Illu Illalu Pillalu Serial Today August 6th: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్: తండ్రికి సాయం చేయడానికి వెళ్లి ధీరజ్‌కి దొరికిపోయిన వల్లి.. ఈ వస్తువుల గోలేంట్రా బాబు!
Illu Illalu Pillalu Serial Today Episode August 6th శ్రీవల్లి తండ్రి కోసం డోర్ తీయడానికి వెళ్లి బయటే ఉన్న ధీరజ్‌కి దొరికిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode శ్రీవల్లి తండ్రి ఆనంద్ రావు రామరాజు ఇంటికి దొంగతనానికి వస్తాడు. శ్రీవల్లికి కాల్ చేస్తాడు. శ్రీవల్లి భయంతో కాల్ లిఫ్ట్ చేయలేకపోతుంది. ఆనంద్ రావు బయట నుంచి బీరువా తాళాలు ఎక్కడ పెట్టావో చెప్పు అమ్మడు.. డోర్ తీశావా లేదా చెప్పు అమ్మడు అనుకుంటాడు.
ఆనంద్రావు మళ్లీ కాల్ చేయడంతో శ్రీవల్లి బయటకు వచ్చి మాట్లాడి భయం వేస్తుంది నాన్న అంటే నన్ను తక్కువంచనా వేయకు అమ్మడు చిన్నప్పుడు పిల్లల దగ్గర బలపాలు కొట్టేశా.. ఆరితేరిన గజ దొంగ నేను అని అంటాడు. శ్రీవల్లి ఇంట్లో తాళాలు ఓ చోట పెడతాను అని డోర్ తీసి ఉంచుతా అని హాల్లో తిరుపతి బాబాయ్ ఉన్నాడు జాగ్రత్త అని అంటుంది. ఇక గదిలో తాళాలు మర్చిపోయానని వల్లి అనుకొని వెళ్లే సరికి చందు నిద్ర లేచి బెడ్ మీద కూర్చొని ఉంటాడు. ఎవరు ఫోన్ అని చందు అడగటంలో శ్రీవల్లి గజగజా వణికిపోతుంది. చందు మాటలు వినలేదని అర్థమైన తర్వాత తన తల్లి ఫోన్ చేసిందని అంటుంది. తాళాలు నాన్నకి చెప్పిన చోట ఎలా పెట్టాలి ప్లాన్ తన్నేసేలా ఉంది ఎలారా దేవుడా అని వల్లి అనుకుంటుంది.
మరోవైపు ప్రేమ గదిలో నైల్ పాలిష్ చేసుకుంటుంది. ధీరజ్ వచ్చి మెట్ల మీద చూసి ప్రేమ లేకపోవడం చూసి ఈ గండు పిల్లి దెయ్యం నా కోసం ఉండాలి కదా లేదేంటి అని అనుకొని డోర్ తీయాలని చూస్తాడు. ఇక ప్రేమకి కాల్ చేసి ఎక్కడున్నావే అని అడుగుతాడు. దానికి ప్రేమ శ్మశానంలో వాకింగ్ చేస్తున్నారా నీ దృష్టిలో నేను ఎలాగూ ఒక దెయ్యాన్ని కదా అని అంటుంది. తిన్నగా మాట్లాడవే అని ధీరజ్ అంటే కాకపోతే మరేంట్రా రాత్రి ఇంకెక్కడుంటా గదిలో ఉన్నాను అని చెప్తుంది. నా కోసం ఎప్పుడూ వెయిట్ చేస్తావ్ కదా ఈ రోజు బయట లేవని ధీరజ్ అడిగితే దానికి ప్రేమ వస్తువులు ఎవరి కోసం ఎదురు చూడవురా.. అంటుంది. ప్రేమ డైలాగ్‌కి ధీరజ్ నెత్తి బాదుకుంటాడు. అమ్మా తల్లీ మొదలు పెట్టావా నీ టార్చర్ కాసేపు ఆపి డోర్ తీయవే అంటాడు.
