Ammayi garu Serial Today August 5th: అమ్మాయి గారు సీరియల్: అన్ని దారులు మూసుకుపోయి వణికిపోతున్న కోమలి.. తల్లీకొడుకుల్ని పట్టించేస్తుందా!
Ammayi garu Serial Today Episode August 5th డీఎన్‌ఏ రిపోర్ట్స్ మార్చడానికి దీపక్ హాస్పిటల్‌కి వెళ్లడం రాజు అక్కడ ఉండటంతో దీపక్ ఏం చేయలేకపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రూప కోమలితో నీ ఆట అయిపోయింది నీ కుప్పిగెంతులు ఈ రోజుతో సరి పెట్టే బేడ సర్దుకొని వెళ్లిపో ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని అంటుంది. కోమలి విజయాంబిక, దీపక్ వాళ్ల దగ్గరకు వెళ్లి అయిపోయింది నా పని అయిపోతుంది.. నేను పారిపోతా అంటే డాక్టర్ నాకు తెలుసు మేం చూసుకుంటాం అని అన్నారు. ఇప్పుడు నేను దొరికిపోతే మీ గురించి చెప్పేస్తా అని విజయాంబిక వాళ్లని బెదిరిస్తుంది.
విజయాంబిక, దీపక్‌లు ఏం భయపడొద్దు అని ధైర్యం చెప్తారు. మన డాక్టర్‌కి కాల్ చేద్దాం అని దీపక్ కాల్ చేస్తే ఫోన్ కలవదు. కోమలి చాలా టెన్షన్ పడిపోతుంది. దాంతో దీపక్‌ని హాస్పిటల్‌కి వెళ్లి కలవమని విజయాంబిక చెప్తుంది. ఎలా అయినా డీఎన్‌ఏ రిపోర్ట్స్ మార్చకపోతే మామయ్య చేతిలో చావడం ఖాయమని దీపక్ లోపలికి వెళ్లే సరికి అక్కడ రాజు డాక్టర్‌తో మాట్లాడుతుంటాడు. రాజు వెళ్లే వరకు దాక్కోవాలని అనుకుంటాడు.
ఇంటి దగ్గర కోమలి జుట్టు పీక్కొని ఈ టెన్షన్ నేను భరించలేకపోతున్నా చచ్చిపోతా అని అనుకుంటుంది. ఇక రాజు ఫోన్ వచ్చి మాట్లాడటానికి బయటకు వస్తాడు. రాజు రావడ చూపి దీపక్ దాక్కుంటాడు. దీపక్ చేయి కింద పెడితే రాజు కుమ్మేస్తాడు. దీపక్ విలవిల్లాడిపోతాడు. దీపక్ తల్లికి కాల్ చేసి రాజు ఉన్నాడు. వీడు ఇక్కడే ఉంటే నేను ఇరుక్కుంటా అంటాడు. ఇరుక్కోవడం అంటే చచ్చిపోవడంరా ఏదో ఒకటి చేసి డీఎన్ఏ రిపోర్ట్స్ మార్చమని విజయాంబిక చెప్తుంది. మార్చడం కుదరదు అమ్మ చనిపోతే ముగ్గురం చనిపోదాం అని దీపక్ అంటాడు. కోమలికి విషయం తెలిసి అంతా అయిపోయిందని తెగ కంగారు పడిపోతుంది. నేను రూప కాదు అని తేలిపోతే నా పరిస్థితి ఏంటి అని అడుగుతుంది.
కోమలి, విజయాంబికలు మాట్లాడుకోవడం రూప చూస్తుంది. రూప అక్కడికి రావడం చూసిన విజయాంబిక ప్లేట్ తిప్పేస్తుంది. కోమలితో నువ్వు మా రూప కాదని మా తమ్ముడికి తప్ప ఇక్కడందరికీ తెలుసు రిపోర్ట్స్ వచ్చేలోపు నువ్వు పారిపో అని అంటుంది. రూపని చూసి కోమలి షాక్ అయిపోతుంది. రుక్మిణి వాళ్లతో ఆ రూపకి అత్తకి పడదు కదా మీరేంటి ఇలా ముచ్చట్లు పెట్టారు అంటుంది. నా బాధ చెప్పుకుంటున్నా అని కోమలి అంటుంది. ఇక మీకు నాన్న పిలుస్తున్నారని చెప్తుంది. ఎందుకు పిలిచారా అని కోమలి తెగ కంగారు పడుతుంది.
సూర్యప్రతాప్ డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటే భోజనానికి పిలుస్తారు. నాకు ఆకలి లేదు నాన్న అందరూ నన్న దొంగలా చూస్తున్నారు.. డీఎన్‌ఏ రిపోర్ట్స్ వచ్చాక మీ అందరితో కలిసి తింటానని అంటుంది. ఇక సూర్య తినమని చెప్పడంతో కోమలి కూర్చొంటుంది. రుక్మిణిని కూర్చొమని చెప్పడంతో కోమలి పక్కనే కూర్చొంటుంది. కోమలి తెగ కంగారు పడిపోతుంది. రూప చెవిలోకి వెళ్లి నువ్వేం తినాలి అనుకున్నా ఇప్పుడే తినేసే రేపు తినడానికి ఉంటావో ఉండవో అని అంటుంది. ఆ మాటకు కోమలి ఇంకా కంగారు పడుతుంది.
రూప మళ్లీ దగ్గరకు వెళ్లి నువ్వు రూప కాదు అని తెలిస్తే మా నాన్న ఏం చేస్తాడో తెలుసా.. అన్నీ తెలుసుకున్న నువ్వు అది తెలుసుకోలేదా.. గన్ పెట్టి కాల్చిపారేస్తాడు అని రూప చెప్పడంతో కోమలి తనని సూర్యప్రతాప్ కాల్చేసినట్లు కలకంటుంది. భయంతో వద్దు వద్దు అని అరుస్తుంది. అందరూ ఏమైందని అనుకుంటారు. రూప నవ్వుకుంటుంది. ఇక బంటీ తాతతో రేపు రిపోర్ట్స్‌తో ఈ ఆంటీ తప్పు చెప్పిందని తెలిస్తే ఏం చేస్తారు అని అడుగుతాడు. దాంతో సూర్యప్రతాప్ కోపంగా మోసం చేస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు అని చెప్తాడు. సూర్యప్రతాప్ వెళ్లిపోయిన తర్వాత విరూపాక్షి కోమలితో నువ్వు నా కూతురు కాదని నాకు తెలుసు ఎందుకంటే రూప ఇక్కడే ఉంది.. నీ భవిష్యత్ గురించి ఆలోచించి రాత్రికి రాత్రే పారిపో అని అంటుంది. కోమలి వణికి పోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















