Brahmamudi Serial Today November 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇంట్లో కుంపటి రగిలేలా చూడమన్న అనామిక – ఆఫీసులో రాజ్, కావ్య మధ్య గొడవ
Brahmamudi Today Episode: ఆస్థి కోసం ఇంట్లో రగులుతున్న కుంపటి ఆరిపోకుండా చూడమని రుద్రాణికి అనామిక చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: కళ్యాణ్ బయట ఆలోచిస్తూ ఉంటే అప్పు వచ్చి ఇక్కడున్నావా..? లోపల వెతుకుతున్నాను అంటూ అడగ్గానే ఎందుకు రాత్రి తిట్టింది సరిపోలేదా..? ఇంకా ఏమైనా బాలెన్స్ ఉందా..? అంటే అదేం లేదని నీకో గుడ్ న్యూస్ అంటూ మీ వదిన గారు తిరిగి మీ ఇంట్లోకి అడుగుపెట్టబోతుంది. అని చెప్పగానే కళ్యాణ్ హ్యాపీగా పీలవుతాడు. దీంతో అప్పు తాతయ్య పెట్టిన పందెం గురించి చెప్తుంది. పందెంలో మా వదినే గెలుస్తుంది అంటాడు కళ్యాణ్. మరోవైపు కనకానికి ఇందిరదేవి ఫోన్ చేసి పందెం విషయం చెప్తుంది. కనకం హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో కావ్య వస్తుంది.
కనకం: ఏంటి కావ్య పెద్దాయన పందెం కట్టారట. నువ్వు తిరిగి అత్తారింట్లో కాలు పెట్టబోతున్నావట.
కావ్య: అప్పుడే నీ వరకు వచ్చేసిందా..?
కనకం: ఇలాంటి రోజు కోసమే నేను ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాను తెలుసా.? రేపు ఉదయం గుడికి వెళ్లి ఆ దేవుడికి వంద కొబ్బరికాయలు కొడతాను.
కావ్య: అమ్మా.. నీ హడావిడిని కాసేపు ఆపుతావా..?
కనకం: కూతురు కాపురానికి వెళ్తుంది అంటే తల్లికి ఆ మాత్రం సంతోషం ఉండదా..?
కావ్య: అలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఇంకా నేను పందెంలో గెలవలేదు
కనకం: నీ గురించి నాకు తెలుసే నువ్వు ఏదైనా అనుకుంటే సాధించే వరకు వదిలిపెట్టవు.
కావ్య: కానీ పోటీ పడుతుంది మీ అల్లుడు గారితో
కనకం: న్యాయం నీ వైపు ఉన్నప్పుడు దేవుడితో పోటీ అయినా పడవచ్చు.
అని చెప్పగానే కావ్య వెటకారంగా కనకాన్న తిడుతుంది. నువ్వు ఏమైనా మాట్లాడు కానీ పందెంలో మాత్రం గెలవాలి. నీకేం కావాలో చెప్పు. అన్ని నీకు గదిలోకే తీసుకొస్తాను. అని కనకం చెప్తుంది. ఇంతలో కావ్య నీ డిజైన్స్ కూడా నువ్వే వేసిపెడతావా..? అంటే ఫ్లో లో వేస్తాను అంటూ.. ఆగిపోయి అదొక్కటి తప్ప ఏదైనా చేస్తాను అంటుంది. మరోవైపు రుద్రాని, అనామికకు ఫోన్ చేస్తుంది.
అనామిక: హాయ్ ఆంటీ నీ వాటా ఆస్థి నీకు వస్తే ఏం చేయాలని ఆలోచిస్తున్నారా…?
రుద్రాణి: నువ్వు దూరంగా ఉండి నీ ప్లాన్స్ అన్న సక్సెస్ అవుతున్నాయని బాగానే కల కంటున్నావు. కానీ ఇక్కడ నాకు ఆస్థి కాదు కదా ఆవగింజ కూడా దొరకడం లేదు.
అనామిక: ఏమైంది అంటీ ఏందుకు ఇలా మాట్లాడుతున్నారు.
రుద్రాణి: ఇంటిని విడగొట్టాలని మనం చూస్తే ఆ ముసలోడు మనల్ని దెబ్బకొట్టి ఆ రాజ్, కావ్య ఇద్దరిని కలపాలని చూస్తున్నాడు.
అనామిక: అసలు ఏం జరిగింది ఆంటీ..?
అని అనామిక అడగ్గానే ఇంట్లో సీతారామయ్య పెట్టిన పందెం గురించి చెప్తుంది. దీంతో ఈ పందెంలో ఎవరు గెలిచినా మనకే ప్లాబ్లమ్ కదా..? అసలు ఆ డీల్ వాళ్లకు కాకుండా మాకు ఇచ్చేలా చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. రుద్రాణి, ధాన్యలక్ష్మీ దగ్గరకు వెళ్లి మళ్లీ రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. నిన్ను చూస్తుంటే నాకు బాధగా ఉంది ధాన్యలక్ష్మీఅంటుంది. అసలే నేను చిరాకుగా ఉన్నాను ఇక్కడి నుంఇ వెళ్లిపో అన్నా వినకుండా ధాన్యలక్ష్మీని తన మాటలతో రెచ్చగొడుతుంది. రాజ్ ఆఫీసుకు వెళ్తుంటే ఎవ్వరూ కూడా విష్ చేయరు. దీంతో రాజ్ ఇరిటేటింగ్‌గా నన్ను ఎవ్వరూ విష్ చేయట్లేదేంటని అడుగుతాడు. అందరూ వెటకారంగా మాట్లాడుతుంటారు.
రుద్రాణి: ఎక్కడ ఎన్నడూ చూడని వింత జరగుతుంది ఈ ఇంట్లో. ఒరేయ్ నాన్న రాజ్ నా బ్లెసింగ్స్ నీకేరా…?
రాజ్: థాంక్స్ అత్తా నువ్వైనా నావైపు ఉన్నావు.
రుద్రాణి : రాజ్ వెళ్తూ వెళ్తూ ఒక పాల ప్యాకెట్ తీసుకుని వెళ్లరా..?
రాజ్: పాల ప్యాకెట్టా.. ఎందుకు అత్త..
రుద్రాణి: పుట్టలాంటి మీ అత్తగారింట్లో పాలు పోసి వెళ్లరా..? ఆ పాములు అప్పుడైనా కాటు వేయకుండా ఉంటాయి.
స్వప్న: రాజ్ పుట్ట అక్కడే ఉంది కానీ పాము ఇక్కడే ఉంది.
అపర్ణ: కరెక్టుగా చెప్పావు స్వప్న..
రాజ్: మీరు ఎవరు ఏమి అనుకున్నా నేను మాత్రం గెలవాలనే ప్రయత్నిస్తాను. తాతయ్య నన్ను దీవించండి.
సీతారామయ్య: ధర్మం గెలవాలిరా..?
అని తాతయ్య దీవించగానే రాజ్ భీష్ముడిలా దీవించారు తాతయ్యా అంటూ ఆఫీసుకు వెళ్లిపోతాడు. ఆఫీసుకు వచ్చిన రాజ్‌ను చూసి శృతి ఈయనేంటి యుద్దానికి వస్తున్నాడా..? డిజైన్స్ వేయడానికి వస్తున్నాడా..? అని మనసులో అనుకుంటుంది. దగ్గరకు వచ్చిన రాజ్ యుద్దం చేయడానికే వచ్చాను అని చెప్పగానే శృతి షాక్ అవుతుంది. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!