Brahmamudi Serial Today November 12th: ‘బ్రహ్మముడి’ సీరియల్: దుగ్గిరాల ఇంట్లో వంటల పోటీ – రాహుల్ ను తిట్టిన రుద్రాణి
Brahmamudi serial today episode November 12th: 20 లక్షలు లాభం వచ్చే డీల్‌ను రాహుల్ చేయనని చెప్పడంతో రుద్రాణి తిడుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: కావ్య కోసం అర్దరాత్రి కిచెన్‌లోకి వెళ్లి చికెన్ మంచూరియా చేస్తున్న రాజ్‌ను అందరూ చూస్తారు. అందరిని నిద్ర లేపి మరీ కావ్యనే కిచెన్‌లోకి తీసుకెళ్తుంది. వాళ్లను చూసిన రాజ్ షాక్ అవుతాడు.
రాజ్: అదేంటి కళావతి ఇలా ఇరికించావు నన్ను
కావ్య: భార్య కోసం మీరు పడుతున్న తిప్పలు నలుగురికి తెలియకపోతే ఎలాగా..? పెళ్లాం కోసం చేసిన ఈ చికెన్ మంచూరియా టేస్ట్ పది మందికి తెలియకపోతే మీ శ్రమకు విలువ ఏముంటుందండి.. అందుకే తీసుకొచ్చానండి
రాజ్: నన్ను వీళ్లకు బలి ఇవ్వాలని ఫిక్స్ అయ్యావన్నమాట
ఇందిరాదేవి: ఏరా ఈ ముసల్ది నడుం నొప్పిగా ఉంది కాస్త మందు రాయరా అంటే ఖాళీగా లేను అంటావా..? కానీ పెళ్లానికి చికెన్ మంచూరియా..
ధాన్యలక్ష్మీ: అది కూడా అర్ధరాత్రి అత్తయ్యా
అపర్ణ: కన్నతల్లిని కాస్త హెడేక్ టాబ్లెట్ తెచ్చివ్వరా అంటే హెడ్ తిప్పుకుని వెళ్లిపోతావా.?
ప్రకాష్: ఆఫీసుకు రావడానికి బిజీ..
ధాన్యలక్ష్మీ: సంతకాలు చేయడానికి మాత్రం బిజీ
ప్రకాష్: మీటింగ్ లకు ఆటెండ్ కావడానికి మాత్రం బిజీ
ఇందిరాదేవి: కానీ నీ పెళ్లానికి చికెన్ చేయడానికి..
రాజ్: మీకు దండం పెడతాను నన్ను వదిలేయండి.. నా పెళ్లాం నాకు ఇంత ట్విస్ట్ ఇస్తుందని అనుకోలేదు..
కావ్య: వాళ్లు నీ వంటకు రివ్యూ ఇస్తున్నారండి
రాజ్ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రేపు ఉదయం వాడి పని చెప్తాను అంటుంది. తర్వాతి రోజు ఉదయమే అందరూ హాల్లో కూర్చుని ఉంటారు.
ఇందిరాదేవి: అపర్ణ రాత్రి అనుకున్నది గుర్తు ఉంది కదా..?
అపర్ణ: ఎలా మర్చిపోతాను అత్తయ్య
సుభాష్: మర్చిపోయే పని చేశాడా సారూ.. మీరు చెప్పాక షాక్ అయ్యాను నేను
రాజ్ నిద్ర లేచి హాల్లోకి వస్తాడు.
రాజ్: హాయ్ నాన్న ఏంటి పొద్దున్నే మీటింగ్ పెట్టారు. ఎవర్ని మోసేద్దాం అని
ఇందిరాదేవి: ఏరా ఇప్పుడా లేవడం
సుభాష్: ఇంట్లో పనులుంటాయని తెలియదా..?
ధాన్యలక్ష్మీ: ఎవరికి ఏం కావాలో చూసుకోవాలని తెలియదా..?
రాజ్ అయోమయంగా చూస్తుంటాడు. ఒక్కోక్కరు ఒక్కో రకమైన కాఫీలు టీలు చెప్తుంటారు. రాజ్ ఏమీ అర్థం కాదు
రాజ్: హలో ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నారు..?
ఇందిరాదేవి: నిన్నే అడుగుతున్నాము
అపర్ణ: మేము చెప్పినవి అన్ని నువ్వే స్వయంగా చేసుకుని తీసుకురావాలి
రాజ్: నేనేమన్నా హోటల్ లో సర్వర్ ను అనుకుంటున్నారా… లేకపోతే ఈ ఇంట్లో సర్వెంట్ ను అనుకుంటున్నారా..? రాజ్.. స్వరాజ్ ది గ్రేట్ బిజినెస్ మ్యాన్.. తెలుసా..?
ఇందిరాదేవి: అవునా అలాగా.. మరి నిన్నటి చికెన్ మంచూరియా సంగతేంటి బాబు
ధాన్యలక్ష్మీ: పెళ్లాలకు బిజినెస్ మ్యాన్స్ అలాగే చికెన్ మంచూరియా చేసి పెడతారు మీకు తెలియదా అత్తయ్యా
ఇందిరాదేవి: ఎందుకు తెలియదు.. బాబు గారికి పెళ్లాం బెల్లం అయింది. అందుకే రాత్రి అల్లం నూరాడు..
అపర్ణ: మనం కాఫీలు అడిగితే మాత్రం కారాలు నూరుతున్నాడు
సుభాష్: చికెన్ అదిరిపోయిందట గదా
ప్రకాష్: అబ్బో మామూలుగా కాదు అన్నయ్యా..
ధాన్యలక్ష్మీ: పెళ్లాం కోరిక మరి ఎంత కష్టపడ్డాడో
అంటూ అందరూ మాట్లాడుతుంటే అందరికీ కాఫీ తీసుకుని వస్తుంది కావ్య. తన కోసం రాజ్ చేస్తున్ వంటల గురించి చెప్తుంది. వెంటనే అపర్ణ, ధాన్యలక్ష్మీ ఇద్దరూ సుభాష్, ప్రకాష్‌ను అడగ్గానే.. ఇద్దరూ కిచెన్‌లోకి వెళ్లి ఉప్మా చేస్తారు ఆ ఉప్మా తినలేక అపర్ణ, ధాన్యలక్ష్మీ వాంప్టింగ్స్ చేసుకుంటారు. అందరూ నవ్వుకుంటారు. తర్వాత రాహుల్ కు ఇల్లీగల్ డీల్ చేయమని ఆఫర్ వస్తే చేయనని చెప్తాడు. అది తెలుసుకున్న రుద్రాణి తిడుతుంది. 20 లక్షలు వస్తుంటే ఎందుకు చేయడం లేదని అడుగుతుంది. రాహుల్ ఇకపై తాను తప్పుడు పనులు చేయనని చెప్తాడు. అది గమనించిన స్వప్న, రాహుల్‌ను మెచ్చుకుంటుంది. రుద్రాణిని తిడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















