Chinni Serial Today August 25th: చిన్ని సీరియల్: చిరిగిన బట్టలతో ఒకే గదిలో మధు, మహి.. లోహిత కుట్రకు బలి.. అర్ధరాత్రి టెన్షన్!
Chinni Serial Today Episode August 25th లోహిత పంపిన క్రిష్ ఒంటరిగా ఉన్న మధు మీద దాడి చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మహి, మధులు కపుల్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం చూసి శ్రేయ హర్ట్ అయి వెళ్లిపోతుంది. లోహిత శ్రేయతో ఆ మధు సంగతి నేను చూసుకుంటా ఈ రోజు దాని అంతు చూస్తా అని అంటుంది. ఏం చేస్తావని శ్రేయ అడిగితే లోహిత ఒకబ్బాయిని పిలిచి చెప్పింది గుర్తింది కదా అంతా నేను చెప్పినట్లే చేయాలి అంటుంది. అతను సరే అని లోపలికి వెళ్తాడు.
శ్రేయ ప్లాన్ అడిగితే లోహిత చెప్తుంది. మొత్తం విని సూపర్ శ్రేయ సూపర్.. ఈ రోజుతో ఆ మధు జీవితం మటాష్.. ఈ రోజుతో మధు జీవితం సర్వ నాశనం అవుతుంది అని అంటుంది. లోహిత మధు వాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న దగ్గరకు వెళ్తుంది. అందరూ ప్రాక్టీస్ చేస్తారు. సాయంత్రం 7 అవ్వడంతో అందరూ వెళ్లిపోతారు. మధు కాసేపు ప్రాక్టీస్ చేయాలని ఒక్కర్తే ఉంటుంది. మహి కూడా వెళ్లిపోతాడు.
మరోవైపు నాగవల్లి మ్యాడీ ఇంకా కాలేజ్ నుంచి రాలేదని టెన్షన్ పడుతూ మహికి కాల్ చేస్తుంది. గంటలో వచ్చేస్తా అని మహి చెప్తాడు. ఇక మహి బైక్ ష్టార్ట్ చేసి నాగవల్లితో మాట్లాడుతాడు. మరోవైపు లోహిత పంపిన అబ్బాయి మధు దగ్గరకు వెళ్లి మధు చున్నీ లాగేసి ఇబ్బంది పెడుతుంటాడు. మధు కాలేజ్ మొత్తం పరుగులు పెడుతుంటుంది. ఆ అబ్బాయి మధు డ్రెస్ కూడా చింపేస్తాడు. మధు మహిని చూసి మ్యాడీ అని అరుస్తుంది. ఇంతలో ఆ అబ్బాయి మధు నోరు నొక్కేసి ప్రాక్టీస్ గదికి తీసుకెళ్తాడు. ఇంతలో మ్యాడీ చూసి ఫోన్ బైక్‌లో పెట్టేసి పరుగులు తీస్తాడు. అతన్ని చితక్కొడతాడు. బయటకు వెళ్తూ ఆ అబ్బాయి డోర్ లాక్ చేసేస్తాడు.
మహి డోర్ తీయమని అడిగి డోర్ లాక్ చేసేశాడు రాస్కెల్ అని తిట్టుకుంటాడు. బట్టలు చిరిగిపోయిన స్థితిలో మధుని చూసి చాలా బాధపడతాడు. తన జాకెట్ తీసి మధుకి కప్పుతాడు. మధు మహితో ఇదేంటి మ్యాడీ ఇలా జరిగింది అంటే కంగారు పడొద్దని ఎవరో ఒకరు డోర్ తీస్తారని మహి అంటాడు. మధుని కూర్చొపెట్టి డోర్ కొడతాడు. తర్వాత మధు దగ్గరకు వెళ్లి ఫోన్ ఇవ్వు మా ఫ్రెండ్స్‌కి చెప్తానని అంటాడు. మధు తన ఫోన్ లాకర్‌లో ఉందని అడుగుతుంది. నీ ఫోన్ ఏంది అని మధు అడిగితే బైక్‌లో ఉండిపోయిందని అంటాడు. రాత్రి అయితే ఇంటికి వెళ్లకపోతే మా ఇంట్లో కంగారు పడతారు అని మధు ఏడుస్తుంది.
స్వరూప భర్తతో రాత్రి 11 అయింది ఇంకా మధు రాలేదేంటి అని కంగారు పడుతుంది. వెంటనే స్వప్నకి కాల్ చేస్తుంది. మధు ఇంకా రాలేదని చెప్తుంది. ఇక మళ్లీ మళ్లీ మధుకి కాల్ చేసి చాలా టెన్షన్ పడుతుంది. మనసంతా కీడు శంఖిస్తుందని అంటుంది. చంటి తెలిసిన ప్రతీ ఒక్కరికి కాల్ చేస్తాడు. స్వరూప పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ ఇద్దామని అంటుంది. ఇద్దరూ పోలీస్ స్టేషన్‌కి వెళ్తారు. మరోవైపు మ్యాడీ డోర్ కొడుతూనే ఉంటాడు. ఇక మధు కాళ్లకి గాయం అవ్వడం చూసి మహి కంగారు పడి కాళ్లకి తగిలిన గాజు పెంకు తీస్తాడు. మధు మహి చేతులు పట్టుకొని థ్యాంక్స్ చెప్తుంది. ఇంటి దగ్గర కంగారు పడుతుంటారని ఏడుస్తుంద. అసలు నీ మీద అటాక్ చేసింది ఎవరు అని మహి మధుని అడుగుతాడు.
మరోవైపు లోహిత క్రిష్‌కి కాల్ చేస్తుంది ఫోన్ కలవకపోవడంతో ఏమైందో అనుకుంటుంది. ఇంతలో స్వప్న కాలేజ్ గ్రూప్‌లో మధు కనిపించడం లేదు అని మెసేజ్ చేస్తుంది. లోహిత అది చూసి హ్యాపీగా ఫీలవుతుంది. రేపు మధు పరువు పోతుందని హ్యాపీగా ఫీలవుతుంది. ఇక వల్లి మహి ఇంకా రాలేదని చాలా టెన్షన్ పడుతుంది. దేవాతో విషయం చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















