అన్వేషించండి

Nuvvunte Naa Jathaga Serial Today May 27th: నువ్వుంటే నా జతగా సీరియల్: ఫీల్‌ ది లవ్‌ బేబీ.. నన్ను ఎందుకు కాపాడావ్? దేవాకి మిథున లవ్‌ ప్రశ్నలు!

Nuvvunte Naa Jathaga Today Episode దేవాని మిథున లవ్ చేస్తున్నా అని ఫిక్స్ అయి దేవాకి కూడా తనని లవ్ చేస్తున్నావ్ అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode  మిథునని దేవా ప్రేమిస్తున్నాడని నిరూపిస్తానని చెప్పిన బామ్మ మిథునని కోనేటిలో తోసేస్తుంది. తర్వాత దేవాకి విషయం చెప్పడంతో దేవా కోనేటిలో దూకి మిథునని బయటకు తీసుకొస్తాడు. చాలా కంగారు పడతాడు. ఆ టైంలో దేవాకి మిథున అంటే ఎంత ఇష్టమో బయట పడుతుంది. మిథున అది చూస్తుంది. 

దేవా మిథునతో నీకు పిచ్చా నిన్ను ఇష్టపడే వాళ్లు ఎంత మంది ఉన్నారో తెలిసి కూడా ఇలా చేయడం ఏంటి అని తిట్టి వెళ్లిపోతాడు. బామ్మ మిథున దగ్గరకు వచ్చి ఇప్పుడేమంటావ్. నీ మీద ఎంత ప్రేమ ఉందో చూశావా.. ఫీల్‌ ది లవ్‌ బేబీ అని మిథునని అంటుంది. దాంతో మిథున దేవా తనని పెళ్లి చేసుకోవడం కాపాడటం అన్నీ గుర్తు చేసుకొని చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఇక ఇంట్లో కాంతం మేడ మీద అమ్మోరు తల్లిలా జుట్టు విరబోసుకొని పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకొని పెద్ద కత్తి నూరుతూ ఉంటుంది. ఇలా ఉన్నావ్ ఏంటి అని ప్రమోదిని అడిగితే ఈ రోజు మన ఇంట్లో రక్తం పాతం ఉంది ఆ బేబీ బామ్మని చంపేస్తా అంటుంది. ప్రమోదిని కాంతంతో అంత ఆవేశం జాగ్ర్తత చెప్పినట్లే కాంతాన్ని బామ్మ పేరు చెప్పి బయపెడుతుంది. 

మిథున స్నానం చేసి వచ్చి అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ దేవా మీద నాకు ప్రేమ ఉందా నా మనసుని తాకిన ఈ ఫీలింగ్ ప్రేమేనా.. ఎస్ ఇది ప్రేమే ఐయామ్ ఇన్ లవ్ విత్ దేవా అని అనుకుంటుంది.  దేవాకి కూడా నేను అంటే ఇష్టం ఉంటుందా తెలుసుకోవాలి అనుకుంటుంది. దేవా దగ్గరకు వెళ్లి నేను నీకు ఏం అవుతాను అని నన్ను కాపాడావు అంటుంది. నీకు నాకు ఏంటి సంబంధం.. నీ ప్రాణాలు పణంగా పెట్టి నన్ను కాపాడాల్సిన అవసరం ఏంటి అని అడుగుతుంది. నేను నీ భార్యని కాబట్టే నన్ను కాపాడావ్ అని అంటుంది. అంత లేదు అని దేవా అంటాడు. నేను ఏమైపోయినా పట్టించుకోను అన్నావ్ మరి నన్ను ఎందుకు కాపాడావ్.. నేను నీళ్లలో పడిపోగానే దరిద్రం వదిలిపోయింది అనుకోకుండా ఎందుకు కాపాడావ్ అని అడుగుతుంది. దేవా ఏం చెప్పలేకపోతాడు. ప్రాణాలు పోయే టైంలో ఎవరు అని చూడం కదా అంటే నువ్వు నన్ను కాపాడింది మానవత్వంతో కాదు ప్రేమతో అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు అని దేవా అడిగితే ఇది నిజం అని మిథున అంటుంది. నీ భార్య నీటిలో పడిపోయింది అని అమ్మమ్మ చెప్పగానే నీటిలో దూకేశావ్ అంటే నా మీద నీకు ప్రేమ ఉన్నట్లే కదా.. నీ మనసులో నా మీద ప్రేమ ఉంది అని చెప్తుంది. 

నేను కళ్లు తెరిచే వరకు నాకు ఏం అవుతుందా అని విలవిల్లాడిపోయావ్. ఎదుటి వ్యక్తి మీద ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే అలాంటి ఫీల్ వస్తుంది అంటుంది. ప్రేమ లేదు తొక్క లేదు నన్ను ఇబ్బంది పెట్టకుండా వెళ్లిపో అంటాడు. నీ మనసుతో మాట్లాడు నా మీద నీకు ప్రేమ ఉందో లేదో నీకే తెలుస్తుందని మిథున అంటుంది. దేవా మనసులో మేడం మ్యాజిక్‌నే కాదు నన్ను కన్ప్యూజ్ చేసేసింది ఏంటి అనుకుంటాడు. మిథున అద్దం మీద మిథున, దేవా లవ్ బిగన్స్ అని రాస్తుంది. చాలా హ్యాపీగా ఫీలవుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.   

Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: జల జల జలపాతం నువ్వు.. దేవా, మిథునలతో జలకాలాటాడించిన బామ్మ!

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 20th: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
పొదరిల్లు: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
Gundeninda Gudigantalu August 20th:షోరూమ్‌కు వచ్చిన రోహిణికి మనోజ్‌ ఏం వార్నింగ్ ఇచ్చాడు..?
గుండెనిండా గుడిగంటలు: షోరూమ్‌కు వచ్చిన రోహిణికి మనోజ్‌ ఏం వార్నింగ్ ఇచ్చాడు..?
Brahmamudi Serial Today August 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజును కిస్‌ చేసిన ఇందు – రేఖకు షాక్‌ ఇవ్వనున్న రాజు  
‘బ్రహ్మముడి’ సీరియల్: రాజును కిస్‌ చేసిన ఇందు – రేఖకు షాక్‌ ఇవ్వనున్న రాజు  
Illu Illalu Pillalu Serial Today August 20th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్, అమూల్యల ప్లాన్ ఫెయిల్.. వేదవతి త్రిబుల్ రైడ్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్, అమూల్యల ప్లాన్ ఫెయిల్.. వేదవతి త్రిబుల్ రైడ్!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Embed widget