Chinni Serial Today August 29th: చిన్ని సీరియల్: పెళ్లి ఫిక్స్.. వెక్కి వెక్కి ఏడుస్తున్న మధు! మహి మీద ప్రేమ నిరూపించడానికి శ్రేయ పిచ్చి పని!
Chinni Serial Today Episode August 29th మధుకి పెళ్లి ఫిక్స్ అవ్వడం.. శ్రేయ మహి కోసం చేయి కట్ చేసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధుకి పెళ్లి చూపులు అని తెలుసుకున్న మహి ఇంటికి వచ్చి అప్పుడే మధుకి పెళ్లి వద్దని చెప్పడం మధు తల్లిదండ్రులు మహిని పంపేయడంతో మధు చాలా ఫీలవుతుంది. ఇక పెళ్లి వాళ్లు పెళ్లి చూపులకు వెళ్తుంటారు.
పెళ్లి కొడుకు శివకి నాగవల్లి పీఏ కాల్ చేస్తాడు. నాగవల్లి అతనితో మాట్లాడుతూ మనం అనుకున్నది అనుకున్నట్లు జరగాలి పెళ్లి చూపులకు వెళ్తున్నావ్ కదా అని అడుగుతుంది. అంతా మనం అనుకున్నట్లే జరుగుతుందని అతను చెప్తాడు. ఇక మహి బాగా చదువుకునే మధు కెరీర్ నాశనం చేసేస్తున్నారని అనుకుంటాడు. పెళ్లి వాళ్లు మధు ఇంటికి వెళ్తారు. సుబ్బు, స్వరూపలు మర్యాదలు చేస్తారు.
శివ తల్లి మధు లక్ష్మీ దేవిలా ఉందని తమకు బాగా నచ్చింది అని అంటుంది. శివ కూడా తనకు బాగా నచ్చిందని అంటాడు. ఇక మధుని పెళ్లి కొడుకు తల్లి మధుకి అబ్బాయి నచ్చాడా అని అడిగితే మా నాన్న ఇష్టమే నా ఇష్టం అని మధు చెప్తుంది. అమ్మాయితో ఏమైనా మాట్లాడాలా అని శివని సుబ్బు అడిగితే వద్దని పెళ్లి, నిశ్చితార్థం గురించి మాట్లాడుకోవాలని అంటాడు. ఇక సుబ్బు మధు చదువు గురించి చెప్పి కాలేజ్‌లో జరిగిన విషయం గురించి చెప్పాలని ప్రయత్నిస్తే అలాంటివి వెంటనే మర్చిపోవాలని సోషల్ మీడియాలో వచ్చినవి నేను నమ్మను అని అంటాడు. వీలైనంత త్వరగా నిశ్చితార్థం, పెళ్లి జరిపించేద్దాం అని పెళ్లి కొడుకు తల్లి అంటుంది.
సుబ్బు వాళ్లతో కష్టమైపోతుందేమో అని అంటే ఏం కాదని ఆవిడ అంటుంది. ఆ మాటలు విని చిన్ని చాలా టెన్షన్ పడుతూ కన్నీరు పెట్టుకుంటుంది. మధుతో ఏంటి కోడలు పిల్లా అత్తింటికి వచ్చేయాలని పుట్టింటిని వదిలేయాలని బాధ పడుతున్నావా.. నాకు ఆడపిల్లలు లేరు నువ్వే నాకు కోడలు అయినా కూతురు అయినా అని అంటుంది. శివ కూడా మధుతో నీకు నీ ఫ్యామిలీ ఎంత ఇష్టమో మాకు తెలుసు నీకు వాళ్లని ఎప్పుడు చూడాలి అనిపిస్తే అప్పుడు ఫ్లైట్ ఎక్కి ఇండియా వచ్చేయ్ తర్వాత నీ బెంగ తీరిపోతే సింగపూర్ వచ్చేయ్ అంటాడు.
మధుకి స్వీట్ పెట్టి నోరు తీపి చేస్తారు. అందరూ సరదాగా మాట్లాడుకుంటారు. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత మధు గదిలోకి వెళ్లి చాలా ఏడుస్తుంది. మహి డ్రస్ పట్టుకొని మహిని గుర్తు చేసుకొని చాలా ఏడుస్తుంది. అదంతా స్వప్న చూస్తుంది. మధు దగ్గరకు స్వప్న వచ్చిఈ పెళ్లి నీకు ఇష్టం లేదు కదా మ్యాడీ అంటే ఇష్టం కదా చెప్పు మధు మ్యాడీని నువ్వు ప్రేమిస్తున్నావ్ కదా అని అడుగుతుంది. మధు స్వప్నని హగ్ చేసుకొని ఏడుస్తుంది. మనసులో మ్యాడీ మీద ఇంత ప్రేమ పెట్టుకొని అమ్మానాన్న చెప్పారని ఇలా చేస్తావా ఏంటే అంటుంది. నాకు మా అమ్మానాన్న సంతోషమే ముఖ్యం అని మధు అంటుంది. స్వప్న మీ అమ్మానాన్నలతో నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తానని అంటే మధు తన మీద ఒట్టువేసుకొని స్వప్నని ఆపేస్తుంది.
రాత్రి లోహితకు శ్రేయ కాల్ చేసి మధుకి పెళ్లి ఫిక్స్ అయింది మూడు రోజుల్లో నిశ్చితార్థం త్వరలోనే పెళ్లి అని చెప్తుంది. ఇద్దరూ చాలా సంతోషపడిపోతారు. మధు పీడ పోతుందని అనుకుంటారు. బావ బ్యాక్ ఎక్కిన దాన్ని చంపేయాలి అన్నంత కోపంగా ఉందని శ్రేయ అంటుంది. తర్వాత శ్రేయ మాటలు వరుణ్ విని బావ బైక్ ఎక్కింది అని చంపేయాలి అంటావా.. మధు బావకి కేవలం ఫ్రెండ్ మాత్రమే అని అంటాడు. బావని నేను చాలా ప్రేమిస్తున్నా బావని ఇంకే అమ్మాయి అయినా చూసినా తట్టుకోను అంటుంది. దానికి వరుణ్ బావ పదేళ్ల నుంచి చిన్నిని ప్రేమిస్తున్నాడు.. అత్తయ్య వాళ్లు ఏదో అంటున్నారు. అందరూ అలా అనే సరికి నువ్వు ఇష్టపడుతున్నావ్ అంతే అని అంటే ఆ చిన్ని నిజం గా వస్తే చంపేస్తా అని శ్రేయ అని బావ మీద నాకు ప్రేమ లేదు అంటావా ఇప్పుడే నీకు బావ అంటే నాకు ఎంత ఇష్టమో చెప్తానని చేయి కోసుకుంటుంది. అందరూ కంగారుగా వస్తారు.
నాగవల్లి కంగారుగా శ్రేయకి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. ఎందుకు ఇలా చేశావ్ అంటే బావ మీద నాకు ప్రేమ లేదని అన్నయ్య అన్నాడు ఎంత ప్రేమ ఉందో చూపించా.. ఇప్పటికైనా ఒప్పుకుంటావా అన్నయ్య బావ మీద నాకు ప్రేమ ఉందని అని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















