అన్వేషించండి
Lakshimi Raave Maa Intiki Serial Today March 17th: ప్రెషర్స్‌డే రోజు శ్రీలక్ష్మీని అవమానించేందుకు త్రిష వేసిన ప్లాన్ ఏంటి..? గోపీ విడాకుల సంగతి తెలిసి వాళ్ల అమ్మ ఏం చేసింది...?
Lakshimi Raave Maa Intiki Serial Today Episode March 17th: ప్రెషర్స్‌డే రోజు శ్రీలక్ష్మీని అవమానించేందుకు త్రిష వేసిన ప్లాన్ ఏంటి..? గోపీ విడాకుల సంగతి తెలిసి వాళ్ల అమ్మ ఏం చేసింది...?

లక్ష్మీ రావే మా ఇంటికి టుడే ఏపిసోడ్
Source : ZEE5.com
Lakshimi Raave Maa Intiki Serial Today Episode: ప్రెషర్స్ డే పార్టీకి హీరోలా తయారై వచ్చిన మ్యాడీని చూసి త్రిష పొగడ్తలతో ముంచెత్తుతుంది. అచ్చం హీరోలా ఉన్నావని అంటుంది. దీనికి బదులుగా నువ్వుకూడా చాలా అందంగా ఉన్నావని మ్యాడీ అంటాడు. ఇవాళ టాక్ ఆఫ్ ది కాలేజీ నువ్వేనని అంటాడు. ఆ మాటలు విన్న లెక్చరర్స్ టాక్ ఆఫ్ ది కాలేజీ ఈ అమ్మాయి కాదని...ఆ అమ్మాయని అప్పుడే వస్తున్న శ్రీలక్ష్మీని చూపిస్తారు. అచ్చ తెలుగు తెలుగమ్మాయిలా ఉన్న ఆ ఆమ్మాయిని చూస్తుంటే...సరస్వతీదేవి నడిచొస్తున్నట్లు ఉందని అనడంతో త్రిష ఉడుక్కుంటుంది.
అయితే ఇవాళ అది తప్పకుండా టాక్ ఆఫ్ ది కాలేజీ అవుతుందని..కాకపోతే అది దాని అందం వల్ల, డ్రెస్సింగ్ వల్ల కాకూడదని దాని తెలుగు వల్లే అవమానపడాలని త్రిష అంటుంది. దీనికి మ్యాడీ కూడా సరేనంటాడు. ఎలాగైనా ఇవాళ దాన్ని అవమానించాలని చెప్పడంతో ఇప్పుడే నేను వెళ్లి ప్రెషర్స్ స్పీచ్ లిస్ట్‌లో ఆ ఎర్రబస్సు పేరు ఎక్కించి వస్తానని మ్యాడీ వెళ్తాడు
మ్యాడీ వెనకే పరుగెత్తుకుని వెళ్తున్న శ్రీలక్ష్మీని త్రిషతోపాటు ఆమె ప్రెండ్స్ అడ్డుకుంటారు. పిలుస్తుంటే ఎక్కడికి వెళ్తున్నావని అంటారు.అయ్యో మీరు ఏమని పిలిచారని అనగా...ఎర్రబస్సు అని పిలిస్తే వినిపించలేదా అని అంటారు. నా పేరు శ్రీలక్ష్మీ అని అలా పిలిస్తేనే పలుకుతానని లక్ష్మీ బదులిస్తుంది.మిమ్మల్ని పొగరబోతు అంటే మీరు పలుకుతారా అని ఎదురు ప్రశ్నిస్తుంది.
ఆ మాటలకు కోపం వచ్చిన త్రిష....ఆమె తలలో పెట్టుకున్న పూలు లాగేస్తుంది.కళ్లకు పెట్టుకున్న కాటుకు చెరిపేసి, జుట్టు మొత్తం చిందరవందర చేసి అవమానిస్తుంది. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని అంటుంది. అయినా పల్లెటూరు దానిలా ఇవన్నీ ఎందుకు వేసుకున్నావని త్రిష అవమానించడంతో....పూలు, కాటుక, బొట్టు, గాజుల వెనక ఉన్న చరిత్ర, సంప్రాదయం గురించి శ్రీలక్ష్మీ వాళ్లందరికీ గట్టిగా క్లాస్ పీకుతుంది. ఇది కాలేజీ కాబట్టి ఊరుకున్నాననని అదే రోడ్డుమీద అయితే మీ పని చెప్పేదాన్నని అంటుంది.
ఇప్పుడు కూడా మీపై ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేస్తానని వెళ్లబోతున్న శ్రీలక్ష్మీని త్రిష ఆపుతుంది. వెళ్లి ప్రిన్సిపల్‌కు కంప్లైంట్ ఇస్తే మేము కూడా నీమీద ఏదో ఒకటి ఫిర్యాదు చేస్తామని అంటుంది.అప్పుడు నీతోపాటు మమ్మల్ని కూడా సస్పెండ్ చేస్తారని అంటుంది. హాలీడే ట్రిప్ పేరిట నేను మ్యాడీని తీసుకుని జాలీగా షికారుకు వెళ్తామని...నువ్వు మాత్రం చదువు ఆగిపోయి ఇంట్లో కూర్చుని ఏడుస్తుంటావని చెబుతుంది. దీంతో భయపడిపోయిన శ్రీలక్ష్మీ వెనక్కి తగ్గుతుంది. మర్యాదగా ఇక్కడ ఏం జరగనట్లు వెళ్లిపొమ్మని త్రిష వార్నింగ్ ఇవ్వడంతో లక్ష్మీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
అప్పుడే మ్యాడీ స్టేజీమీద స్పీచ్ ఇచ్చేవారి లిస్ట్‌లో శ్రీలక్ష్మీ పేరు యాడ్ చేసి వచ్చేస్తాడు. ఏం జరిగిందని,ఎందుకు శ్రీలక్ష్మీ అలా వెళ్లిపోతుందని అడుగుతాడు. దానికి గట్టిగా బుద్ది చెప్పాంలే అని త్రిష అనడంతో పార్టీకి టైం అయిపోతుందని అందరూ కలిసి లోపలికి వెళ్తారు. స్టేజీపైకి సీనియర్ స్టూడెంట్ విక్రమ్‌ను పిలవడంతో విద్యార్థులంతా చప్పట్లో స్వాగతం పలుకుతారు. అతడిని చూడగానే మ్యాడీ జల్సీగా ఫీలవుతాడు. విక్రమ్ ఇచ్చిన స్పీచ్....శ్రీలక్ష్మీకి బాగా నచ్చుతుంది. కానీ మ్యాడీ, వాళ్ల ప్రెండ్స్ మాత్రం చాలా బోర్‌గా ఫీలవుతారు.
సింధూ, గోపీ విడాకులకు అప్లై చేసిరావడంతో లాయర్ గోపీ ఇంటికి నోటీసులు పంపుతాడు.వాటిని తీసుకుని వచ్చిన గోపీ తల్లి...సింధూకు ఇవ్వడానికి వెళ్తుంటే కూతురు ఆపి నేను చూస్తానంటూ కవర్ ఓపెన్ చేసి చూస్తుంది. అందులో అన్నయ్య, వదినలు విడాకులు తీసుకోనున్నట్లు ఉందని తల్లికి చెప్పడంతో కోపంతో వాటిని తీసుకుని వెళ్లి సింధూను నిలదీస్తుంది. ఏంటి ఇదని అడగడంతో ఆమె నీళ్లు నములుతుంది.
Before You Go
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















