Brahmamudi Serial Today January 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : సుభాష్ పరువు తీసిన కావ్య - పాటలు రాయలేనన్న కళ్యాణ్
Brahmamudi Today Episode: పది కోట్ల అప్పు ఎందుకు చేశారని అడిగిన సుభాష్‌ను కావ్య పరువు తీస్తుంది. అందరిలో అడిగే రైట్స్ లేవంటూ చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
![Brahmamudi Serial Today January 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : సుభాష్ పరువు తీసిన కావ్య - పాటలు రాయలేనన్న కళ్యాణ్ brahmamudi serial today episode January 24th written update Brahmamudi Serial Today January 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : సుభాష్ పరువు తీసిన కావ్య - పాటలు రాయలేనన్న కళ్యాణ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/24/1f3391cf25381caf0d07d2f8d2a6acef1737686645185879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Brahmamudi Serial Today Episode: ఇంట్లో అందరికీ నిజం తెలియాల్సిన సమయం వచ్చిందని రాజ్ నిజం చెప్పబోతుంటే కావ్య అపుతుంది. మధ్యలో మీరెవరు జోక్యం చేసుకోవడానికి.. అయినా వీళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం మనకు లేదని.. ఆస్థి మొత్తం నా పేరు మీద ఉంది. చెప్పాలనిపిస్తే నేను చెప్పాలి.. మీరు మాత్రం సైలెంట్ గా ఉండండి.. అంటుంది కావ్య. దీంతో రాజ్ సైలెంట్ అయిపోతాడు.
రుద్రాణి: వదిన చూశావా..? అంతా అయిపోయింది. నీ కొడుకును బొమ్మను చేసి ఆడిస్తుంది నీ కోడలు. రాజ్ నోరు మూయించింది నీ కోడలు
సుభాష్: రుద్రాణి నువ్వు ఆగు.. ఏ కారణంతో నా కోడలు, నా కొడుకు నోరు మూయించిందో నేను కనుక్కుంటాను. కానీ నువ్వు మాత్రం మనుషులను రెచ్చగొట్టకు.. చూడమ్మా కావ్య ఆస్తి మొత్తం నీ పేరునే ఉంది. నేను కాదనటం లేదు. కానీ ఆప్పు తీసుకున్నది చాలా పెద్దమొత్తంలో ఉంది. గెస్ట్ హౌస్ తాకట్టు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందమ్మా.. అంత పెద్ద అమౌంట్ మీకు ఏం అవసరం వచ్చింది. అది తెలుసుకునే హక్కు నాకు లేదా..?
కావ్య: చూడండి మామయ్యగారు. తాతయ్యగారు నన్ను నమ్మి ఆస్తి మొత్తం నాకు రాసిచ్చారు. దాన్ని తాకట్టు పెట్టే హక్కు నాకు ఉంది. అవసరం అయితే అమ్మే హక్కు కూడా నాకు ఉంది. కానీ నేను ఏం చేసినా ఎందుకు అని అడిగే హక్కు ఈ ఇంట్లో ఎవ్వరికీ లేదు
అపర్ణ: కావ్య ఎంత ధైర్యం నీకు నా భర్తనే ఎదురించి మాట్లాడతావా..? నా భర్తనే అడిగే హక్కు లేదంటావా..?
అంటూ కావ్యను కొట్టబోతుంది అపర్ణ. సుభాష్ అపర్ణను వద్దని వారిస్తాడు. రాజ్, కావ్య వెళ్లిపోతారు. రూంలోకి వెళ్లిన కావ్య బాధపడుతుంటే రాజ్ ఓదారుస్తాడు.
కావ్య: ఏవండి మీరు నన్ను ఏమీ అడగరా..? ఏమీ అనరా..?
రాజ్: ఏ విషయంలో…?
కావ్య: దేవుడి లాంటి మామయ్యగారిని పట్టుకుని నేను నోరు జారానండి.. ఇది నాకే తెలియకుండా నోరు జారడం కాదని మీకు అర్థం కాలేదా..?
రాజ్: ఎందుకు అర్థం కాలేదు
కావ్య: మరి మీకు నా మీద కోపం రాలేదా..?
రాజ్: కోపం వచ్చింది. కానీ నీ మీద కాదు.. మన నిస్సహాయత మీద. మనల్ని ఇలా నిలబెట్టిన వాడి మీద నా అసమర్థత మీద
కావ్య: అయ్యో మీరెందుకు బాధపడతారు
రాజ్: మనం అప్పుగానో బదులుగానో తీసుకోలేని డబ్బు.. మనం ఎంతో కష్టపడి అప్పుగా తీర్చాల్సి వచ్చింది. ఇన్ని సమస్యల మధ్య ఇంట్లో వాళ్ల ముందు మనం దోషిగా నిలబడాల్సి వచ్చింది. తప్పంతా నీ మీద వేసుకున్నావు. ఈరోజు నువ్వు మా నాన్న ఏమన్నా ఆయన మాత్రం నిన్ను అపార్థం చేసుకోడు. భర్తగా నేను నీకు ఎప్పుడూ ఏమీ చేయలేదు. కానీ ఇక నుంచి నీ మనసు కష్టపెట్టకుండా ఉండాలనుకుంటున్నాను
కావ్య: ఇంతసేపు మామయ్యగారిని మాట అన్నానే అనే బాధతో నలిగిపోయాను. కానీ ఇప్పుడు అపరాధ బావం అంతా పోయింది. మీ నుంచి నా కావాల్సినంత ఓదార్పు దొరికింది. చాలండి నాకిప్పుడు ధైర్యంగా ఉంది.
అంటూ కావ్య ఎమోషనల్ అవుతుంది. మరోవైపు పాట రాయడంలో ఇబ్బంది పడుతున్న కళ్యాణ్‌ను మోటివేట్ చేస్తుంది అప్పు. సూపర్ పాట రాసేలా చేస్తుంది. దుగ్గిరాల ఇంట్లో రాత్రి నిద్రపోకుండా ఆలోచిస్తున్న సుభాష్ దగ్గరకు వచ్చిన ప్రకాష్.. సుభాష్‌ను ఓదారుస్తాడు. ఇంట్లో నిన్ను కూడా కావ్య లెక్కచేయడం లేదని బాధపడతాడు. ఇద్దరూ మాట్లాడుకోవడం కావ్య వింటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)