Chinni Serial Today May 28th: చిన్ని సీరియల్: బాలరాజుకి బెయిల్ వచ్చిందా.. కావేరి, రాజు కలిసిపోయారా.. ఆ ప్రపోజల్ ఏంటి?
Chinni Today Episode బాలరాజుకి బెయిల్ ఇప్పించడానికి లక్ష రూపాయల కోసం చిన్ని, కావేరి చాలా కష్టపడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode నాగవల్లి, దేవేంద్ర వర్మ మహిని తీసుకొని సరళ ఇంటికి వస్తారు. పిల్లల్ని ఆడుకోమని పంపిస్తారు. ఉష టీచర్ ఇక్కడే ఉన్నారా అని దేవా అంటే దానికి నాగవల్లి ఇలాంటి టైంలో పుట్టింటిని వదిలి వెళ్లలేరు కదా అని అంటుంది. సరళతో దేవా నువ్వు నన్ను అన్నయ్య అంటూ ఉంటావ్ కదా నీకు జరిగిన అన్యాయానికి ఆ బాలరాజుకి శిక్ష పడేలా చేస్తా అంటాడు.
నాగవల్లి: నువ్వేమో ఆ బాలరాజుకి శిక్ష పడేలా చేయాలి అనుకుంటున్నావ్ కానీ ఆ బాలరాజుకి శిక్ష పడకుండా చేసేవాళ్లు పక్కనే ఉన్నారు కదా బావ.
దేవా: ఎవరి గురించి నాగవల్లి నువ్వు మాట్లాడుతుంది.
నాగవల్లి: ఇంకెవరి కోసం ఈ టీచర్ కోసమే. ఆ బాలరాజు చేసిన దారుణం మర్చిపోయి తన భర్తని ఎలా అయినా కాపాడుకోవాలని కంకణం కట్టుకున్నట్లు ఉంది ఈ మహా తల్లి. భర్త అంటే భర్తలా ఫీలవుతుందేమో అని నా అనుమానం. అదే బావ ఈ ఉషా టీచర్ అచ్చం కావేరిలా ఉంటుంది కదా అలా ఉన్నందుకు సత్యంబాబుని అన్నలా ఫీలవుతుంది కదా అలాగే బాలరాజుని కూడా భర్తలా ఫీలైందేమో అని. బావ ఇది నా మాట కాదు బయట అందరూ అనుకుంటున్నారు.
దేవా: ఇలాంటి వాళ్లు ఎంత మంది ఆ బాలరాజుని బయట పడేయాలి అని చూసినా నేను వాడికి శిక్ష పడేలా చేస్తా. వాడికి 14 ఏళ్ల శిక్ష పడుతుంది.
నాగవల్లి: మీరు ఒకసారి కోర్టుకి రావాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడు రావాలో అప్పుడు కారు పంపిస్తా మీరు వచ్చి మీ భర్తని చంపింది ఆ బాలరాజే అని చెప్తే చాలా వాడికి శిక్ష పడుతుంది. వస్తాం అండీ.
దేవా: ఇప్పుడు అదిరిపోయే డోస్ ఇచ్చాం కావేరికి ఫ్యూచర్‌లో ఫుల్ డోస్ ఇద్దాం.
నాగవల్లి: బయటకు వచ్చిన కావేరితో ఏంటే అలా చూస్తున్నావ్. నువ్వు కావేరి అని తెలిసినా నిన్ను ఏం చేయకుండా ఎందుకు వదిలేశాం అని అనుకుంటున్నావా. నువ్వు ఉష పేరుతో ఉన్న ముసుగుని నీతోనే తీయిస్తాం. నేను ఎంత వైలెంటో నీకు తెలుసు కదా. జైలులో నీకు స్పాట్ పెడితే ఆ బాలరాజు కాపాడాడు. ఇప్పుడు మీ ఇద్దరికీ స్పాట్ పెట్టా. ఆ బాలరాజుకి జైలు శిక్ష. మా అక్కని చంపిన నిన్ను పైకే పంపిస్తా. అమ్మ లాంటి నా అక్కని చంపిన వాళ్లని నేను ఎందుకు వదులుతాను. నా అక్కని చంపిన వాళ్లని చంపేవరకు వదలను.
కావేరి: మనసులో వీలైనంత త్వరగా బాలరాజుకి బెయిల్ వచ్చేలా చేయాలి.
