Brahmamudi Serial Today November 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజ్‌ను తిట్టిన కావ్య – అప్పుకు భరోసా ఇచ్చిన రాజ్
Brahmamudi serial today episode November 28th: అప్పును మళ్లీ డ్యూటీలో జాయిన్ అవ్వమని రాజ్ చెప్పడంతో కావ్య రాజ్‌ను తిడుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: ఇంట్లో వాళ్లందరూ టిఫిన్ దగ్గర కూర్చున్నప్పుడు తాను మళ్లీ ఆఫీసుకు వెళ్తానని చెప్పమని కళ్యాణ్ కు సైగ చేస్తుంది అప్పు. అది గమనిస్తుంది ధాన్యలక్ష్మీ..
ధాన్యం: ఏంట్రా ఏంటో గుసగుసలాడుతున్నారు.
కళ్యాణ్: అబ్బే ఏం లేదమ్మా అప్పును ఉప్మాతో పాటు ఇడ్లీలు కూడా వేసుకోమంటున్నాను మెత్తగా ఉంటాయి కదా అదే చెప్తున్నాను
ఇందిరాదేవి: అవును పాపం ఇన్నాళ్లకు నువ్వు చెప్తే కానీ తెలియదు.. ఇడ్లీ మెత్తగా ఉంటాయి. గారె గట్టిగా ఉంటుందని
అపర్ణ: పోనీలే అత్తయ్యా ఏదో పెళ్లానికి త్వరగా డైజెస్ట్ కావడానికి ఇడ్లీ సజెస్ట్ చేసినట్టు ఉన్నాడు వాడు
ఇందిరాదేవి: అవును చూస్తూనే ఉన్నాను.. పెళ్లాలకు కడుపులు వచ్చినప్పటి నుంచి పెళ్లాల చుట్టు పొర్లు దండాలు పెడుతున్నారు.. కానీ ఈ నాన్నమ్మను మాత్రం అసలు పట్టించుకోవడమే మర్చిపోయారు
రాజ్: ఇప్పుడు నీకేం అయింది నాన్నమ్మ
ఇందిరాదేవి: అరే ఎంత సేపు నువ్వేమో పెళ్లామా నువ్వు ఈ జ్యూస్ తాగు.. పెళ్లామా ఈ ఫ్రూట్స్ తిను అంటావు. వాడేమో పెళ్లామా ఇడ్లీ వేసుకో.. పెళ్లామా సాంబారు పోసుకో అంటాడు.. కానీ నాన్నమ్మ ఈ స్వీట్స్ తిను.. నాన్నమ్మ ఈ జ్యూస్ తాగు అని ఎప్పుడైనా అన్నావా..?
రాజ్: నీకు ఒంటి నిండా షుగరు ఫ్యాక్టరీ ఉంది.. మళ్లీ ఈ స్వీట్స్ గోల ఏంటి నాన్నమ్మ నీకు
సుభాష్: రాహుల్‌కు ఇక నువ్వు ఈ రోజు నుంచి కొత్త కంపెనీ చూసుకో
రుద్రాణి: నా కొడుకు ఎప్పుడు కొత్త కంపెనీ గురించే ఆలోచిస్తున్నాడు.. ఎప్పుడు ఆఫీసుకు వెళ్లాలి.. ఎలా డెవలప్ చేయాలి.. అని ఆలోచిస్తున్నాడు.. తిండి కూడా మానేశాడు అన్నయ్య
ఇందిరాదేవి: అవును తినడమే మానేవాడు. ఇప్పుడు నీ కొడుకు చేతిలో ఉన్న దోశ నాలుగోది
సుభాష్: రాహుల్ ఇక నుంచి నువ్వు స్వరాజ్ కంపెనీకి రావాల్సిన పని లేదు.. కొత్త కంపెనీకే వెళ్లు
రాహుల్: ఈరోజు నుంచే వెళ్తాను మామయ్య
సుభాష్: రాజ్, రాహుల్ ఇక కంపెనీకి రాడు కాబట్టి మన కంపెనీ పనులు నువ్వు చూసుకుంటేనే మంచిది
రాజ్: తప్పకుండా డాడీ నేనే కాదు ఇక నుంచి కళావతి కూడా ఆఫీసుకు వస్తుంది. ఇద్దరం కలిసి ఆఫీసుకు వెళ్తాం
అపర్ణ: అదేంట్రా..? కావ్య ఆఫీసుకు రావడం ఏంటి..? ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుంది
రాజ్: నేను అదే చెప్పాను కానీ తనే వినడం లేదు.. ఇంట్లో బోర్ కొడుతుందట
ఇందిరాదేవి: నిన్నటి దాకా బకెట్ లిస్ట్ తీర్చావు కదా..? ఇప్పుడు ఇంకేదైనా లిస్ట్ తీసుకో అది తీర్చే పనిలో పడు బోరు కొట్టదు
కళ్యాణ్: అదేంటి నాన్నమ్మ అలా మాట్లాడతావు అన్నయ్య వదిన చెప్పింది కరెక్టే
అంటూ ఇవాళ్టీ నుంచి తాను అప్పు కూడా బయటకు వెళ్తామని చెప్తాడు. దీంతో ధాన్యలక్ష్మీ వద్దని చెప్తుంది. సరే అంటాడు కళ్యాణ్. అప్పు కోపంగా గార్డెన్‌లో కూర్చుని ఉండగా కళ్యాణ్ వెళ్తాడు. వెనకే కావ్య వెళ్తుంది. ఏమైందని అడుగుతుంది. దీంతో స్టేషన్‌లో పాప తప్పిపోయిందని ఆ పాపను వెతికేందుకైనా తాను మళ్లీ డ్యూటీలో జాయిన్ కావాలని అప్పు చెప్తుంది. వద్దని కావ్య చెప్తుంది. రాజ్ వచ్చి మీ వెనక నేనున్నాను అప్పు వెంటనే జాయిన్ అయి ఆ పాపను వెతికి ఆ తల్లి బాధను తీర్చు.. అని చెప్తాడు. అప్పు సరే అంటుంది. తర్వాత కావ్య, రాజ్‌ను తిడుతుంది. ఇక రాజ్, కావ్య ఆఫీసుకు వెళ్తుంటే.. అందరూ జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు. వారి వెనకాలే కళ్యాణ్, అప్పు గుడికి వెళ్తున్నామని చెప్పి వెళ్లబోతుంటే.. ధాన్యలక్ష్మీ ఆపేస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















