Ammayi garu Serial Today April 8th: అమ్మాయి గారు సీరియల్: "అత్యాచారయత్నం కేసులో సీఎం అరెస్ట్.. పదవికి రాజీనామా"!
Ammayi garu Today Episode రాజు, రూపలు మాధవిని తెచ్చి నిరూపించినా సూర్యని అరెస్ట్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode సూర్యప్రతాప్‌కి తనకు సంబంధం ఉందని తనని పెళ్లి చేసుకుంటానని సూర్యప్రతాప్ చెప్పారని ఫేక్ మాధవి అందరితో చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. ఇక జీవన్ అసలైన మాధవిని తన రౌడీలతో చెప్పి తీసుకెళ్తుంటాడు. రాజు, రూపలు అసలైన మాధవి దగ్గరకు బయల్దేరుతారు. చంద్ర మాధవిని తిడతాడు. అనవసరమైన రాద్ధాంతం చేయొద్దని అంటాడు.
రూప, రాజులు హాస్పిటల్‌కి వచ్చేటైంకి జీవన్ మాధవిని తీసుకెళ్లిపోతాడు. హాస్పిటల్‌లో ఇద్దరూ మాధవి లేకపోవడం చూసి షాక్ అయిపోతారు. డాక్టర్‌ని అడిగితే ఆమె తాలూక వాళ్లు తీసుకెళ్లిపోయారని చెప్తారు. దాంతో రూప, రాజులు జీవన్ తాలూకు మనుషులే తీసుకెళ్లుంటారని పరుగులు తీస్తారు.
మాధవి జుట్టు పీక్కొని నా బతుకు బజారున పడింది నా జీవితం నాశనం అయిపోయింది చనిపోతా అని పరుగులు తీస్తుంది. అందరూ సీఎంని నిందిస్తారు. సీఎం అవ్వడం సిగ్గు చేటుగా ఉందని అంటారు. మాధవికి జరిగిన అన్యాయం గురించి ఆలోచించాలని అంటారు. రూప, రాజులు జీవన్ కారుని అడ్డుకొని రౌడీలను చితక్కొట్టి మాధవిని కాపాడుతారు. రాజు జీవన్‌ని చితక్కొడతాడు. రాజు జీవన్ మీద రాయి విసిరి చంపబోతే మాధవి లేవడంతో రూప ఆపుతుంది. అసలైన మాధవిని తీసుకొని ఇంటికి పరుగులు తీస్తారు.
విజయాంబిక: మీ అందరూ నమ్మినా నమ్మక పోయినా నా తమ్ముడు ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నా. తేనేటి విందు లేదు ఏం లేదు అంతా బయటకు వెళ్లండి. ఈ అమ్మాయి విషయంలో మా తమ్ముడు ఏం తప్పు చేయడం లేదు అందుకే కోర్టులో తేల్చుకుందాం.
దీపక్: ఇక్కడ మనం ఏం చేసినా మామయ్య తప్పు చేసినట్లు అవుతుంది. అదే కోర్టులో అయితే మామయ్య ఏ తప్పు చేయలేదని తేలుతుంది.
రాజు: పెద్దయ్యగారి గురించి ఏ కోర్టులోనూ తేల్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరిది తప్పో మేం నిరూపిస్తాం.
దీపక్: మామ్ వీడు కచ్చితంగా ఏదో ఒక సాక్ష్యంతోనే వచ్చుంటాడు.
రూప: అవును మా నాన్న ఏం తప్పు చేయలేదు. అసలు తప్పు అంతా ఈ రాధికదే.
సూర్యప్రతాప్: రాధికానా..
రాధిక: నా పేరు తెలిసిపోయిందంటే నా గురించి తెలిసిపోయింటుంది.
రూప: నాన్న ఈవిడ పేరు రాధిక మీకు పీఏగా ఎంపిక అయిన మల్లెల మాధవిని బంధించి ఆవిడ ప్లేస్‌లో ఈవిడ గారు వచ్చారు. ఇదంతా జీవన్ ఆడిస్తున్న నాటకం.
రాజు: అవును పెద్దయ్య అసలైన మాధవిని కూడా మేం తీసుకొచ్చాం. ఈవిడే పెద్దయ్య ఆ మాధవి గారు. అంతే కాదు పెద్దయ్య ఈ రాధిక మీ దగ్గరకు తీసుకొచ్చిన ఏ ఫైల్ కూడా కరెక్ట్ కాదు. ఆ ఫైల్‌ని అడ్డం పెట్టుకొని మిమల్ని సీఎం పదవి నుంచి దించేయాలి అని ప్లాన్ చేశారు.
రూప: ఆఫైల్స్‌లో జరగాల్సిన దారుణాలన్నింటినీ రాజునే ఆపాడు నాన్న. ఎస్‌ఐ గారు ఈ కిలాడీ లేడీని అరెస్ట్ చేసి నిజం రప్పించండి.
రాధిక: ఒక్క నిమిషం మీ అందరికీ తెలియని మరో నిజం చెప్తా. ఈ మాధవిని బంధించింది ఆవిడ ప్లేస్‌లో నన్ను ఇక్కడికి రప్పించింది సాక్ష్యాత్తు సీఎం సూర్యప్రతాప్ గారే.
రాధిక మాటలు వీడియోలో చూసిన జీవన్ నవ్వుకుంటాడు. నాకు తెలీదు అని సూర్యప్రతాప్ తలూపుతాడు. నా మెడలో తాళి కడతా అని ప్రమాణం చేశారని చెప్తుంది. మాధవి అని సూర్య అంటే అందరికీ తెలిసిపోయింది రాధిక అనే పిలు సూర్య మనం ఇక నటించాల్సిన అవసరం లేదు అని అంటుంది. సూర్యప్రతాప్ ఆమెను అరెస్ట్ చేసి నిజం చెప్పించమని అంటాడు. రాధిక మాత్రం ఏడుస్తు నేను మోస పోయింది నిజం అని బలవంతం చేయబోయింది నిజం అని న్యాయం జరగకపోతే ఇదే మేడ మీద నుంచి దూకి చచ్చిపోతా అని ఏడుస్తుంది.
పోలీసులు సీఎంతో లీగల్‌గా కోర్టులో తేల్చుకోవాలని సూర్యప్రతాప్‌ని అరెస్ట్ చేస్తారు. నిందలతో కూడిన పదవి నాకు అవసరం లేదని సూర్యప్రతాప్ సీఎం పదవికి రాజీనామా చేస్తాడు. నిజాయితీ కోర్టులోనే తేల్చుకుంటా అని పోలీసులతో వెళ్తారు. రూప రాధిక చెంపలు వాయిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Also Read: చిన్ని సీరియల్: నాగవల్లిని దొంగని చేసిన ఉష.. చెల్లికి చీర గిఫ్ట్ ఇచ్చిన సత్యంబాబు!





















