అన్వేషించండి

Brahmamudi Serial Today November 13th:  ‘బ్రహ్మముడి’ సీరియల్:     రాజ్‌, కావ్య మధ్య మరో చాలెంజ్‌ - తాను గెలిస్తే కావ్య ముఖం జీవితంతో చూడనన్న రాజ్‌

Brahmamudi Today Episode:  రాజ్‌, కావ్య మధ్య పందెం పెడతాడు సీతారామయ్య. గెలిచిన వారికే సీఈవో సీటు అనడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Brahmamudi Serial Today Episode:   ఆఫీసుకు వచ్చిన సీతారామయ్య ఫ్రెండ్ జగదీష్‌ చంద్ర ప్రసాద్‌ ను గుర్తు పట్టి సాదరంగా ఆహ్వానిస్తుంది కావ్య. దీంతో ఆయన ఆశ్చర్యపోతారు. సంవత్సరం తర్వాత వచ్చిన నన్ను గుర్తు పెట్టుకున్నావంటే నువ్వు చాలా గ్రేట్ అంటాడు. కావ్య ఎందుకు వచ్చారని అడుగుతుంది. గుడికి చెందిన నగలు చేయించాలని వచ్చానని డీటెయిల్స్‌ చెప్పి వెళ్లిపోతారు. ఇంతల శృతి వచ్చి రాజ్‌ సార్‌ ఫైల్‌ తీసుకుని ఇంటికి వెళ్లారని చెప్పడంతో కావ్య ఇంటికి వెళ్తుంది.

కావ్య: అమ్మమ్మ గారు మీ మనవడు ఎక్కుడున్నారు.

ఇందిర: ఏమైందమ్మా..

కావ్య: నేను ఆయనతోనే తేల్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మీరు పిలుస్తారా..? నన్ను పిలవమంటారా..?

ఇందిర: రాజ్‌.. రాజ్‌…

రాజ్: ఏంటి..?

కావ్య: మీ ఉద్దేశ్యం ఏంటి…

రాజ్‌: నీ విషయంలోనా..? నా విషయంలోనా..?

కావ్య: కంపెనీ విషయంలో.. సుగుణ కంపెనీ వాళ్లకు డిజైన్స్‌ పంపించకుండా ఆ ఫైల్‌ పట్టుకుని ఇంటికి ఎందుకు వచ్చారు.

రాజ్‌: ఆ కంపెనీతో డీల్‌ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి.

కావ్య: మీ ఇష్టా ఇష్టాలు ఎవరికి కావాలి ఇక్కడ.. నాకు ఒక మాట చెప్పాలి కదా..? ఎందుకు చెప్పలేదు.

రాజ్‌: నేను నిన్ను ఒక సుపీరియర్‌ గా గుర్తించలేదు కాబట్టి.

కావ్య: అక్కడ నేను ఉన్నానా..? ఇంకొకరు ఉన్నారా..? అన్నది కాదు. ఆ సీటు ఇవ్వాల్సిన గౌరవం మీరు ఇవ్వాలి.

రాజ్‌: నువ్వు నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చావా..? నా ఒపీనియన్‌ కనుక్కున్నావా..? నాతో డిస్కషన్‌ చేశావా..?

అని రాజ్‌ అడగ్గానే నేను ఏది చేయాలనుకున్నా కింది ఉద్యోగులతో చర్చించాల్సిన అవసరం లేదు మిస్టర్‌ మేనేజర్‌ అంటుంది. దీంతో ఈ అహంకారమే నాకు నచ్చదు అంటూ తిడతాడు రాజ్‌.  దీంతో సీతారామయ్య రాజ్‌ను తిడతాడు. కావ్యకు చెప్పకుండా ఆ ఫైల్‌ ఎందుకు తీసుకొచ్చావని అడుగుతాడు. దీంతో రాజ్‌ ఉలకడుపలకడు. ఇంతలో సీతారామయ్య.. కావ్యను ఏమైందని అడుగుతాడు. రాజ్ ఇగో అడ్డొస్తుంది. నన్ను అడగకుండా కావ్యను అడుగుతారేంటి..? అంటాడు. ఇంతలో అందరి మధ్య గొడవ జరగుతుంది. జగదీశ్‌ చంద్ర ప్రసాద్‌ ఆఫీసుకు వచ్చిన విషయం చెప్తుంది కావ్య. రాజ్‌ తానే ఎక్కువ టాలెంట్‌ ఉన్నోడిని అని బిల్డప్‌ ఇచ్చుకుంటాడు.

