్ మ్యాడీ దాన్ని చెప్పుతో కొట్టినట్లు నాతో మన ఇంటికి వస్తావా.. లేక నన్ను చెప్పుతో కొట్టినట్లు దాని కొంపకి పోతావా చెప్పు అని అడుగుతుంది. మమ్మీ అని మ్యాడీ అంటే వస్తావా రావా.. వస్తావా రావా.. అని అడుగుతుంది. 
నాగవల్లి మ్యాడీ చేయి తన తల మీద పెట్టుకొని ఇప్పుడు నువ్వు నాతో రాకపోతే నేను చచ్చినంత ఒట్టే అని అంటుంది. మ్యాడీని తీసుకొని వెళ్లిపోతుంది. మధు ఏడుస్తుంది. నాగవల్లి దేవా దగ్గరకు మ్యాడీని తీసుకెళ్లి ఇంటికి వెళ్దాం పద బావ అని అంటుంది. అందరూ ఇంటికి వెళ్లిపోతారు. 
లోహిత చందుని కలుస్తుంది. చందు లోహితను ఏంటి లోహి ఇలా ట్రిప్పులు అవీ ఇవీ అని అబద్ధాలు చెప్తూ తిరుగుతున్నావ్ ఎందుకు అని అడుగుతాడు. నాకు ఆ ఇంట్లో ఉండటం ఇష్టం లేక బయటకు వచ్చి పీజీలో ఉంటున్నా అని అంటుంది. అక్కడే ఉంటే నాకు నచ్చని పెళ్లి చేస్తారు అని వచ్చేశా అని అంటుంది. అయిందేదో అయిపోయింది ఇంటికిరా అని చందు పిలుస్తాడు. దానికి లోహిత అందరూ చూస్తున్నారు పరువు పోతుంది అన్నయ్య నువ్వు ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్లకపోతే నేను చచ్చినంత ఒట్టు అని చెప్పి చందుని పంపేస్తుంది. 
చందు వెళ్లగానే వరుణ్ వస్తాడు. ఇక్కడున్నావేంటి లోహి అని వరుణ్ అడిగితే మ్యాడీ మాత్రమే మన కోసం కష్టపడుతున్నాడని జాబ్ చేయాలని వచ్చాను అని అంటుంది. మీరు బిలియనీర్స్ కదా నువ్వు జాబ్ చేయడం ఏంటి .. అని అడుగుతాడు. దానికి లోహి తప్పదు ఇంట్లో చెప్పలేను అంటుంది. నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం లేదు అంత అయితే నేను చేస్తా అని వరుణ్ అంటాడు.
మధు ఇంటికి వస్తుంది. లోహిత వాళ్లు చందు కోసం అడుగుతారు. మ్యాడీని వాళ్ల అమ్మానాన్న తీసుకెళ్లిపోయారని చెప్తుంది. వరుణ్ హ్యాపీగా ఫీలవుతాడు. మన పరిస్థితి ఏంటి అని లోహిత అంటుంది. పోనీలేమ్మా అంత గొప్పింటి బిడ్డ వాళ్ల ఇంటికి వెళ్లి పోయాడు మంచిదే అనుకుంటారు. మధు బాధగా వెళ్లిపోతుంది. పెళ్లి కొడుకు బొమ్మ పట్టుకొని నా చిన్ననాటి ఫ్రెండ్ మహి.. నేను ప్రాణంగా ప్రేమిస్తున్న మ్యాడీ ఇద్దరూ ఒక్కరేనా.. నువ్వు ఇన్నాళ్లుగా పిచ్చిగా ప్రేమిస్తున్నా నీ చిన్ని నేనే మహి అని అనుకుంటుంది. రాత్రి మ్యాడీ మధు వాళ్ల ఇంటికి వస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