ఆఫ్ టికెట్ పరుగున చిన్ని, భారతిల దగ్గరకు వెళ్లి బాలరాజుకి బెయిల్ వచ్చిందని చెప్తాడు. బాలరాజు కావేరిలు టెడ్డీబెయిర్ బొమ్మలు తీసుకొని చిన్ని దగ్గరకు వస్తారు. చిన్ని తల్లిదండ్రుల్ని చూసి చాలా సంతోషపడుతుంది. బాలరాజు బొమ్మలు చిన్నికి ఇస్తాడు. కావేరి జున్ను ఇచ్చి నీకోసం మీ నాన్న నీకు ఇష్టమైన జున్ను తీసుకొచ్చారని చెప్తుంది. చిన్ని తనకు చాలా హ్యాపీగా ఉందని కానీ కావేరి, బాలరాజులది ప్రేమ పెళ్లి కదా మీరు ప్రపోజ్ చేసుకోవడం చూడలేదు ఇప్పుడు ప్రపోజ్ చేసుకోండి అని చెప్తుంది. బాలరాజు సరే అని చెప్పి గులాబి పువ్వుతో మోకాల మీద కూర్చొని కావేరికి ఐలవ్‌యూ చెప్తాడు. కావేరిని దగ్గరకు తీసుకొని నుదిటిపైన ముద్దు పెడతాడు. అందరూ చప్పట్లు కొడతారు. చిన్ని కూడా నిద్రలో చప్పట్లు కొడుతూ ఉంటే భారతి ఏమైందని అడిగితే నాన్న బెయిల్ మీద వచ్చి అమ్మానాన్న కలిసినట్లు కల వచ్చిందని అంటుంది. వేకువ జామున వచ్చే కలలు నిజం అవుతాయి అంటారు కచ్చితంగా నీ కల నిజం అవుతుందని భారతి అంటుంది.
కావేరి బాలరాజుకి ఎలా బెయిల్ ఇప్పించాలా అని ఆలోచిస్తుంది. చిన్ని, ఆఫ్ టికెట్ కావేరి దగ్గరకు వస్తారు. లాయర్ అంకుల్ ఒక సలహా ఇచ్చారని లక్ష రూపాయలు కడితే పూచికత్తు మీద బెయిల్ వస్తుందని అంటుంది. లక్ష రూపాయలా అని కావేరి నోరెళ్లబెడుతుంది. దాంతో చిన్ని తన ఫంక్షన్ కోసం బాలరాజు కొన్న చైన్ అమ్మేస్తాను. లాయర్ అంకుల్ 10 వేలు ఇస్తారు. మిగతావి నువ్వు సెట్ చేయ్ అని అంటే కావేరి తన చేతికి ఉన్న గాజులు ఇచ్చి అమ్మేసి డబ్బు తీసుకురమ్మని చెప్తుంది. మిగతా డబ్బు తాను సెట్ చేస్తా అంటుంది. చిన్ని, ఆఫ్ టికెట్ వెళ్తారు.
దేవా ఫోన్‌కి లాయర్ కాల్ చేస్తారు. నాగవల్లి కాల్ లిఫ్ట్ చేస్తుంది. బాలరాజుని బయటకు తీసుకురావడానికి వాళ్లు గట్టిగా ప్రయత్నిస్తున్నారని లక్ష పూచికత్తు కట్టడానికి రెడీ అవుతున్నారని లాయర్ చెప్తే నాగవల్లి వాడు రాకూడదు అని అంటుంది. ఇంతలో దేవా కాల్ లిఫ్ట్ చేసి లాయర్ మీద అరుస్తాడు. వాళ్లు లక్ష రూపాయలు సంపాదించలేరు వాడు రాడులే అని దేవా నాగవల్లితో చెప్తుంది. కావేరి తన తోటి టీచర్స్‌కి డబ్బులు అడుగుతుంటుంది. ఆమె పది వేలు ఇస్తాను అంటుంది. చిన్ని కూడా తన ఫ్రెండ్ తల్లికి డబ్బు అడుగుతుంది. మీలాంటి క్రిమినల్ ఫ్యామిలీకి మేం సాయం చేయమని ఆమె అంటుంది. చిన్ని కావేరిని పట్టుకొని ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: ఫీల్ ది లవ్ బేబీ.. నన్ను ఎందుకు కాపాడావ్? దేవాకి మిథున లవ్ ప్రశ్నలు!





