సీతారామయ్య: సరేరా నువ్వు ఇంతగా నీ గురించి డబ్బా కొట్టుకుంటున్నావు. కావ్య కూడా నీ గురించి మంచి సర్టిఫికెట్‌ ఇస్తుంది కాబట్టి. జగదీశ్‌ చంద్ర ప్రసాద్‌ ప్రాజెక్టు మీద ఇద్దరు విడివిడిగా పని చేయండి. ఎవరి సమర్థత ఏంటో తేలిపోతుంది కదా..?

రాజ్‌: తాతయ్య ఈ డీల్‌ బాగుంది. నాకు నచ్చింది నాకు ఓకే. మీ సీఈవో గారు ఏమంటారో

ఇందిరి: నువ్వేంటి సరే అని చెప్పకుండా సైలెంట్‌ గా నిలబడ్డావు ఏం ఆలోచిస్తున్నావు.

కావ్య: మీ మనవడు నా చేతిలో ఘోరంగా అపజయం పాలైతే ఆయన ఫేస్‌ అనామిక ఫేస్‌ లా మాడిపోతే ఎలా ఉంటుందో ఊహించుకుంటున్నాను అమ్మమ్మ.

అని చెప్పగానే రాజ్‌ షాక్‌ అవుతాడు. మరీ అంతలా ఊహించుకోకు. నీ సామర్థ్యం ఏంటో నువ్వు ఇంటికి వచ్చి నా టాలెంట్‌ గురించి చెప్పినప్పుడే అర్థం అయింది. అంటాడు రాజ్‌. దీంతో కావ్య కూడా చాలెంజ్‌ చేస్తుంది. నేను ఎవరి సాయం లేకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తాను అంటుంది.

సుభాష్‌: ఉత్త పందేమే అయితే కిక్‌ ఏముంది. ఇద్దరిలో గెలిచేవారెవరో వారికి ఏదైనా బహుమతి ఉండాలి కదా..?

సీతారామయ్య: తప్పకుండా ఉంటుంది సుభాష్‌. ఆ ప్రసాద్‌ కాంట్రాక్ట్ ను ఎవరైతే మన కంపెనీకి వచ్చేటట్టు చేస్తారో వారినే సీఈవో గా కూర్చోబెడతాను.