ప్రేమ ధీరజ్‌తో నేను తీయను నేను ఎందుకు తీయాలి నేను ఏమైనా నీ పెళ్లాన్నా వస్తువునే కదా అని అంటుంది. ప్రేమ ఆకలేస్తుందే డోర్ తీయవే అంటే మొన్ననే చెప్పాను కదరా బయట తినమని మరెందుకు తినకుండా వచ్చావ్ అని అంటుంది. నువ్వు కిటికీ తీసి లోపలికి తీసుకెళ్తావ్ కదా అని తినలేదే అంటాడు. ఇక ప్రేమ మళ్లీ వస్తువులు అని డోర్ తీయవు అని ఫోన్ కట్ చేసేస్తుంది. డోర్ తీయమని మళ్లీ ధీరజ్ కాల్ చేసి బతిమాలుతాడు. దాంతో ప్రేమ సరేరా ఓ పాట పాడు లేదంటే జోక్ చెప్పి నన్ను ఇంప్రెస్ చేయ్ అప్పుడు డోర్ తీస్తా అంటుంది. ధీరజ్ జోక్ చెప్పి ధీరజ్‌నే నవ్వుకుంటాడు. నాకు నవ్వు రాలేదు నేను డోర్ తీయను అని ప్రేమ అంటే పాట పాడుతానే అని అంతర్యామి అలసితిని అని పాట పాడుతాడు. దానికి ప్రేమ వెళ్లి గుడిలో పాడుకోరా.. అమ్మాయి దగ్గర ఏం పాట పాడాలో తెలీదు అన్ రొమాంటిక్ ఫెలో అని ఫోన్ కట్ చేసేస్తుంది. ఈ రోజు నాకు కాల రాత్రే అని ధీరజ్ అనుకుంటాడు.
శ్రీవల్లి లేచి నాన్న వచ్చేస్తాడేమో ఎలారా దేవుడా అని తలపట్టుకుంటుంది. మెల్లగా లేచి తాళాల గుత్తి తీసుకొని చందు లేచేస్తాడేమో అనే భయంతో మెల్లగా బయటకు వెళ్తుంది. కిచెన్‌లో తండ్రికి చెప్పిన చోట తాళాల గుత్తి పెడుతుంది. తర్వాత మెల్లగా వెళ్లి మెయిన్ డోర్ తీస్తుంది. ఎదురుగా ధీరజ్ ఉండటంతో శ్రీవల్లి బిత్తర పోతుంది. ధీరజ్ కూడా అనుమానంగా చూస్తాడు. మీరేంటి వదిన ఇక్కడ అని అడుగుతాడు. వల్లి భయంతో డోర్ తీయడానికి అనేస్తుంది. ఎవరు ఎంత బతిమాలినా పది గంటలకు డోర్ వేసిన మీరు తీయరు కదా మరి ఈరోజు ఏంటి మీ అంతట మీరే వచ్చి డోర్ తీయడం ఏంటి అని అడుగుతాడు. దాంతో వల్లి నిన్ను ఇబ్బంది పడుతున్నావని వచ్చి తీశా అంటుంది. దాంతో ధీరజ్ మొన్న ప్రేమ ఇదే విషయం చెప్తే వినలేదు కదా ప్రేమని కూడా బయటకు తోసేశారు. ఇప్పుడు మీరే స్వయంగా డోర్ తీయడం చాలా ఆశ్చర్యంలా ఉందే అని అంటాడు. వదినా మీరు ఎందుకో టెన్షన్ పడుతున్నారు అని అంటాడు. వల్లి ఏం లేదని కవర్ చేస్తే ధీరజ్ గుచ్చి గుచ్చి అడుగుతాడు. ప్రేమని నువ్వు పిలవడం నేను విన్నాను అందుకే వస్తా ఇప్పుడు లోపలికి వస్తావా లేదా అది చెప్పు అని అంటుంది. ధీరజ్ లోపలికి వస్తాడు. మళ్లీ వల్లిని అనుమానంగా చూస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















