అన్వేషించండి

Ego Raja First Look: 'ఈగో రాజా'గా ఆది... ఉగాదికి కొత్త టైటిల్ పోస్టర్, లుక్కు రిలీజ్

Aadi Saikumar New Movie: 'శంబాల'తో గతేడాది క్రిస్మస్ (డిసెంబర్ 25 రిలీజ్)కి మంచి విజయం అందుకున్నారు ఆది సాయి కుమార్. ఉగాదికి దర్శక నిర్మాతలు గురు శరవణన్, జి. సురేష్‌తో కొత్త సినిమా అనౌన్స్ చేశారు.

ఆది సాయి కుమార్ (Aadi Saikumar) లాస్ట్ ఇయర్ హిట్ ట్రాక్ ఎక్కేశారు. ఆయన కథానాయకుడిగా నటించిన మిస్టికల్ థ్రిల్లర్ 'శంబాల' సక్సెస్ అయ్యింది. కలెక్షన్లు కూడా రాబట్టింది. ఈ సక్సెస్ జోష్‌లో ఆయన మరో కొత్త సినిమా అనౌన్స్ చేశారు. ఆ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. 

'ఈగో రాజా'గా ఆది సాయి కుమార్!
ఆది సాయి కుమార్ కథానాయకుడిగా ఎస్‌జిఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై జి. సురేష్ ఓ సినిమా నిర్మిస్తున్నారు. గురు శరవణన్ దర్శకుడు. ఈ చిత్రానికి 'ఈగో రాజా' టైటిల్ ఖరారు చేశారు. ఆదితో పాటుగా సతీష్‌ (Tamil Actor Sathish) ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఉగాది సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు ఆది సాయి కుమార్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

Also ReadDhurandhar 2 Review Telugu - ధురంధర్ 2 రివ్యూ: రణవీర్ సింగ్, ఆదిత్య ధర్‌ల రివేంజ్ ఎలా ఉంది? సీక్వెల్ హిట్టేనా?

'ఈగో రాజా'లో ఆది సాయి కుమార్‌ ఫస్ట్ లుక్ చూస్తే... ఆయన చుట్టూ రౌడీలు, ఒంటిపై గాయాలు, రక్తం మరకలు కనిపిస్తున్నాయి. మాంచి హై వోల్టేజ్ యాక్షన్ సినిమాగా 'ఈగో రాజా'ను తెరకెక్కిస్తున్నట్టు అర్థం అవుతోంది. ఆది కూడా చాలా డిఫరెంట్‌ & అగ్రెస్సివ్‌ ఎక్స్‌ప్రెషన్‌తో చేతిలో సిగరెట్ పెట్టుకున్న తీరు చూస్తుంటే 'శంబాల'తో కంపేర్ చేస్తే మరొక డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారని అర్థం అవుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోందని, త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు. 

Also ReadOscar: ఆస్కార్స్‌లో షాకింగ్ మూమెంట్స్... చిరిగిన డ్రస్ నుంచి తగిలిన చెంపదెబ్బల వరకూ - వివాదాల వేడుక

గతంలో కేఎస్ రవికుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో గురు శరవణన్ పని చేశారు. ఆ తర్వాత 'కూగల్ కుట్టప్ప'తో దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకున్నారు. 'ఈగో రాజా' ఆయన మూడో సినిమా. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, సంగీతం: గిబ్రాన్, ప్రొడక్షన్ డిజైనర్: దురైరాజ్.

Also ReadAllu Cinemas: అల్లు సినిమాస్ స్పెషాలిటీ ఏమిటి? 'డాల్బీ సినిమా' స్క్రీన్‌లో పిక్చర్ ఎందుకు చూడాలంటే?

టాప్ హెడ్ లైన్స్

Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Veda Jalandhar: ఆ రెండూ రిలీజ్ కాలేదు... కట్ చేస్తే 'తిమ్మరాజు పల్లి'తో హిట్... ఇప్పుడు 'అమీర్ లోగ్'తో!
ఆ రెండూ రిలీజ్ కాలేదు... కట్ చేస్తే 'తిమ్మరాజు పల్లి'తో హిట్... ఇప్పుడు 'అమీర్ లోగ్'తో!
Anupama Parameswaran : అనుపమకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే - పర్సనల్ లైఫ్ కామెంట్స్‌పై హీరోయిన్ అదితి శంకర్ రియాక్షన్
అనుపమకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే - పర్సనల్ లైఫ్ కామెంట్స్‌పై హీరోయిన్ అదితి శంకర్ రియాక్షన్
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకికి తీవ్ర అస్వస్థత - ఐసీయూలో ట్రీట్మెంట్
సీనియర్ నటి షావుకారు జానకికి తీవ్ర అస్వస్థత - ఐసీయూలో ట్రీట్మెంట్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Embed widget