అనగానే అందరూ చప్పట్లు కొడతారు. ఇంతలో రాజ్‌ నేను ఓడిపోతే కళావతిని భార్యగా ఒప్పుకుని ఇంటికి తీసుకొస్తాను అంటాడు. మరి కళావతి ఓడిపోతే ఏం చేస్తుంది. అని అడుగుతాడు. దీంతో అది కూడా నువ్వు చెప్పు అంటారు. కళావతి ఓడిపోతే జీవితంలో ఆఫీసు ముఖం చూడకూడదు అంటాడు రాజ్‌. సరేనని అందరూ వెళ్లిపోతారు. తర్వాత కావ్య ఈ పందెం తనకు నచ్చడం లేదని ఇందిరకు చెప్తుంది. ఆయన ఓడపోయినా నేను ఓడిపోయినట్టేనని అంటుంది. దీంతో సీతారామయ్య, ఇందిర, అపర్ణ ముగ్గురు కలసిఇ కావ్యను కన్వీన్స్‌ చేస్తారు. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి  లడ్డూ ప్రసాద నెయ్యి కల్తీ కేసులో సీబీఐ సిట్ దూకుడు - సూత్రధారుల వేట ప్రారంభం !
శ్రీవారి లడ్డూ ప్రసాద నెయ్యి కల్తీ కేసులో సీబీఐ సిట్ దూకుడు - సూత్రధారుల వేట ప్రారంభం !
Chilkur Balaji Temple Chief Priest Rangarajan : రంగరాజన్‌కు రేవంత్ ఫోన్ - దాడి రాజకీయానికి ఫుల్‌స్టాప్ పెట్టిన సీఎం
రంగరాజన్‌కు రేవంత్ ఫోన్ - దాడి రాజకీయానికి ఫుల్‌స్టాప్ పెట్టిన సీఎం
Lakshmi Arrest: కిరణ్ రాయల్ పై ఫిర్యాదు చేసిన లక్ష్మి అరెస్ట్- తిరుపతిలో అదుపులోకి తీసుకున్న జైపూర్ పోలీసులు
కిరణ్ రాయల్ పై ఫిర్యాదు చేసిన లక్ష్మి అరెస్ట్- తిరుపతిలో అదుపులోకి తీసుకున్న జైపూర్ పోలీసులు
KTR Visits Chilukuru Temple: చిలుకూరు అర్చకులు రంగరాజన్‌ను పరామర్శించిన కేటీఆర్, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవంటూ ఆగ్రహం
చిలుకూరు అర్చకులు రంగరాజన్‌ను పరామర్శించిన కేటీఆర్, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవంటూ ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirumala Ghee Adulteration Case | తిరుమల లడ్డూ కల్తీ కేసులో నలుగురు అరెస్ట్ | ABP DesamMadhya Pradesh Dhar Gang Arrest | 55కేసులున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసిన అనంత పోలీసులు | ABP DesamBaduguvani Lanka Nurseries | గోదావరి తీరంలో ఈ ఊరి పూలతోటల అందాలు చూశారా | ABP DesamElon Musk MARS Square Structure | మార్స్ మీదకు ఆస్ట్రోనాట్స్ ను పంపాలనంటున్న మస్క్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: శ్రీవారి  లడ్డూ ప్రసాద నెయ్యి కల్తీ కేసులో సీబీఐ సిట్ దూకుడు - సూత్రధారుల వేట ప్రారంభం !
శ్రీవారి లడ్డూ ప్రసాద నెయ్యి కల్తీ కేసులో సీబీఐ సిట్ దూకుడు - సూత్రధారుల వేట ప్రారంభం !
Chilkur Balaji Temple Chief Priest Rangarajan : రంగరాజన్‌కు రేవంత్ ఫోన్ - దాడి రాజకీయానికి ఫుల్‌స్టాప్ పెట్టిన సీఎం
రంగరాజన్‌కు రేవంత్ ఫోన్ - దాడి రాజకీయానికి ఫుల్‌స్టాప్ పెట్టిన సీఎం
Lakshmi Arrest: కిరణ్ రాయల్ పై ఫిర్యాదు చేసిన లక్ష్మి అరెస్ట్- తిరుపతిలో అదుపులోకి తీసుకున్న జైపూర్ పోలీసులు
కిరణ్ రాయల్ పై ఫిర్యాదు చేసిన లక్ష్మి అరెస్ట్- తిరుపతిలో అదుపులోకి తీసుకున్న జైపూర్ పోలీసులు
KTR Visits Chilukuru Temple: చిలుకూరు అర్చకులు రంగరాజన్‌ను పరామర్శించిన కేటీఆర్, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవంటూ ఆగ్రహం
చిలుకూరు అర్చకులు రంగరాజన్‌ను పరామర్శించిన కేటీఆర్, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవంటూ ఆగ్రహం
Vishwaksen: 'మా ప్రమేయం లేని దానికి మమ్మల్ని బలి చేయొద్దు' - 'బాయ్ కాట్ లైలా' స్పందించిన మూవీ టీం, సారీ చెప్పిన హీరో విశ్వక్ సేన్
'మా ప్రమేయం లేని దానికి మమ్మల్ని బలి చేయొద్దు' - 'బాయ్ కాట్ లైలా' స్పందించిన మూవీ టీం, సారీ చెప్పిన హీరో విశ్వక్ సేన్
Ram Gopal Varma: సీఐడీతోనే గేమ్సా ? - రామ్ గోపాల్ వర్మ పరిస్థితేంటి ?
సీఐడీతోనే గేమ్సా ? - రామ్ గోపాల్ వర్మ పరిస్థితేంటి ?
UK : యూకేలో అక్రమంగా పని చేస్తున్న వారందరికీ  బ్యాడ్ న్యూస్ - అమెరికా తరహాలో గెంటేయాలని ప్రధాని స్టార్మర్ నిర్ణయం
యూకేలో అక్రమంగా పని చేస్తున్న వారందరికీ బ్యాడ్ న్యూస్ - అమెరికా తరహాలో గెంటేయాలని ప్రధాని స్టార్మర్ నిర్ణయం
Junior NTR: పాప్ సింగర్ ఎడ్ షీరన్ నోట 'చుట్టమల్లే' సాంగ్ - ఇది నిజంగా ప్రత్యేకమంటూ స్పందించిన జూనియర్ ఎన్టీఆర్
పాప్ సింగర్ ఎడ్ షీరన్ నోట 'చుట్టమల్లే' సాంగ్ - ఇది నిజంగా ప్రత్యేకమంటూ స్పందించిన జూనియర్ ఎన్టీఆర్
Embed widget