Karthika Deepam 2 Serial Today April 5th: కార్తీకదీపం 2 సీరియల్: అసలైన వారసురాలు ఎవరు నాన్న? కాశీ, స్వప్నల ఎంక్వైరీ
Karthika Deepam 2 Serial Today Episode జ్యోత్స్న గౌతమ్‌ని దీప మీదకు రెచ్చగొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్ దీపకు నిజం చెప్పి మనది దేవుడు కలిపిన బంధం.. నువ్వు నా బాటసారివి కాదు నా భాగస్వామివి. నా నీడలో బతికే సాధారణ మనిషివి కాదు నా ప్రాణం కాపాడిన ప్రాణదాతవి. నీ రుణం నేను తీర్చుకోలేనని కార్తీక్ అంటాడు. దానికి దీప లేదు కార్తీక్ బాబు మీరు నా రుణం తీర్చుకున్నారు. నా లాకెట్ మీదగ్గర దాచుకొని నాకు మాంగల్యం ప్రసాదించారు. నేను మీ ప్రాణాలు కాపాడితే మీరు నా జీవితం కాపాడారు.. ఈ గడ్డిమొక్కని తులసి మొక్క చేశారని అంటుంది. ఎన్నో ఆటుపోట్లు ఉన్న జీవితాన్ని ఒక్క తాళితో గంగాజలంతో కడిగేసి శుద్ధి చేశారని అంటుంది. దీపలా మిగిలిపోవాల్సిన నన్ను మీ పేరు పక్కన చోటిచ్చి నన్ను కార్తీకదీపం చేశారని అంటుంది.
మనం కలిసే ఉంటాం...
నన్ను వదిలేసి ఎలా వెళ్తానని అనుకున్నావ్ దీప.. మనం భార్యాభర్తలుగా ఉన్నంత వరకు కలిసే ఉంటాం. ప్రాణాలు కాపాడిన నిన్ను ప్రాణం ఉన్నంత వరకు దూరం చేసుకోలేనని కార్తీక్ అంటాడు. ఇద్దరం కలిసే కష్టాలు ఎదుర్కొందామని అంటాడు. నీ నిజాయితీ నిరూపించుకొనే రోజు వస్తుంది. అప్పుడు నిన్ను తిట్టిన వాళ్లే నీకు క్షమాపణలు చెప్తారని అంటాడు. మన ప్రయాణం ఆగకూడదు మనం కలిసి ప్రయాణం చేస్తూనే ఉండాలి మన ఇద్దరం ఒకటే అని చెప్తాడు. మన జీవితంలోకి ఎలాంటి తుఫాను అయినా రానివ్వు ఎదుర్కొందాం అని అంటాడు.
నేనే నీ మెడలో వేస్తా..
దీపకు కార్తీక్ లాకెట్ చూపించి నీ లాకెట్ నువ్వే తీసుకో అంటాడు. దీప తీసుకుంటుంటే నువ్వు నా ప్రాణ దాతవి అయింటే చేతికి ఇచ్చేవాడిని కానీ నువ్వు నా భార్యవి నేను నీ మెడలో వేస్తానని చెప్పి దేవుడు సాక్షిగా ఈ లాకెట్ నీ మెడలో వేస్తానని దీప మెడలో లాకెట్ వేస్తాడు.దీప చాలా సంతోష పడుతుంది. ఇద్దరూ ఒకర్ని చూసుకొని నవ్వుకుంటారు. ఇది నీకు ఎవరు ఇచ్చారు అని కార్తీక్ అడిగితే నాన్న అమ్మ గుర్తుగా చిన్నప్పుడు నాకు ఇచ్చారని అంటుంది. మీ నాన్న పెద్దయితే మనల్ని దీవిస్తే మీ అమ్మ చిన్నప్పుడే నన్ను కలిపిందని అంటాడు.
సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందామా..
గౌతమ్ జ్యోత్స్నని కలుస్తాడు. మీ ఇంట్లో నాకు జరిగిన అవమానానికి నేను మీ మీద పరువు నష్టం దావా వేయొచ్చు కానీ నేను మంచి వాడిని కాబట్టి ఆ పని చేయలేదు. జరిగింది మర్చిపోదాం మనద్దరం ఈ సారి సింపుల్‌గా పెళ్లి చేసుకుందాం అని గౌతమ్ అంటాడు. దానికి జ్యోత్స్న ఓరేయ్ అమాయకుడా నేను దేశముదురినిరా. నేను నిన్ను పిలిచింది నిన్ను రెచ్చ గొట్టి దీప మీదకు పంపడానికి నువ్వేంటో నీ బతుకు ఏంటో నాకు తెలుసు అని మనసులో అనుకుంటుంది.
దీప నిన్ను వదలదు..
దీప నీ మీద వేసిన నింద గురించి ఏమనుకుంటున్నావ్. దీప వేసిన నింద నమ్మేలా ఉన్నారు మా వాళ్లు. నువ్వేం చేశావో తనేం చూసిందో నాకు తెలీదు కానీ దీప అదే పనిలో ఉంది. నింద నిరూపిస్తా అని ఛాలెంజ్ చేసింది. నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే మా వాళ్లు ఓకే అనాలి. నువ్వు నిజంగా తప్పు చేసుంటే ఒప్పుకో అని జ్యో అంటుంది. మీ తల్లిదండ్రుల్ని ఒప్పిస్తే నీకు ఒకేనా నా దారిలోకి వస్తే దీపకి నేనే ఏంటో చూపిస్తా. జ్యో వెళ్లిపోయిన తర్వాత గౌతమ్ దీపని ఆపితేనే నువ్వు నీ ఆస్తి నాకు దక్కుతాయని దీప పని చూస్తా అనుకుంటాడు.
అసలైన వారసురాలు ఎవరు..
దాసు దగ్గర కాశి కూర్చొని అన్నీ గుర్తు తెచ్చుకో నాన్న అని అంటాడు. స్వప్న ఇళ్లు తుడుస్తూ దాసు రాసిన పేపర్ చేస్తుంది. కాశీని పిలుస్తుంది. అందులో అన్నయ్యా నీకు ఒక విషయం చెప్పాలి. ఇంటి వారసురాలికి అన్యాయం జరిగింది. అసలైన వారసురాలు.. అని ఉంటుంది. ఇదేంటి ఇలా రాశారు అని కాశీ, స్వప్న అనుకుంటారు. దాసునే అడిగి తెలుసుకోవాలని అనుకుంటారు. దాసుకి పేపర్ ఇచ్చి ఏంటి అని అడుగుతారు. నాకు తెలీదు నేను రాయలేదు అని చెప్తాడు. అసలైన వారసురాలు అని రాసి ఆపేశావ్ అసలైన వారసురాలు అంటే ఎవరు అని అడుగుతాడు. దాసు తలనొప్పి వస్తుందని వెళ్లిపోతాడు. వారసురాలు, దశరథ్ పెద్దనాన్నని ఆ ఇంటికి ఏదో సంబంధం ఉంది అని కాశీ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: మాధవి కొడుకుని కిడ్నాప్ చేసిన రాజు.. సీఎం మీద మాధవి అత్యాచార నింద వేస్తుందా!





















