Brahmamudi Serial Today January 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్ : నందను పట్టుకున్న రాజ్, కావ్య – కావ్య బాగోతం బయటపెట్టిన ధాన్యలక్ష్మీ
Brahmamudi Today Episode: ఎస్సై నంద సమాచారం ఇవ్వడంతో రాజ్, కావ్య అక్కడికి వెళ్లడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ ఆసక్తికరంగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: కావ్యను చాలా ఓపికగా అన్ని పనులు చేస్తున్నావని.. అల్లు అర్జున్ స్టైల్ లో డైలాగ్ చెప్పే సరికి కావ్య భయపడుతుంది. మీరు తిట్టినా సరే కానీ పొగడొద్దు అంటూ ఎమోషన్ అవుతుంది. నిన్ను తిట్టినా.. పొగిడినా కష్టమే అంటాడు రాజ్. ఇంతలో ఎస్సై ఫోన్ చేసి నంద అడ్రస్ దొరికిందని నేను వస్తున్నానని.. మీరు రండి లోకేషన్ షేర్ చేస్తాను అని చెప్పగానే.. రాజ్, కావ్య వెంటనే అక్కడికి వెంటనే బయలుదేరుతారు. కింద స్టాంపు పేపర్ పట్టుకుని కోపంగా చూస్తుంది ధాన్యలక్ష్మీ.. రాజ్, కావ్య కిందకు వస్తారు.
ధాన్యలక్ష్మీ: ఆగండి
ఇందిరాదేవి: ఎందుకు ఆగాలి…?
ధాన్యలక్ష్మీ: ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అందరికీ తెలియాలి.
ఇందిరాదేవి: ఏం జరుగుతుంది రోజుకో పంచాయితి జరుగుతుంది
ధాన్యలక్ష్మీ: ఆ పంచాయితీలే ఎందుకు జరుగుతున్నాయి. ఏ రుజువులు లేకుండా మీ మనవరాలు చేసే అరాచకాల వల్లే కదా
రాజ్: పిన్ని మేము అర్జెంట్ గా వెళ్లాలి..
కావ్య: చిన్నత్తయ్యా ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం ఏవండి పదండి
ధాన్యలక్ష్మీ: నాకు సమాధానం చెప్పి వెళ్లాలి
ఇందిరాదేవి: ఇవాళ ఏమైంది నీకు
ధాన్యలక్ష్మీ: నాకు ఒక దారుణమైన నిజం తెలిసింది
సుభాష్: ఏంటా దారుణమైన నిజం
స్టాంప్ పేపర్స్ సుభాష్‌కు ఇస్తుంది ధాన్యలక్ష్మీ
ధాన్యలక్ష్మీ: మీరే చూడండి బావగారు
రుద్రాణి: త్వరగా చూడండి లేదంటే అవి కూడా మాయం కావోచ్చు
ధాన్యలక్ష్మీ: మీ కోడలు సమర్థురాలు అని మామయ్యగారు ఆస్తి మొత్తం ఆవిడ చేతుల్లో పెడితే చివరికి ఏం చేసింది.
రుద్రాణి: ఏం చేసిందని వాళ్లను అడిగితే వాళ్లేం చెప్తారు ధాన్యలక్ష్మీ నువ్వే చెప్పు
ధాన్యలక్ష్మీ: బావగారు చదివారు కదా..? చెప్పండి.. ఓ మీ కోడలు మంచిదని మీరు మాట్లాడలేకపోతున్నారా..? పది కోట్ల కోసం పరువు ప్రతిష్టలు మర్చిపోయి దుగ్గిరాల గెస్ట్ హౌస్ ను తాకట్టుపెట్టింది
అని ధాన్యలక్ష్మీ చెప్పగానే.. అందరూ షాక్ అవుతారు.
రుద్రాణి: ఏంటలా అందరూ తెల్లబోయి చూస్తున్నారు. ఈ రహస్యం మాకెలా తెలిసిందనా..?
స్వప్న: అలాంటి డౌట్లు ఏమీ లేవు అత్తా.. నీ కొడుకు ఉన్నాడు.. ఇలాంటి రహస్యాలు అన్ని వెలికి తీసి ఇంట్లో చిచ్చు పెట్టడం మీకు అలవాటేగా
ధాన్యలక్ష్మీ: ఇప్పుడు ఏం అవసరం వచ్చిందని పదికోట్లకు గెస్ట్ హౌస్ ను తాకట్టు పెట్టాల్సి వచ్చింది.
ఇందిరాదేవి: ఓరేయ్ నీకు ఈ విషయం నీకు తెలుసా..?
రాజ్ : తెలుసు నాన్నమ్మ. నాకు తెలియకుండా కావ్య ఏ పని చేయదు.
ఇందిరాదేవి: ఏదో అవసరం వచ్చి తాకట్టుపెట్టి ఉంటారు దానికింత రాదాంతం చేయాలా..?
రుద్రాణి: అంత ఈజీగా తీసేశావేంటమ్మా..?
ఇందిరాదేవి: రుద్రాణి ఈ విషయాలు అడిగే హక్కు నీకు లేదు
ధాన్యలక్ష్మీ: అయితే మాకుంది కదా అత్తయ్యా
రాజ్: ఇప్పుడు మేము అర్జెంట్ పని మీద వెళ్తున్నాం సాయంత్రం ఇంటికి వచ్చాక తీరిగ్గా అంతా చెప్తాము.
అని కావ్య, రాజ్ కలిసి వెళ్లిపోతారు. వాళ్లు వెళ్లాక స్వప్న కోపంగా రుద్రాణిని తిడుతుంది. అసలు మీకు ఆ డాక్యుమెంట్స్ ఎలా దొరికాయి. ఎవరో కావాలనే రాజ్, కావ్యను వెనక నుంచి గొతులు తొవ్వడానికే ఇలా చేస్తున్నారేమో అంటుంది. దీంతో రాహుల్, రుద్రాణి షాక్ అవుతారు. మరోవైపు నంద ఉన్న గెస్ట్ హౌస్‌కు వెళ్తారు రాజ్, కావ్య. వాళ్లను చూసిన నంద షాక్ అవుతాడు. వెంటనే తన మనుషులను రాజ్‌ను చంపేయమని చెప్తాడు. రౌడీలు రాజ్ మీదకు వస్తుంటే.. కావ్య తన మాటలతో రౌడీలను కన్పీజ్ చేస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

