Chinni Serial Today April 5th: చిన్ని సీరియల్: రాజు కాలర్ పట్టుకొని ప్రాణస్నేహితుడి గురించి ప్రశ్నించిన సత్యం.. కావేరి కాలు పట్టుకున్న అన్న!
Chinni Today Episode కావేరి మెట్ల మీద నుంచి పడిపోవడంతో సత్యం బాబు ఎమోషనల్ అయి చెల్లి కాళ్లకు మసాజ్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode ఉషనే కావేరి అని తెలుసుకున్న సత్యంబాబు కావేరి దగ్గరకు వెళ్తుండగా లాయర్ కాల్ చేసి దేవేంద్ర ఉషని కావేరి అనుకొని పోలీస్ ఎంక్వైరీ చేయించాడని, చంపడానికి కూడా ప్రయత్నించాడని అనుమానంగా ఉందని.. చిన్ని గురించి తెలిసినా దేవా వల్ల చిన్నికి కూడా ప్రమాదం పొంచి ఉందని లాయర్ చెప్తాడు. దాంతో సత్యం బాబు షాక్ అయిపోతాడు.
కావేరిని బయట పెట్టడం కరెక్ట్ కాదు..
దేవేంద్ర గురించి తెలుసుకున్న సత్యంబాబు ఇలాంటి టైంలో ఉషనే కావేరి అని బయట పెట్టడం కరెక్ట్ కాదని కావేరిని పీటీ టీచర్ ఉష గానే ఉంచాలని అనుకుంటాడు. హరి చెప్పినట్లే దేవేంద్ర పని పట్టాలని దేవా నిజంగా ఊరు వచ్చుంటే వాడు ఎక్కడున్నాడు అనే విషయం కచ్చితంగా బాలరాజుకి తెలిసే ఉంటుందని బాల దగ్గరకు సత్యంబాబు బయల్దేరుతాడు.
నీ ప్రాణ స్నేహితుడికి చెప్పాలి అనుకుంటున్నావా..
రాజు దగ్గరకు వెళ్లిన సత్యం బాబుని రాజు ఇలా వచ్చేవేంటి సత్యంబాబు అంటే నిజం తెలుసుకోవడానికి అంటాడు. ఏం నిజం అంటే నువ్వు దాచిన నిజం ఏం నిజం దాచావో తెలీదా. అసలు నువ్వు ఎందుకు మా చుట్టూ తిరుగుతున్నావ్? పిల్లలను ఎందుకు మచ్చిక చేసుకుంటున్నావ్? పీటీ టీచర్ ఉష, కావేరి ఇద్దరూ ఒకటే అని అనుమానమా? ఆ అనుమానం తీర్చుకొని నీ ప్రాణ స్నేహితుడు దేవేంద్రకు ఆ విషయం చెప్పాలి అనుకుంటున్నావా? నేను ఎందుకు అలా చేస్తానని రాజు అంటాడు.
వాడు చెప్పాడనే భార్య మీద నింద వేశావ్..
నీ ప్రాణస్నేహితుడు చెప్పాడు అనే కదా కావేరి మీద నింద వేసి అరెస్ట్ చేయించావని సత్యంబాబు అంటాడు. నేను అప్పటిలా లేను పూర్తిగా మారిపోయాను అని రాజు అంటే ఏం మారావ్ తొండ ముదిరి ఊసరవెళ్లి అయినట్లు తయారయ్యావా అని అడుగుతాడు. చెప్పు ఆ దేవేంద్ర గాడు ఎక్కడ ఉన్నాడు. వాడి గురించి ఎందుకు అని రాజు అడిగితే నా చెల్లిని కాపాడుకోవడానికి అని సత్యంబాబు చెప్తాడు. నీ చెల్లి చనిపోయింది కదా అంటే నా చెల్లి రూపంలో ఉన్న ఉషని కాపాడుకోవడానికి నా మేనకోడల్ని కాపాడుకోవడానికి అని చెప్తాడు. దేవేంద్ర వర్మ ఎక్కడున్నాడో చెప్పు అని అడుగుతాడు.
