Chinni Serial Today April 9th: చిన్ని సీరియల్: "నా జీవితంలో భర్త ఉండడు.. నీ జీవితంలో తండ్రి ఉండడు.. మర్చిపో చిన్ని"
Chinni Today Episode చిన్ని రాజు దగ్గరకు వెళ్లి రాజుకి తలంటి స్నానం చేయించి దగ్గరుండి ముస్తాబు చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode సత్యంబాబు అందరికీ ఐస్‌క్రీమ్‌లు కొనిపిస్తాడు. సరళ హర్ట్ అయిపోవడంతో సరళకు కూడా కొనిస్తాడు. సరళ, సత్యం ఒకరికి ఒకరు తినిపించుకోవడం చూసి కావేరి, పిల్లలు మురిసిపోతారు. చిన్ని మనసులో అమ్మానాన్నలు కూడా ఇలా ప్రేమగా ఉంటే ఎంత బాగుంటుందో అనుకుంటుంది. తర్వాత అందరూ బెలూన్స్ కొన ఆడుకుంటారు. దేవా, నాగవల్లి అది చూస్తారు. తొందర్లోనే వాళ్ల సంతోషం మంట కలిసిపోయేలా నేను చేస్తానని చెప్పి వెళ్లిపోతారు.
నాన్న కూడా ఉంటే బాగుండేది..
కావేరి ఇంటికి వచ్చిన తర్వాత అన్నయ్యతో గడిపిన టైం గుర్తు చేసుకొని చాలా సంతోషపడుతుంది. ఇంతలో చిన్ని వచ్చి కావేరి దగ్గర కూర్చొని హ్యాపీగా ఉందని అంటుంది. మన ఫ్యామిలీ అంతా సంతోషంగా గడపడం చాలా సంతోషంగా ఉందని కావేరి అంటుంది. దానికి చిన్ని నాన్న కూడా మన ఫ్యామిలీతో కలిసి ఉంటే ఇంకా హ్యాపీగా ఉండేది కదా అమ్మ అని అంటుంది.
నాన్న మారిపోయాడమ్మా..
వద్దు చిన్ని తన గురించి మాట్లాడొద్దు తనని నాన్న అనుకోవద్దు. చచ్చే వరకు తన మీద కోపం పోదు అని ఉష అంటుంది. చిన్ని ఉషతో అమ్మ నాన్న ఈ మధ్య మారిపోయాడు అని అంటుంది. అలాంటి వాడు మారిపోయాడు అంటే పొరపాటున కూడా నమ్మొద్దని కావేరి అంటుంది. నీకు చెప్పా కదా ఆ దుర్మార్గుడి వల్లే ఇదంతా జరిగిందని చెప్పా కదా. వాడి వల్లే నేను మా నాన్న చావుకి కారణం అయ్యాను. వాడి వల్లే అన్నయ్య వదినల్ని దూరం చేసుకున్నా.. ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నా.. ఆ దుర్మార్గుడి వల్లే ఒక జీవితానికి సరిపడా కష్టాలు మూట కట్టుకున్నా అని అంటుంది.
వాడు తండ్రి అవ్వడం వల్ల నువ్వేం సుఖపడ్డావ్..
నా సంగతి వదిలేయ్ వాడు తండ్రి అవ్వడం వల్ల నువ్వేం సుఖపడ్డావమ్మా. నీకు తండ్రి అయిన పాపానికి కాన్పుకి పుట్టింటికి రావాల్సిన నేను జైల్లో నిన్ను కన్నాను. అందరిలో అల్లారు ముద్దుగా పెరగాల్సిన నువ్వు జైల్లో ఖైదీల మధ్య పెరిగావ్. ఏనాడన్నా వాడు తండ్రిగా నీ పక్కన నిలబడ్డాడా.. ఏ కష్టంలో నీ పక్కన నిలబడ్డాడా. నీ ఆలనాపాలనా చూశాడా. పలానా వ్యక్తి నీ తండ్రి అని చెప్పుకోలేని స్థితిలో పడేశాడు. ఇప్పటికైనా అర్థం చేసుకో. నా జీవితంలో భర్త అనే వాడు ఉండదు. నీ జీవితంలో తండ్రి అనేవాడు ఉండడు అర్థం చేసుకోతల్లి అని కావేరి చెప్తుంది. తల్లీకూతుళ్లు ఒకర్ని ఒకరు హగ్ చేసుకొని ఏడుస్తారు.
నాగవల్లికి తినిపించిన దేవా..
నాగవల్లి తినలేదని దేవాతో కొడుకు చెప్పడంతో దేవా ఫుడ్ తీసుకొని వల్లి దగ్గరకు వెళ్తాడు. బాధ పడొద్దని నాగవల్లితో చెప్తాడు. అవమానం పడితే బాధ పడకుండా ఎలా ఉండాలి అని అంటుంది. దాంతో దేవా చీమకు కూడా హాని తల పెట్టని నేను నీ కోసం ఆ ఉషని చంపడానికి కంకణం కట్టుకున్నా నువ్వు తిను అని బతిమాలుతాడు. ఇంతలో వల్లి అక్క వచ్చి నేను తినిపిస్తానని దేవాని పంపేస్తానని అంటుంది. నాగవల్లికి తన పెద్దక్క తినిపిస్తుంది.
తండ్రిని దగ్గరుండి రెడీ చేసిన చిన్ని..
రాత్రి చిన్ని పడుకొని ఉంటే దేవుడి బండి వస్తుంది. అది చూసి చిన్ని వెళ్లి దండం పెట్టుకుంటుంది. తన తల్లిదండ్రులు కలిసిపోవాలని కోరుకుంటుంది. ఉదయం చిన్ని రెడీ అయి రాజు దగ్గరకు వెళ్తుంది. రాజుని నిద్ర లేపుతుంది. త్వరగా రెడీ అవ్వమని చెప్తుంది. చిన్ని దగ్గరుండి తండ్రికి తలస్నానం చేయిస్తుంది. రాజు కొత్త డ్రస్ వేసుకొని వచ్చి చిన్నితో చిన్నప్పుడు మా అమ్మ ఇలా తలస్నానం చేసింది ఇప్పుడు నువ్వు చేయించావ్ నువ్వు మా అమ్మవి చిన్ని అని హగ్ చేసుకుంటాడు. ఇక చిన్నిరాజు దగ్గర ఉండే హాఫ్ టికెట్‌ని కూడా రెడీ అవ్వమని చెప్తుంది. గంటలో గుడికి వస్తాం మీరు వచ్చేయండి అని చెప్పి వెళ్లిపోతుంది. మీ అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండే రోజు వస్తుందని హాఫ్ టికెట్ అంటాడు. సరళ కొత్త చీర కట్టుకొని మురిసిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: "అత్యాచారయత్నం కేసులో సీఎం అరెస్ట్.. పదవికి రాజీనామా"!





















