Chinni Serial Today August 28th: చిన్ని సీరియల్: మధుకి పెళ్లి! మహి సుబ్బు కాళ్లు పట్టుకోవడానికి కారణమేంటి? దేవా మహితో ఏం చెప్పాడు?
Chinni Serial Today Episode August 28th మధుకి పెళ్లి చేసుకోమని స్వరూప ఒట్టు వేయించుకోవడం మహి విషయం తెలిసి మధు ఇంటికి వచ్చి సుబ్బుని బతిమాలడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధుకి పంతులు ఓ గొప్ప సంబంధం తీసుకొస్తాడు. సుబ్బు, స్వరూప ఒకే చెప్పేస్తారు. దాంతో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తామని పంతులు అంటారు. స్వరూప, సుబ్బులు విషయం మధుకి చెప్పాలని అనుకుంటారు. అక్కడే ఉన్న స్వప్నని పంపేస్తారు.
మధుతో స్వరూప రేపు నీకు పెళ్లి చూపులు అని చెప్తారు. మధు షాక్ అయిపోతుంది. స్వప్న కూడా ఆ మాట వింటుంది. మధు తల్లిదండ్రులతో ఇప్పుడు పెళ్లి ఏంటి నాన్న నేను చదువుకోవాలి కదా అంటుంది. మేం ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తామమ్మా.. ఇంత కంటే మేం గొప్ప సంబంధం తీసుకురాలేం.. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో దేవుడు మనకు ఇచ్చిన గొప్ప అవకాశం అంటాడు. దానికి మధు అంటే నిన్న కాలేజ్‌లో జరిగిన విషయం గురించి ఇలా అంటున్నారా అని అడుగుతుంది. సమయానికి మంచి సంబంధం వచ్చింది కదా కాదు అనకు అంటారు. నేను ఎప్పుడూ మీ మాట కాదు అనను కదా కానీ మా నాన్నని వెతుకుతానని అంటుంది. పెళ్లి తర్వాత వెతకొచ్చు మేం వాళ్లతో అంతా చెప్తామని స్వరూప తన మీద ఒట్టు వేయించుకుంటుంది.
మధు వాళ్లని బాధ పెట్టడం ఇష్టం లేక ఒట్టేసి ఒకే చెప్తుంది. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత చిన్ని చాలా ఏడుస్తుంది. భగవంతుడా నాకు నచ్చిన అందర్ని దూరం చేస్తున్నావ్ అప్పుడు మా అమ్మానాన్నల్ని ఇప్పుడు మ్యాడీని ఎందుకు స్వామి అని ఏడుస్తుంది. మరోవైపు దేవా ఇంట్లో అందరూ కలిసి టిఫెన్ చేస్తారు. దేవా శ్రేయతో బీటెక్ తర్వాత ఏంటి అని అడుగుతాడు. ఎంటెక్ అని బావ కోసమే అమెరికా వెళ్లాలని అనుకున్నానని అంటుంది. దేవా మహితో చూశావా శ్రేయ నిన్ను ఎంతలా ప్రేమిస్తుందో తనే కాదు ఇంట్లో అందరూ నిన్ను ఎంత ప్రేమిస్తున్నారో తెలుసుకో.. ఇక నుంచి నువ్వు ఇంట్లో వాళ్ల గురించి ఆలోచించాలి. నీకు ఇచ్చిన గడువులో చిన్నిని వెతకపోతే శ్రేయని పెళ్లి చేసుకోవాలి అని వార్నింగ్ ఇస్తాడు.
స్వప్న మ్యాడీకి కాల్ చేసి మధుకి పెళ్లి చూపులు అని చెప్తుంది. ఇంత సడెన్‌గా పెళ్లి చూపులు ఏంటి ఇది కరెక్ట్ కాదు నేను వస్తా అని మహి అంటాడు. ఇక తనలో తాను కాలేజ్‌లో ఆ ఇష్యూ వల్ల త్వరగా పెళ్లి చేసేయాలి అనుకుంటున్నారు ఆ పెళ్లి జరగకూడదు అని మహి అనుకొని మధు ఇంటికి బయల్దేరుతాడు. ఇక స్వరూప మధుని పెళ్లి చూపులకు రెడీ చేసి మురిసిపోతుంది. మ్యాడీ ఇంటికి రావడం సుబ్బు, స్వరూప చూసి కంగారుగా బయటకి వెళ్తారు. మహి ఇద్దరికీ ఇంత కంగారుగా ఎందుకు పెళ్లి చేస్తున్నారు అని అడుగుతాడు. కాలేజ్లో జరిగిన ఇష్యూ వల్లే మధుకి త్వరగా పెళ్లి చేస్తున్నారు అని తెలుసు మధుతో మాట్లాడుతానని అంటాడు.
సుబ్బు మహిని ఆపి పెళ్లి వాళ్లు వస్తున్నారు మిమల్ని చూస్తే తప్పుగా అనుకుంటారు మధుని కలవొద్దు అంటారు. మధుకి ఇష్టం లేకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదు అని మహి అంటే మధు తన ఇష్టంతోనే చేసుకుంటుందని స్వరూప అంటుంది. మధు ఇష్టంతో చేసుకుంటుంది అంటే నేను నమ్మను అని మ్యాడీ అంటాడు. ఇంతలో మొత్తం విన్న మధు అక్కడికి వచ్చి నా ఇష్టప్రకారమే పెళ్లి చేసుకుంటున్నా మ్యాడీ నా వాళ్లని ఏం అనొద్దు అని చెప్పి ఏడుస్తూ వెళ్లిపోతుంది. సుబ్బు మ్యాడీతో విన్నావు కదా బాబు మధునే చెప్పింది అని అంటే చెప్పింది అంకుల్ కానీ మధు మనస్ఫూర్తిగా ఒప్పుకుందని నేను నమ్మడం లేదు.. పెద్ద మనసుతో అర్థం చేసుకోండి అంకుల్ కావాలి అంటే మీ కాళ్లు పట్టుకుంటా అంటాడు. దానికి సుబ్బు నేనే మీ కాళ్లు పట్టుకుంటా ఇక్కడి నుంచి వెళ్లిపో బాబు అంటాడు. మ్యాడీ వెళ్లిపోతాడు. చిన్ని చాలా ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















