Brahmamudi Serial Today November 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాహుల్ ను అనుమానించి సుభాష్ - పూర్తి నమ్మకంతో ఉన్నామన్న రాజ్, కావ్య
Brahmamudi serial today episode November 27th: రాహుల్‌ను నమ్మి పది కోట్లు ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా అంటూ సుభాష్, అపర్ణ, రాజ్‌ను అడగడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Brahmamudi Serial Today Episode: రాజ్, కావ్య బయటకు వెళ్లారని తెలిసి అప్పు కూడా తనను బయటకు తీసుకెళ్లమని కళ్యాణ్‌ను అడుగుతుంది. సరే అంటూ కళ్యాణ్ అప్పును తీసుకుని బయటకు వెళ్తాడు. ఇద్దరూ కారులో వెళ్తుంటారు.
కళ్యాణ్: పొట్టి ఇంత రాత్రి పూట నన్ను బయటకు ఎందుకు తీసుకొచ్చావు
అప్పు: అలా అలా ప్రపంచం చూద్దామని తీసుకొచ్చాను
కళ్యాణ్: నువ్వు నాకు ప్రపంచం చూపించినట్టు లేదు నరకం చూపించినట్టు ఉంది
అప్పు: పర్వాలేదు ఇంకాస్త దూరమే
కళ్యాణ్: ఏంటి నరకమా
అప్పు: ఓహో నాతో తిరగడం అంత కష్టంగా ఉందా..? పెళ్లికి ముందు నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి బైక్ వేసుకుని వచ్చేదాన్ని కదా అప్పుడే మర్చిపోయావా..?
కళ్యాణ్: వద్దు ఇంక ఆపు పొట్టి ఇంతకీ నీ మనసులో ఏముంది చెప్పు
అప్పు: నాకు బాగా ఐస్‌క్రీమ్ తినాలని ఉంది
కళ్యాణ్: అయ్యో ఐస్‌క్రీమ్ అయితే వద్దు మొన్నే ఐస్‌క్రీమ్ తింటే పొద్దున్నే జలుబు చేసింది. అది చూసి మా అమ్మ నన్ను తిట్టింది
అప్పు: అయితే నాకు ఇష్టమైన ఐస్‌క్రీమ్ తినిపించవా..?
కళ్యాణ్: నీకు ఐస్ క్రీమ్ తినిపిస్తానులే.. కానీ కొంచెం మాత్రమే తినిపిస్తాను
అని చెప్పగానే.. రోడ్డు పక్కనే ఐస్ క్రీమ్ బండి కనిపిస్తుంది ఇద్దరూ అక్కడికి వెళ్తారు. అప్పు ఐస్‌క్రీమ్ తీసుకుని తింటంటే పక్కనే తను పని చేసిన పోలీస్ స్టేషన్ కనిపిస్తుంది. అప్పు సరదాగా లోపలికి వెళ్లి వస్తాను అంటూ వెళ్తుంది. స్టేషన్ బయట రేణుక అనే ఆవిడ ఏడుస్తూ ఉంటుంది. విషయం తెలుసుకుని అప్పు ఎమోషనల్ అవుతుంది. తప్పిపోయిన రేణుకు బిడ్డను వెతకమని సీఐతో చెప్తుంది. సీఐ అప్పును తిట్టగానే అప్పు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు రాహుల్ గురించి అపర్ణ, సుభాష్, రాజ్ తో మాట్లాడుతుంటారు.
సుభాష్: రాహుల్ మీద మాకు నమ్మకం లేదు.. ఏ నమ్మకంతో పది కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నావు..
అపర్ణ: రాజ్ మీరు ఇద్దరు రాహుల్ విషయంలో ఎందుకు రిస్క్ తీసుకున్నారు.
రాజ్: మేము అన్ని విషయాలు అబ్జర్వ్ చేశాము మమ్మీ.. రాహుల్ మన కింద పని చేయడం వల్లే అలా తప్పులు చేశాడని మాకు అర్థం అయింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం
సుభాష్: ఒకవేళ రాహుల్ వల్ల కంపెనీ నష్టపోతే ఏం చేయాలి..?
కావ్య: ఒక సంవత్సరం ఆదాయం పోయింది అనుకుందాం మామయ్య
అపర్ణ: ఇంత రిస్క్ తీసుకుని రాహుల్‌ను మార్చాలని ఎందుకు అనుకుంటున్నారు మీరు
కావ్య: సమన్యాయం కోసం అత్తయ్య నాకు అప్పుకు ఈ ఇంట్లో ఇచ్చిన విలువ మా అక్కకు రావాలి
కావ్య: అవును డాడీ కళావతి చెప్పింది నిజమే.. పోతే ఓ పది కోట్లు పోతాయి
అపర్ణ: సరేలేరా రాహుల్, రుద్రాణి మారుతారు అనుకుంటే మాకూ సంతోషమే
అంటూ వెళ్లిపోతారు. మరోవైపు స్టేషన్‌లో జరిగిన విషయం గుర్తు చేసుకుని అప్పు బాధపడుతుంది. తాను మళ్లీ డ్యూటీలో జాయిన్ అయి ఆ పాపను రక్షిస్తానని చెప్తుంది. కళ్యాణ్ ఇంట్లో వాళ్లు ఒప్పుకుంటారా అని చెప్పగానే.. ఏదేమైనా తాను డ్యూటీలో జాయిన్ అవుతానని అప్పు చెప్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















