Chinni Serial Today August 6th: చిన్ని సీరియల్: బాలరాజుని చూసేసిన మధు.. నాన్న నాన్న అంటూ పరుగులు.. సీక్రెట్స్, ఎమోషన్స్.. చివరికి ఏమైంది?
Chinni Serial Today Episode August 6th మధుమిత బాలరాజుని చూసి నాన్న అని వెంటపడటం బాలరాజు అచూకీ తెలీకపోవడంతో కుప్పకూలి ఏడ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధుమితకి ఎలా ఉందో తెలుసుకోవడానికి మహి కాల్ చేస్తాడు. పద్మతో మాట్లాడి మధుకి ఎలా ఉందో తెలుసుకుంటాడు. రేపు డిశ్చార్జి అని చెప్పడంతో మహి హ్యాపీగా ఫీలవుతాడు. తర్వాత మధు మహితో మాట్లాడుతుంది. హలో మ్యాడీ అని మధు అనగానే మహి చాలా హ్యాపీగా ఫీలవుతాడు.
మధు మ్యాడీతో నీ దయవల్ల రేపు క్షేమంగా ఇంటికి వెళ్తున్నా మ్యాడీ.. సమయానికి నువ్వు వచ్చి కాపాడకపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో థ్యాంక్స్ అని చెప్తుంది. పదే పదే అలా థ్యాంక్స్ చెప్పి నన్ను హీరో చేయకు అని మ్యాడీ అంటే నేను చేయకపోయినా నువ్వు హీరోవే మ్యాడీ.. మా నాన్న వాళ్లు ఇప్పటికే చాలా సార్లు నీ గురించి మాట్లాడుకున్నారు. నువ్వు వాళ్ల దృష్టిలో దేవుడు అయిపోయావ్ నీకు గుడి కట్టేశారు అని చెప్తుంది. మీ అమ్మానాన్నే కట్టారా నువ్వు గుడి కట్టేశావా అని మ్యాడీ అడిగి అంతలోనే నువ్వు ఫైర్ కదా నువ్వు అలాంటి పనులు చేయలేవులే అని అంటాడు. దానికి మధు నేను ఇప్పుడు ఫైర్ కాని చిన్నప్పుడు చాలా కూల్.. నా గురించి తెలిస్తే షాక్ అయిపోతావ్.. ఒక్కోసారి ఇది నేనేనా అని నాకే డౌట్ అంటుందని మధు అంటుంది.
మహి మధుతో అవునా అప్పుడు అంత సాఫ్ట్‌వేర్‌లా ఉండి తర్వాత హార్డ్‌వేర్‌లా మారిపోయావ్ అంటే అదో పెద్ద స్టోరీలే తర్వాత చెప్తా అని మధు అంటుంది. ఇద్దరూ గుడ్ నైట్ చెప్పుకొని మహి జాగ్రత్తలు చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. అక్కడ మధు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ హా.. హా .. అంటూ పద్దు సెటైర్లు వేస్తుంది. ఇది కలో నిజమో తెలీడం లేదు నిప్పు నీరులా కొట్టుకునే మీరు ఇలా సంతోషంగా మాట్లాడటం బాగుంది అనుకుంటుంది.
ఉదయం మధుకి సెలైన్ బాటిల్ పెట్టి అది అయిపోగానే ఇంటికి తీసుకెళ్లిపోవచ్చని నర్స్ చెప్తుంది. మందులు, బిల్ అంటూ అందరూ బయటకు వెళ్లిపోతారు. మధు ఒక్కర్తే బెడ్ మీద ఉంటుంది. ఇక బాలరాజుకి ట్రీట్మెంట్ జరిగి మందులు తీసుకొని బయటకు వెళ్తుంటే మధు తండ్రిని చూస్తుంది. నాన్న అని అరుస్తుంది. చేతికి ఉన్న అన్ని తీసేసి పరుగులు పెడుతుంది.
బాలరాజు వెనక మధుమిత పరుగులు పెట్టడం మధు కంగారుగా పరుగెత్తడం చూసి స్వరూప, సుబ్బులు మధు వెనక పరుగెడతారు. బాలరాజు బయట ఆటో మాట్లాడి ఆటో ఎక్కి వెళ్లిపోతాడు.
మధు నాన్న నాన్న అని ఎన్ని సార్లు పిలిచినా బాలరాజుకి వినిపించదు.. ఆటో వెళ్లిపోవడంతో మధు కింద కూర్చొని ఏడుస్తుంది. సుబ్బు, స్వరూపలు వచ్చి ఏమైందమ్మా అని అడిగితే మా నాన్నని చూశాను అని మధు ఏడుస్తుంది. సుబ్బు, స్వరూప ఇద్దరూ షాక్ అయిపోతారు. భ్రమ పడ్డావేమో అని అంటే లేదు నా కళ్లు నన్న మోసం చేసినా మనసు చేయదు అని మధు ఏడుస్తుంది. ఎలా అయినా నాన్నకి కలవాలి అని అంటుంది. మీరు కలవాలి అని రాసుంటే ఎలా అయినా కలుస్తారమ్మా అని స్వరూప సర్ది చెప్తుంది. ఇద్దరూ మధుని ఓదార్చి అక్కడి నుంచి తీసుకెళ్తారు.
సుబ్బు మనసులో గతం ఆనవాళ్లు లేకుండా కావేరి అమ్మ పెంచమని చెప్పింది. కానీ ఇప్పుడు తను గతాన్ని వెతికే ప్రయత్నం చేస్తుంది దీని వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో ఏంటో అని అనుకుంటాడు. రాత్రి మహి మధు డ్రాయింగ్ చూసి థ్యాంక్యూ చిన్ని ఈ డ్రాయింగ్లో నీ ఈ ఒక్క సంతకం వల్ల నాకు నీ ఆచూకి తెలిసింది అని సంబరపడిపోతాడు. మధు మాత్రం తండ్రిని గుర్తు చేసుకొని బాధ పడుతుంది. మధు ఫోన్ చూసి ఆ ఫోన్ పోవడం చూసి చూశావా నాన్న కనీసం నిన్ను ఫోటోలో చూసుకునే భాగ్యం కూడా నాకు లేదు అని ఏడుస్తుంది. వెంటనే పెన్సిల్ పేపర్ తీసుకొచ్చి కళ్లు మూసుకొని తండ్రిని గుర్తు చేసుకొని డ్రాయింగ్ గీస్తుంది. బాలరాజు ఫొటో గీస్తుంది.
డ్రాయింగ్ చూసి పదేళ్లు నిన్ను దూరం చేసుకున్నాను నాన్న నన్ను క్షమించు.. అమ్మ నన్ను గతం తాలూకు జ్ఞాపకాలు రాకుండా పెంచమని చెప్పింది అందుకే వాళ్లు నీగురించి అలా చెప్పారని ఊహించలేదు.. అయినా నేను చేసింది తప్పే నాన్న నీ గురించి తెలుసుకునే బాధ్యత నాకు ఉంది కదా కానీ అలా తెలుసుకోకుండా తప్పు చేశాను అని ఏడుస్తుంది. పోయిన అమ్మని తీసుకురాలేను కానీ నిన్ను కలిసి నీ బాధని కొంచెం తగ్గిస్తాను అని ఏడుస్తుంది. ఇంతలో స్వరూప రావడంతో డ్రాయింగ్ దాచేస్తుంది. స్వరూప మధుకి మందులు వచ్చి అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా పడుకోమని పడుకోపెడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