వాడి గురించి ఆలోచించడం అంటే చావు వెతుక్కోవడమే..
వద్దు సత్యం వాడి గురించి నువ్వు ఆలోచించుకొని వెళ్లొద్దు వాడి గురించి ఆలోచించడం అంటే మన చావుకి మనమే ఎదురు వెళ్లడం వాడి గురించి నీకు తెలీదు అని రాజు అంటాడు. చావు భయం ఎలా ఉంటుందో నీ ప్రాణ స్నేహితుడికి పరిచయం చేస్తాను అని రాజు కాలర్ పట్టుకొని అడుగుతాడు. అందరూ చూస్తున్నారు వద్దు సత్యం అంటే నీకు పరువు ఉందా అని అడుగుతాడు. అక్కడున్న వాళ్లు సత్యంని ఆపాలని ప్రయత్నిస్తే వాళ్ల మీద కేకలు వేసి పంపేస్తాడు. దేవేంద్ర అడ్రస్ చెప్పమని అడుగుతాడు. రాజు తెలీదు అని చెప్తాడు. చెప్పను అని చెప్పురా తెలీదు కాదు అని అంటాడు. వారం రోజుల్లో వాడు ఎక్కడున్నాడో చెప్పకపోతే నేను కనుక్కొంటా అని చెప్పి వెళ్లిపోతాడు.
తను కావేరి అయ్యుండదు సార్..
దేవాకి ఒకతను కాల్ చేసి డీఎన్‌ఏ మ్యాచ్ అవ్వలేదని తను కావేరి కాదని అంటాడు. డీఎన్ఏ నువ్వు మ్యాచ్ అయ్యేలా చేయాల్సింది కదా అని దేవా అంటాడు. ఏసీపీ కావేరి కేసు తవ్వినట్లే నా భార్య కేసు కూడా తిరగేస్తే నా పరిస్థితి ఏంటి అంటాడు. ఇక నాగవల్లి రావడంతో కావేరి ఉష ఒకటి కాదని తేలిందని ఏసీపీ నన్ను అనుమానిస్తున్నాడని చెప్తాడు. హోళీ రోజు ఉష మీద మర్డర్ ప్రయత్నం చేశావా అంటే సారీ బావ దాన్ని చంపలేకపోయానని నాగవల్లి చెప్తుంది. నాగవల్లి పగ ఆ ఉషని చంపేవరకు తగ్గదు అని అంటుంది. నా బాధ కరెక్ట్ అనిపిస్తే నాకు సాయం చేయమని అంటుంది. దేవా సరే అంటాడు.
చెల్లి కాలు పట్టుకున్న అన్న..
సత్యంబాబు ఇంటికి వస్తాడు. కావేరి వస్తూ కింద పడిపోబోతే సత్యం పట్టుకుంటాడు. అందరూ బయటకు వస్తారు. ఉష థ్యాంక్స్ చెప్తే అన్నా చెల్లెలు మధ్య థ్యాంక్స్‌లు ఏంటమ్మా అని అంటాడు. అన్నాచెల్లెళ్లు ఏంటి అని సరళ అంటే మా చెల్లిలా ఉంటుందని అలా అంటాడు. ఉషకి సత్యం జాగ్రత్తలు చెప్తే సరళ ఆయనతో సొంత చెల్లితో చెప్పినట్లు జాగ్రత్తలు చెప్తున్నావ్ ఏంటయ్యా అంటుంది. ఇక ఉష నడవడానికి ఇబ్బంది పడితే సత్యంబాబు, చిన్ని కావేరిని కూర్చొనట్టి కావేరి కాలు పట్టుకొని కొబ్బరి నూనె రాస్తాను అని కాలు పట్టుకుంటే ఉష వద్దని చెప్తుంది. ఏం పర్లేదమ్మా నా చెల్లిలిలాంటిదానివే కదా అంటాడు. చిన్ని, ఉష ఇద్దరూ ఎమోషనల్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: అసలైన వారసురాలు ఎవరు నాన్న? కాశీ, స్వప్నల ఎంక్వైరీ





















