Karthika Deepam 2 Serial Today April 3rd: కార్తీకదీపం 2 సీరియల్: తండ్రి కాలర్ పట్టుకున్న కార్తీక్.. శ్రీధర్ చెప్పిన నిజం దీప మాయం!
Karthika Deepam 2 Serial Today Episode శ్రీధర్ కార్తీక్, కాంచనలతో విషయం చెప్పడం దీప తల దించుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పనీ ఆట లేని వాళ్లు అంతా మా ఇంటికి వస్తున్నారని కార్తీక్ అంటాడు. కాంచన శ్రీధర్‌తో మతి లేని వాళ్లు ఊరు మీద పడి తిరుగుతున్నారని అంటుంది. నేను చెప్పేది వింటే ఎవరు ఊరు మీద పడి తిరుగుతున్నారో అర్థమవుతుంది అని అంటాడు. హోళీ రోజు రంగులు పట్టుకొని మీద పడకూడదు అనుకుంటే ఎలా ఉంటుందో దీప లాంటి పెళ్లాం పక్కన ఉంటే అలాగే ఉంటుందని శ్రీధర్ అనగానే కార్తీక్ తండ్రి కాలర్ పట్టుకుంటాడు.
నీ పెళ్లాన్ని లాగిపెట్టి కొట్టు..
కాలర్ పట్టుకున్నావ్ ఏంట్రా కొట్టు అని శ్రీధర్ అంటే నాకు సంస్కారం ఉందని కార్తీక్ అంటాడు. నీకు నిజంగా సంస్కారం ఉంటే నీ పరువు బజారుకి ఈడుస్తున్న నీ పెళ్లాన్నిలాగిపెట్టి కొట్టు అని అంటాడు. నీ పెళ్లాం తాత ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకొని వచ్చిందని వాళ్లు కొట్టడం ఒక్కటే తక్కువ మర్యాదగా గెంటేశారని శ్రీధర్ అంటాడు. మణికొండలోని రోడ్లన్నీ మీ కోడలివే తెగ తిరుగుతుందని అంటాడు. దీప ఈయన చెప్పేది నిజమేనా అని అడుగుతాడు.
ఉత్తమ భార్య ఏం చేసిందో తెలుసా..
కార్తీక్ దీప మీద మాట పడనివ్వకపోవడంతో మిస్టర్ ఉత్తమ భర్త గారు మీ ఉత్తమ భార్య ఏం చేసిందో తెలుసా అని రమ్యని తీసుకెళ్లడం సత్తిపండు రావడం మొత్తం చెప్తాడు. రమ్యకి డబ్బులిచ్చి అబద్ధం చెప్పించిందని శ్రీధర్ అంటాడు. మీ నాన్న, మీ వదిన, మీ పిన్ని దీపని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారని మరోసారి ఇలాంటివి చేయొద్దని పంపేశారని అంటాడు. దీప ఏడుస్తుంది. కార్తీక్ ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు. సత్తిపండు భార్య రమ్య అయితే నువ్వు గౌతమ్ మీద వేసిన నింద అబద్ధం కదా.. తప్పు దీప ఇలాంటి పాపపు పనులు చేస్తే ఉసురు తగులుతుంది కదా అంటాడు. అతను ఇన్ని అంటే ఏం చెప్పడం లేదు ఏంటి అని కార్తీక్ అంటే అన్నీ నిజాలే కదా ఏం మాట్లాడుతుందని అంటాడు. నీ కోడల్ని రోడ్లు పట్టుకొని తిరగొద్దని చెప్పు అని అంటాడు.
రెండు కుటుంబాలు కలవకూడదన్న కాంచన..
దీప ఏడుస్తూ వెళ్లిపోతుంది. తన తప్పు లేదని నిరూపించుకోవాలని అనుకుంది మళ్లీ ఏదో తప్పు జరిగిందని కార్తీక్ అంటాడు. రెండు కుటుంబాలు ఎప్పుడు కలుస్తాయా అనుకున్నా ఇప్పుడు మాత్రం రెండు కుటుంబాలు ప్రశాంతంగా ఉంటే చాలు అని కాంచన అనుకుంటుంది. వీటన్నింటికి ఆపడానికి ఎవరు వస్తారు అనుకొని ఏడుస్తుంది. రాత్రి కార్తీక్ బ్యాగ్ తీసుకొని వస్తాడు. దీప కోసం ఇళ్లంతా వెతుకుతాడు ఎక్కడా కనిపించదు.. కార్తీక్ పక్కింటి ఆవిడకు దీప గురించి అడిగితే సాయంత్రం కనిపించింది తర్వాత మరి కనిపించలేదని అంటుంది.
దీప ఎక్కడికీ వెళ్లిపోలేదు కదా..
దీప కోసం మొత్తం వెతికిన కార్తీక్ దీప ఎక్కడికీ వెళ్లిపోలేదు కదా అనుకుంటాడు. దీప బయట ఓ చోట కూర్చొని ఉంటుంది. కార్తీక్ అక్కడికి వెళ్లి ఒంటరిగా కూర్చొని ఏడిస్తే బాధలు పోతాయా అంటాడు. నాకేం అడగరా అని అంటుంది. నిరూపించుకోవాలని ప్రయత్నించుంటావని అంటాడు. గౌతమ్‌కి తన తండ్రి సాయం చేస్తుంటాడేమో అని అంటాడు. కానీ దీప కాదు అంటుంది. నాకు చెప్పుంటే నేను సాయం చేసేవాడిని కదా అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: అనంత్ పక్కనే గాయత్రీ.. ఊర్వశి దొరికిపోతుందా.. కంకణం కట్టించుకునేదెవరు?





















