Brahmamudi Serial Today November 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్: పెళ్లాల కోసం కవితలు రాసిన ప్రకాష్, సుభాష్, రాజ్ - మాట మార్చిన రాహుల్
Brahmamudi serial today episode November 13th: తమ కోసం లవ్ లెటర్స్ రాయమని తమ పెళ్లాలు అడగడంతో రాజ్, సుభాష్, ప్రకాష్ లవ్ లెటర్స్ రాయడానికి తంటాలు పడుతుంటారు.

Brahmamudi Serial Today Episode: ఇరవై లక్షల డీల్ ఒప్పుకోవడం లేదని రాహుల్‌ను రుద్రాణి తిడుతుంటే.. అప్పుడే స్వప్న వస్తుంది. కొడుకు మారుతుంటే మళ్లీ తప్పుడు మార్గంలో నడవమంటావా..? అంటూ రుద్రాణిని తిడుతుంది స్వప్న
రుద్రాణి: నాకే వార్నింగ్ ఇస్తున్నావా..?
స్వప్న: వార్నింగ్ కాదు నిజమే చెప్తున్నాను.. మీ అబ్బాయిని మళ్లీ చెడగొట్టాలని చూస్తే మీ దారికి నేను అడ్డు రావాల్సి ఉంటుంది. తెలుసుగా నేను అడ్డొస్తే.. బుల్డోజర్ లా తొక్కుకుంటూ వెళ్లడం మాత్రమే నాకు తెలుసు.. నువ్వు రా రాహుల్
రాహుల్: వస్తాను పద
అని చెప్పగానే స్వప్న వెళ్లిపోతుంది.
రాహుల్: నా పర్మామెన్స్ ఎలా ఉంది మమ్మీ
రుద్రాణి: ఫర్మామెన్సా..? అంటే ఇప్పటి వరకు నువ్వు చేసిందంతా
రాహుల్: యాక్టింగ్ మమ్మీ నా పెళ్లాన్ని నా దారిలోకి తెచ్చుకోవడానికి చేసిన యాక్టింగ్
రుద్రాణి: నువ్వు వాళ్ల మాటలకు కరిగిపోయి మారిపోయావని భయపడిపోయాను కదరా..? ఇంత పెద్ద ట్విస్ట్ ఇస్తావని నేను అనుకోలేదు
రాహుల్: నేను నీ రక్తాన్ని మమ్మీ నన్ను కోర్టులో శిక్ష పడకుండా కాపాడినట్టు నటించి వాళ్ల కాళ్ల దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్న రాజ్ మాటలను ఎలా నమ్ముతాను అనుకున్నావు..
రుద్రాణి: హమ్మయ్య నువ్వు ఇంకా నా దారిలోనే ఉన్నావన్నమాట. అది సరే కానీ మరి ఈ యాక్టింగ్ అంతా ఎందుకు చేస్తున్నావు
రాహుల్: స్వప్న నీతో ఎలా మాట్లాడుతుందో చూశావు కదా..? తనకు ఎదురు వెళ్లడం కంటే తన దారికి మనం వెళ్లినట్టు నటించి తనను మన దారికి తెచ్చుకుంటే మంచిది మమ్మీ. ఇప్పుడు చూడు నన్ను అప్పుడే ఎంతలా సపోర్ట్ చేయడం మొదలు పెట్టిందో.. ఇక నుంచి నేనేం చేయాల్సిన అవసరం లేదు. తనే నా గురించి ఆలోచిస్తుంది. ఏదో ఒకటి చేసి నాకు అవకాశం ఇప్పించాలని ప్రయత్నిస్తుంది. ఒక్క అవకాశం మమ్మీ ఒకే ఒక్క అవకాశం దొరికితే చాలు సూర్యుడిని రాహువు మింగినట్టు ఈ కుటుంబాన్ని ఈ రాహుల్ మింగేస్తాడు..
రుద్రాణి: ఇప్పుడు నాకు నమ్మకం వచ్చిందిరా.. నీ దారిలో నువ్వు చేసేది చేయ్… నేను చేసేది నేను చేస్తాను.. త్వరలోనే నిన్ను ఈ సామ్రాజ్యానికి రాజును చేస్తాను
అని చెప్పి వెళ్లిపోతుంది రుద్రాణి. రాజ్, శృతికి ఫోన్ చేసి బిజినెస్ గురించి మాట్లాడుతుంటాడు. ఇంతలో రాజ్ దగ్గరకు కావ్య వస్తుంది. రాజ్ ను కోపంగా చూస్తుంది. రాజ్ కాల్ కట్ చేస్తాడు.
రాజ్: ఏంటి అలా తినేసేలా చూస్తున్నావు..?
కావ్య: కోపంగా అవును మరి పండగ పూట చేసిన పాయసం మీరు ఎలా తినాలా అని చూస్తున్న
రాజ్: కారణం లేకుండా అలగడం మీ ఆడవాళ్ల జన్మహక్కు
కావ్య: దెప్పిపొడవడం మీ మగవాళ్ల జన్మహక్కా
రాజ్: అందులో కూడా మీరే పీహెచ్‌డీ చేశారు కానీ ఇంతకీ మ్యాటర్ ఏంటి చెప్పు
కావ్య: నాకు మీరు ఇచ్చిన మాటేంటి..? మీరు చేస్తున్న పనేంటి..?
రాజ్: ఓసేయ్ రాత్రి నీ కోసమే కదే చికెన్ చేశాను
కావ్య: నాలుగు చికెన్ ముక్కలు చేస్తే సరిపోతుందా..?
అంటూ కావ్య అడగ్గానే మరేం చేయాలో చెప్పు అంటూ రాజ్ అడుగుతాడు. నా లిస్టులో ఉన్నట్టు నాకు మీరు ప్రేమలేఖ రాయాలి అని చెప్తుంది. సరే అంటూ రాజ్ పెన్ను పేపర్ తీసుకుని గార్డెన్‌లోకి వెళ్తాడు. అక్కడ ప్రకాష్, సుభాష్ కూడా లవ్ లెటర్ రాసే పనిలో ఉంటారు. వాళ్లను చూసిన రాజ్ షాక్ అవుతాడు. మీరేంటి ఇక్కడ అని అడగ్గానే.. నువ్వేం చేస్తే మేము అది చేయాలని మా భార్యలు పట్టుబడుతున్నారురా అని చెప్తారు. ముగ్గురు కలిసి అతి కష్టంగా లవ్ లెటర్స్ రాస్తారు. ఆ లెటర్స్ చదివిన అపర్ణ, ధాన్యలక్ష్మీ, కావ్య నవ్వుకుంటారు. ఇవి ప్రేమలేఖలా అంటూ తిడతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















