Chinni Serial Today April 3rd: చిన్ని సీరియల్: నీలాంటి తండ్రి బతికున్నా చచ్చినా ఒకటే.. నన్ను ముట్టుకోకు.. రాజుపై చిన్ని సీరియస్!
Chinni Today Episode కావేరిని కాపాడుతుంది రాజునే అని తెలుసుకున్న చిన్ని రాజుని నాన్న అని మొదటి సారి పిలవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode భారతి రాజు దగ్గరకు వచ్చి నిజం చెప్పమని అంటుంది. టైం వస్తే చెప్తానని ఇప్పుడు చెప్తే శ్రేయాభిలాషిలా కూడా ఉండలేనని రాజు అంటాడు. ఇంతలో చిన్ని వస్తుంది. రాజు తన చిన్నమ్మని దాక్కోమని చెప్తాడు. చిన్ని రావడం రావడంమే రాజు మా అమ్మ జైలుకి వెళ్లడానికి కారణం ఏంటి అని అడుగుతుంది.
తండ్రిని నిలదీసిన చిన్ని..
ఏ నేరం మీద మా అమ్మని అరెస్ట్ చేశారు రాజు.. నీ చేత ఆ రోజు అబద్ధం చెప్పించింది ఎవరు? మా అమ్మ నిర్దోషి అని నిరూపించి బయటకు తీసుకొస్తా అన్నావ్ కానీ చివరి నిమిషంలో నువ్వు మాయమైపోయావ్. ఆరోజు ఎందుకు అలా మాయం అయిపోయావ్? చెప్పు రాజు చెప్పు అని అడుగుతుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు అని రాజు అడుగుతాడు. ఇప్పుడే కావాలి అని చిన్ని అంటుంది. మా అమ్మ టీచరమ్మ ఒకేలా ఉండటం వల్ల ఏసీపీ సార్ టీచరమ్మని ఇబ్బంది పెడుతున్నారు కదా. ఇకపై అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే ఏం జరిగిందో నాకు తెలియాలి నిజం చెప్పు రాజు అని అడుగుతుంది. అవన్నీ నీకు అర్థం కావని రాజు అంటాడు. దాంతో చిన్ని నువ్వు చెప్పే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్లను అంటుంది. ఇప్పుడేం చెప్పలేనని రాజు అంటాడు.
నన్ను ముట్టుకోకు రాజు..
ఇప్పుడేం చెప్పును టైం వచ్చినప్పుడు చెప్తాను. ముందు ఇంటికి వెళ్దాం పద అని రాజు అంటే చిన్ని తనని ముట్టుకోవద్దని అంటుంది. నాతో మాట్లాడొద్దు.. నువ్వు ఎలాంటి వాడు ఇప్పుడు అర్థమైంది. నువ్వు స్వార్థపరుడివి.. నువ్వు ఎంత దుర్మార్గుడివో మా మామయ్య చెప్తుంటాడు. నువ్వు దుర్మార్గుడివే.. నీచుడివే.. నీ లాంటి తండ్రికి కూతురు అయినందుకు అసహ్యం వేస్తుంది. నీ లాంటి తండ్రి బతికున్నా ఒకటే చనిపోయినా ఒకటే అని తిడుతుంది. దాంతో చిన్ని అని అరుస్తూ భారతి బయటకు వస్తుంది. ఆవిడను చూసి చిన్నీ షాక్ అయిపోతుంది.
రాజు గురించి నిజం తెలుసుకున్న చిన్ని..
చిన్ని వీడి గురించి ఏం మాట్లాడుతున్నావ్.. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకు అని అంటుంది. ముందు బాలరాజుకి సారీ చెప్పమని అంటుంది. రాజు భారతిని చిన్నమ్మ అనడంతో చిన్ని షాక్ అవుతుంది. మీరు రాజు చిన్నమ్మ అయితే మీరు టీచరమ్మ దగ్గరకు ఎందుకు ఉన్నారు అని అడుగుతుంది. తను టీచరమ్మ కాదు మీ అమ్మ కావేరి అని భారతి చెప్తుంది. మీ అమ్మని పోలీస్ స్టేషన్ నుంచి కాపాడింది.. ఇప్పటి వరకు అజ్ఞాత వ్యక్తిలా కాపాడుకుంటుంది కూడా మీ నాన్నే. ఇప్పుడు చెప్పు వాడు నీచుడా.. దుర్మార్గుడా అని అడుగుతుంది. అవన్నీ వదిలేయ్ అని రాజు అంటాడు..
రాజుని నాన్న అని పిలిచిన చిన్ని..
నిజం తెలిసిన చిన్ని ఎమోషనల్ అయి రాజుని నాన్న అని పిలుస్తుంది. రాజు ఎమోషనల్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు. చిన్ని నాన్ని అని పిలిచి రాజుని హగ్ చేసుకుంటుంది. నాన్న నన్ను క్షమించు అని చెప్పి చిన్ని ఏడుస్తుంది. చిన్ని ఇంకొక్క సారి నాన్న అని పిలవమ్మా అని రాజు అంటాడు. చిన్ని ఏడుస్తూ నాన్న అని పిలుస్తుంది. ఇంటికి వెళ్లి అమ్మా, మామయ్యలకు విషయం చెప్దామని చిన్ని అంటే రాజు ఆపేస్తాడు. ఎవరికీ అప్పుడే విషయం చెప్పొద్దని అంటాడు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు.
కొట్టుకున్న రాజు, ఉషలు..
ఉదయం చిన్నికి ఉష వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పి కూరగాయలకు వెళ్దామని అంటుంది. చిన్ని వస్తానని చెప్పి సరళకు చెప్పి వస్తానని అంటుంది. తల్లీదండ్రుల్ని కలపాలి అని రాజుకి కాల్ చేసి నాన్న కూరగాయలు కొనడానికి వెళ్తున్నా రా అని చెప్తుంది. చిన్ని, ఉషలు కూరగాయలు కొంటుంటే రాజు వస్తాడు. చిన్ని రాజులు మాట్లాడుకుంటుంటే కావేరి వెళ్లి నువ్వు ఎందుకు వచ్చావ్ అని గొడవ పడుతుంది. రాజుని పంపేసి చిన్నిని రమ్మని ఉష చెప్పి వెళ్తుంది. అమ్మానాన్న కలిసి ఉంటే చూడాలి అని ఉందని చిన్ని అంటుంది. అది జరగదు అని రాజు అంటాడు. నాన్న నువ్వు అమ్మ ఫ్రెండ్లీగా ఉన్నట్లు కల వచ్చింది నువ్వు అమ్మతో ఫ్రెండ్లీగా ఉండటానికి ప్రయత్నించు అని చెప్పి బాలని పంపుతుంది.
రాజుతో కావేరి స్నేహం చేస్తుందా..
రాజు ఉష దగ్గరకి వెళ్లి సారీ చెప్పి తనతో స్నేహం చేయమని ఉషకి చేయి అందిస్తాడు. ఉష పొట్లకాయ తీసి రాజుని తిడుతుంది. తర్వాత చిన్నీని తీసుకొని వెళ్లిపోతుంది. రాత్రి చిన్ని రాజు దగ్గరకు వెళ్తుంది. అమ్మతో స్నేహం చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉండు అంటుంది. ఫ్రెండ్‌షిప్ అంటే ముఖం పచ్చడి చేస్తా అనిందని అంటాడు. కొట్టదులే నాన్న అని చిన్ని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: తండ్రి కాలర్ పట్టుకున్న కార్తీక్.. శ్రీధర్ చెప్పిన నిజం దీప మాయం!





















