Brahmamudi Serial Today November 18th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ధాన్యలక్ష్మీని ఓదార్చిన అపర్ణ – అపర్ణ మాటలు పట్టించుకుంటే కళ్యాణ్ కే నష్టం అన్న రుద్రాణి
Brahmamudi Today Episode: అపర్ణ ఓదార్చినా.. రుద్రాణి మాటలతో ధాన్యలక్ష్మీ చేష్టలు మరింత పెరిగిపోవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: కావ్య గదిలో డిజైన్స్ వేస్తుంది. బయట కూర్చున్న మూర్తి ఏదో రిపేర్ చేస్తుంటే చిన్న టెస్టర్ కింద పడిపోతుంది. వెంటనే కనకం పరుగెత్తుకొచ్చి అసలు మీకు బుద్ది ఉందా..? అని ప్రశ్నిస్తుంది. లోపల కావ్య కోట్ల విలువ చేసే డిజైన్స్ వేస్తుంది అని చెప్తుంది. డిజైన్స్ వేయడం అంటే మట్టి కుండల మీద రంగులు వేయడం అనుకుంటున్నారా.? అని ప్రశ్నిస్తుంది. మూర్తి షాక్ అయి చూస్తుంటాడు. కావ్య గదిలోకి భోజనం తీసుకుని కనకం పిల్లి నడుస్తున్నట్టు మెల్లగా వెళ్తుంది.
కావ్య: ఏంటమ్మా.. గదిలోకి తీసుకొచ్చావు. నేను మీతో పాటు కలిసి తినేదాన్ని కదా..?
కనకం: నువ్వు మాతో కూర్చుంటే ముచ్చట్లు ఎక్కువైపోతాయి. పనిమీద ధ్యాస తగ్గిపోతుంది. నీకు వేరే ఆలోచన రాకూడదు. అర్తమైందా..?
కావ్య: బాగా అర్తమైంది. నన్ను త్వరగా అత్తారింటికి పంపించాలని చూస్తున్నావు అని.
కనకం: ఎంత మాట అన్నావే ఈ తల్లిని నువ్వు అర్థం చేసుకుంది ఇదేనా.?
అంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్తుంటే.. కావ్య అమ్మా మహానటి చాలు ఇక ఆపేప్ అంటూ తిడుతుంది. మరోవైపు రాజ్ కూడా డిజైన్స్ గురించే ఆలోచిస్తుంటాడు. స్టాఫ్ ఎవ్వరూ మంచి డిజైన్స్ వేయలేదని తిడుతుంటాడు. ఇంతలో ఆఫీసులో కావ్య కింద పడిపోతుంటే పట్టుకున్న విషయం గుర్తు చేసుకుంటాడు. ఇంతలో రాజ్ ఆత్మ వస్తుంది. కనీసం ఇమాజినేషన్ లో నైనా నీ పెళ్లాన్ని రానివ్వవేంట్రా అని తిడుతుంది. నా మాట విని ఓడిపో అంటుంది. చచ్చినా ఓడిపోను అంటాడు రాజ్. అయితే కళావతిని గెలిపించు అనగానే సరే అంటాడు. తర్వాత తేరుకుని కళావతి గెలిస్తే నన్ను చచ్చేదాకా మేనేజర్ గా చూస్తారు అని ఆత్మను తిట్టి పంపిస్తాడు. మరోవైపు ధాన్యలక్ష్మీ ఆలోచిస్తూ బయట కూర్చుంటే అపర్ణ వెళ్తుంది.
అపర్ణ: నీకు మా అందరి మీద కోపంగా ఉందని. ఇప్పుడు నేను ఏం చెప్పినా సరే నువ్వు అర్తం చేసుకునే పరిస్థితిలో కూడా లేవని.
ధాన్యలక్ష్మీ: అర్తమైంది కదా.. అక్కా మరి ఇంకా ఎందుకు మాట్లాడటం.
అపర్ణ: తోడబుట్టక పోయినా ఇన్ని రోజులు మనం అక్కా చెల్లెలు లాగానే ఉన్నాం కదా..? నువ్వు తిండి మానేస్తే నాకు బాధగా ఉండదా..?
ధాన్యలక్ష్మీ: నువ్వు బాధపడితే నా బాధ తీరదు అక్కా. నా సమస్యను పరిష్కరిస్తే తీరుతుంది.
అపర్ణ: కొంత కాలం తర్వాత అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నా మాట విను ఇలా బాధపడటం మానేసి ప్రశాంతంగా ఉండు.
ధాన్యలక్ష్మీ: నువ్వు ఎన్నైనా చెప్తావు అక్కా.. మామయ్య పెట్టిన పందెంల రాజ్ గెలిస్తే కంపెనీకి సీఈవో అవుతాడు. నీ కోడలు గెలిస్తే తిరిగి ఈ ఇంటికి వస్తుంది. కానీ దీని వల్ల నాకు వచ్చిన లాభమేంటి..? నా కొడుక్కి జరిగే న్యాయం ఏంటి.
అపర్ణ: రాజ్, కావ్య ఇద్దరు ఒకటైతే కళ్యాణ్‌ను తీసుకురారని ఎందుకు అనుకుంటున్నావు.
అంటూ ఇద్దరూ మాట్లాడుకోవడం దూరం నుంచి వింటున్న రుద్రాణి షాక్ అవుతుంది. మా వదిన రుద్రాణి మనసు మార్చేలా ఉందని అనుకుంటుంది. అపర్ణ వెళ్లిపోయాక రుద్రాణి, ధాన్యలక్ష్మీ దగ్గరకు వెళ్తుంది. అపర్ణ వదిన చెప్పిన మాటలు నమ్మేశావే ఏంటి..? అలా నమ్మావంటే నువ్వు మరిన్ని కష్టాల్లో పడిపోతావు అంటూ లేని పోని మాటలు నూరిపోస్తుంది. ధాన్యలక్ష్మీని మరింత రెచ్చగొడుతుంది. ఆఫీసుకు వెళ్లిన రాజ్ ఎంప్లాయూస్ ను తిడతాడు. డిజైన్స్ సరిగ్గా వేయలేదని డిస్టర్బ్ అవుతాడు. దేవుడి నగలు డిజైన్స్ చేస్తున్నాం కాబట్టి పూర్తిగా పాత కాలం నాటికి వెళ్లి డిజైన్స్ వేద్దాం అని తన ఐడియాలు చెప్తాను నువ్వు డిజైన్స్ వేయి అని చెప్తాడు. సరేనని ఎంప్లాయి డిజైన్స్ వేస్తాడు. ఆ డిజైన్స్ చూసి రాజ్ షాక్ అవుతాడు. ఇక తాను పందెంలో గెలవాలంటే కావ్య వేసిన డిజైన్స్ ను కొట్టేయాలనుకుంటాడు రాజ్. మరోవైపు ఇంట్లో ధాన్యలక్ష్మీ తన కోసం వంట చేసుకుంటుంది. ఇందిరాదేవి, అపర్ణ వచ్చి ఎంత చెప్పినా వినదు. మరోవైపు రాజ్ ఆఫీసు నుంచి కావ్య వెళ్లిపోయిందేమోనని చూస్తాడు. తను వెళ్లగానే డిజైన్స్ కొట్టేయాలనుకుంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!