Chinni Serial Today August 26th: చిన్ని సీరియల్: మహి, మధుల మీద దారుణమైన నింద..! వీడియో వైరల్, మధుకి అవమానం!
Chinni Serial Today Episode August 26th మధు, మహిల కోసం ఇంట్లో అందరూ కంగారు పడటం ఉదయం అందరూ కాలేజ్‌కి వచ్చి మహి, మధులను వీడియోలు తీయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మహి ఇంకా ఇంటికి రాలేదని నాగవల్లి దేవాకి చెప్తుంది. నీ గారాబం వల్లే వాడు ఇలా చేస్తున్నాడు అని దేవా అంటాడు. కంగారు పడొద్దని నాగవల్లి చెప్తూనే ఏడుస్తుంది. నన్ను కంగారు పడొద్దని చెప్పి నువ్వు ఏడుస్తున్నావేంటి అని దేవా అంటే వసంత అన్నతో తల్లి మనసు కదా అందుకే ఏడుస్తుందని అంటుంది.
దేవా పోలీసులకు చెప్పి సీక్రెట్‌గా ఎంక్వైరీ చేయిద్దాం అంటే నాగవల్లి వద్దు బావ బయట ఎవరికైనా తెలిస్తే సోషల్ మీడియాలో అల్లరైపోతా అని అంటుంది. మహికి చిన్ని కనిపించిందేమో అని వసంత అంటే నువ్వు అనవసరంగా పిచ్చి పిచ్చి అనుమానాలు పెట్టకు అమ్మ బావ ఆ చిన్ని కలవడం ఎప్పటికీ జరగదు అని శ్రేయ అంటుంది.
మహి డోర్ కొడుతూనే ఉంటాడు. ఎంతకీ డోర్ ఓపెన్ కాదు. ఎవరూ అటుగా రారు. మధు చాలా కంగారు పడుతుంది. బయట ఎవరూ లేరని చెప్పి ఏడుస్తుంది. మ్యాడీ మధు దగ్గరకు వెళ్లి ధైర్యం చెప్తాడు. ఇంటి దగ్గర అమ్మ వాళ్లు కంగారు పడతారు అని ఏడుస్తుంది. సెక్యూరిటీ వాళ్లు రౌండ్స్‌కి వస్తారు డోర్ తీస్తారని మహి చెప్పి డోర్ కొడుతూనే ఉంటాడు. మహి చాలా అలసి పోతాడు. కూర్చొని కునుకుతూ ఉంటే మధు చూసి వెళ్లి మహిని తన భుజం మీద పడుకోపెట్టుకుంటుంది. మహిని చూసి నీలాంటి మంచి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం మ్యాడీ అనుకుంటాడు.
స్వరూప, సుబ్బారావులు పోలీస్ స్టేషన్‌కి వెళ్తారు. పొద్దున్న వెళ్లిన అమ్మాయి రాత్రి అయినా రాలేదు అంటే పోలీస్ వెటకారంగా బాయ్ ఫ్రెండ్ వదల్లేదేమో అన్నీ తిరిగేసి వస్తారులే వెళ్లండి అంటాడు. మాఅమ్మాయి అలాంటిది కాదు అని ఇద్దరూ అంటే పోలీస్ దారుణంగా మాట్లాడుతాడు. పొద్దున్న వస్తుందిలే రాకపోతే రేపు సాయంత్రం వచ్చి చెప్పండి అని అంటాడు. ఇద్దరినీ గెంటేస్తారు. స్వరూప చాలా ఏడుస్తుంది.
లోహిత, శ్రేయలు ఉదయం అందరితో మధు రాత్రంతా ఓ అబ్బాయితో డ్యాన్స్ ప్రాక్టీస్ చేసే గదిలో ఉందని చెప్తుంది. అందరూ మధు ఇలా చేసింది అంటే నమ్మలేపోతున్నాం.. ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేకపోతున్నాం అని అనుకుంటారు. లోహిత అందరితో వీడియోలు తీసి వైరల్ చేయొద్దు అని కావాలనే అని అందరూ వీడియోలు తీసేలా చేస్తుంది. గడియ తీయగానే మధు బయటకు వస్తుంది. అందరూ ఫోన్స్ ముందు పెట్టుకొని ఉంటారు. స్వప్న మధు దగ్గరకు పరుగులు పెడుతుంది. మధుని లోహిత, శ్రేయలు దారుణంగా అవమానిస్తారు. ఇలాంటి దిక్కుమాలిన పనులు చేయడానికి కాలేజ్‌లో రూంలు ఎందుకు అని మ్యాడీ బయటకు రావడంతో ఇద్దరూ బిత్తరపోతారు. అందరూ మహిని చూసి నువ్వా మ్యాడీ రాత్రి ఫుల్‌గా ఎంజాయ్ చేసినట్లున్నావ్ అని అంటారు.
మహికి చాలా కోపం వస్తుంది. నోరు జారిన ఇద్దరి చెంప పగలగొడతాడు. ఆడపిల్ల అలా ఏ పరిస్థితిలో ఇరుక్కుందో తెలీకుండా మీరు తప్పు చేశారు. వీడియోలు తీస్తూ మీరు తప్పు చేస్తున్నారని తిడతాడు. అసలు రాత్రి ఏంజరిగిందో మీకు తెలుసా అని జరిగింది చెప్తాడు. మన కాలేజ్ అమ్మాయికి ఇలా జరిగినందుకు మనం సిగ్గు పడాలి అని అంటాడు. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోవాలి అని అంటాడు. మధు తలదించుకుంటే తలపైకి ఎత్తి మనం ఏ తప్పు చేయనప్పుడు తల ఎత్తుకొని నిల్చొవాలి అని చెప్పి మధు భుజం మీద చేయి వేసి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా పద అని దగ్గరుండి తీసుకెళ్తాడు. శ్రేయ, లోహిత బిత్తరపోతారు.
శ్రేయ అడ్డుకొని తనని నువ్వు తీసుకెళ్లడం ఎందుకు బావ అని అంటే నేనే తీసుకెళ్లి దగ్గరుండి ఏం జరిగిందో చెప్తా అని తీసుకెళ్తా అంటాడు. ఇక మధు తల్లిదండ్రులకు మధు వీడియో వైరల్ అయిందని ఒకబ్బాయి చూపిస్తాడు. మహి మధులను చూసి వాళ్లు ఏడుస్తారు. మధు ఇంటికి వస్తుంది. అమ్మానాన్నల్ని పట్టుకొని ఏడుస్తుంది. మ్యాడీ వాళ్లతో జరిగింది చెప్తాడు. మ్యాడీ వచ్చి నన్ను కాపాడకపోయి ఉంటే ఈ పాటికి మన ఇంటి ముందు నా శవం ఉండేది నాన్న అని మధు ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















