అన్వేషించండి

Jagadhatri Serial Today August 18th:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?

Jagadhatri Serial Today Episode August 18th: సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?

Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్‌ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. షాక్‌ ట్రీట్‌మెంట్ ఇస్తే సుధాకర్‌కు కాళ్లు వస్తాయని అందుకోసం ఓ పథకం వేస్తారు. నా దగ్గర విషం లేని పాములు వదిలి అవి నాన్న చూసేలా చేస్తే ఆయన భయంతో లేచి నిల్చుంటారని కేదార్ అంటాడు. క్రెడిట్‌ కేదార్‌కు పోతుందని నేనే పాముల దగ్గర నిల్చుంటానని యువరాజు అంటాడు. పాముల అతనికి డబ్బులిచ్చి కోరలు లేని పాములు కాకుండా నిజం పాములే ఇంట్లో వదిలిపెట్టేలా ఆదిలక్ష్మీ కుట్ర చేస్తుంది.
మిశ్రాకు జేడీ షాక్‌
                       కోర్టులో మిశ్రాను ఎదిరించిన తర్వాత ఖచ్చితంగా ఆయన తనను ట్రాన్స్‌ఫర్ చేయడమో  లేక ఈ కేసు నుంచి తొలగించడమో చేస్తాడని ముందే  ఊహించిన జేడీ....కావాలనే అతన్ని రెచ్చగొట్టి పందెంకట్టేలా చేస్తుంది.  ఇప్పుడు జేడీని ఈ కేసు నుంచి తప్పిస్తే మిశ్రా ఈగో హర్ట్‌ అవుతుంది కాబట్టి చచ్చినా ఆ పని చేయడని కేదార్ అంటాడు. జేడీ తెలివితేటలు చూసి సాధూ కూడా మెచ్చుకుంటాడు. చాలా మంచి పని చేశావని...లేకపోతే ఈ కేసు నుంచి నిన్ను తప్పించడానికి ఎంతదూరమైనా వివేక్ వెళ్లేవాడని సాధూ అంటాడు.ఇప్పుడు అతని చేతులు కట్టిపడేశావని చెబుతాడు. ఇక మేం వెళ్లి హాయిగా ఈ కేసులో సాక్షాధారాలు సంపాదించుకోవచ్చని జేడీ అంటుంది.
సుధాకర్‌ బాధ
                    బెడ్‌రూమ్‌ నుంచి హాల్లో కూర్చోబెట్టడానికి సుధాకర్‌ను తీసుకొస్తూ వైజయంతి ఆపసోపాలు పడుతుంది.నా నడుము విరిగిపోయిందంటూ కూలబడుతుంది. ఇంట్లో వాళ్లంతా తనకు సేవలు చేయడం చూడలేకపోతున్న సుధాకర్‌..ఆస్పత్రి నుంచి కేర్‌టేకర్‌ను రమ్మని చెబుతానని అంటాడు. ఇంట్లో ఇంతమంది ఉన్న తర్వాత కేర్‌టేకర్‌ పెట్టుకోవడం ఏంటని కమలాకర్‌, కౌషికి అంటారు. మీరు మాకు ఎప్పుడూ భారం కాదని అంటారు.అయినాకానీ మీతో ఇలా సేవలు చేయించుకోవడం నేను తట్టుకోలేకపోతున్నానని బాధపడతాడు. వైజయంతి దీర్ఘంగా ఆలోచిస్తుండటంతో కేదార్‌, జగధాత్రి ఏమైందని అడుగుతారు. నడవలేకపోతున్నందుకు బాబాయి చాలా బాధపడుతున్నారని చెబుతుంది.  ఏదైనా షాక్‌ ట్రీట్‌మెంట్ ఇస్తే నాన్న లేచి నిల్చుంటారని కేదార్‌ అంటాడు. నేను గదిలో ఇయర్‌ఫోన్‌ పెట్టుకుని అటు తిరిగి నిల్చుంటాను...మీరు డమ్మీ పాములు వదలండని అప్పుడు నాన్న నన్నుకాపాడటం కోసమైనా లేచి వస్తారని అంటాడు. దీంతో పేరు మొత్తం కేదార్‌కు పోతుందని నిషిక యువరాజుతో అంటుంది. దీంతో యువరాజు కల్పించుకుని అసలు నాన్న నిన్ను కొడుకుగానే ఒప్పుకోవడం లేదు...నువ్వు చస్తుంటే ఆయన ఎందుకు వచ్చి కాపాడతాడని అంటాడు. నేనే అక్కడ నిల్చుంటానని మీరే పాములు వదలండని అంటాడు. ఎవరు నిల్చుంటే ఏముంది నాన్న లేచి నడవడం ముఖ్యమని కేదార్ అంటాడు.
పాములు పట్టే వాడిని పిలిచి కోరలు లేని పాములు తెప్పిస్తానని కేదార్ అంటాడు.
ఆదిలక్ష్మీ కుట్ర
                      వీళ్ల మాటలు విన్న ఆదిలక్ష్మీ నాకు మంచి ఛాన్స్ దొరికిందని సంబరపడిపోతుంది. పాములుపట్టే వాడిని మధ్యలోనే ఆపేసి...వాడికి తన చేతులకు ఉన్న బంగారు గాజులు ఇచ్చేస్తుంది. నువ్వు కోరలు లేని పాములు కాకుండా విషం ఉన్న పాములనే వాళ్లకు ఇవ్వాలని చెబుతుంది.ఈ పని చేస్తే నీకు ఇంకా చాలా డబ్బులు ఇస్తానని చెబుతుంది. ఆమె చెప్పినట్లే వాడు కోరలు తీయని విషం  ఉన్న పామును తీసుకొచ్చి ఇస్తాడు. ఈ విషయం తెలియని యువరాజు హాల్లో ఇయర్‌ఫోన్ పెట్టుకుని పాటలు వింటున్నట్లు నటిస్తాడు. అప్పుడే కేదార్ హాల్లో పామును వదులుతాడు. పాములుపట్టేవాడు పోలీసులు వచ్చి నన్నే పట్టుకుంటారని భయపడుతూ ఆదిలక్ష్మీకి చెబుతాడు. నువ్వేభయపడకని  ఆ విషం ఉన్న పాములు ఇవ్వమని జగధాత్రి,కేదార్‌ చెప్పారని చెప్పు అంటుంది. ఈ దెబ్బకు ఒక కొడుకు పాము కరిచి ప్రాణాలు కోల్పోతే...ఇంకో కొడుకు జైలుపాలవుతాడని ఆదిలక్ష్మీ సంబరపడిపోతుంది. హాల్లో పాము రావడం చూసి సుధాకర్‌ అరవడంతో ఈరోజు ఎపిసోడ్‌ ముగిసిపోతుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 18th:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
జగద్ధాత్రి సీరియల్:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
Godavari Serial Today August 18th: 'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
Anu Sri Raj: సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget