Brahmamudi Serial Today January 15th: ‘బ్రహ్మముడి’ సీరియల్: పాప పుట్టిన ఆనందంలో కావ్య, రాజ్ - గోల్డ్ కేసును జడ్జి దగ్గరకు తీసుకెళ్లిన ఎస్సై
Brahmamudi serial today episode January 15th: రాజ్ రావడంతో కావ్య ఆపరేషన్‌కు ఒప్పుకుంటుంది. కావ్యకు పాప పుడుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: స్టేషన్ నుంచి తప్పించుకుని హాస్పిటల్‌కు వస్తాడు రాజ్. కానిస్టేబుల్స్ ను అందరూ అడ్డగించడంతో రాజ్ ఐసీయూలోకి కావ్య దగ్గరకు వెళ్తాడు. అప్పుడే డాక్టర్ కూడా ఐసీయూలోకి కావ్య దగ్గరకు వెళ్తుంది. రాజ్ ను చూసి షాక్ అవుతుంది.
డాక్టర్: మీరేంటి ఇక్కడ..?
రాజ్: మీరే చెప్పారు కదా డాక్టర్ నేను వస్తేనే నా భార్య ఆపరేషన్ చేయించుకుంటుందని అందుకే వచ్చేశాను
డాక్టర్: ఏం మాట్లాడుతున్నారండి మీరు నేను మిమ్మల్ని ఇక్కడకు తీసుకురమ్మని చెప్పింది ఒక నేరస్థుడిగా కాదు
కావ్య: డాక్టర్ గారు నా భర్త నేరస్థుడు కాదు ఆయన ఏ తప్పు చేయలేదు
డాక్టర్: కానీ నీ భర్తను ఇక్కడ పెట్టుకుని నేను ఏ ఆపరేషన్ చేయలేను. తప్పు చేసి తప్పించుకుని వచ్చిన ఒక క్రిమినల్ ఇలా ఆపరేషన్ థియేటర్‌లో ఉంటే.. మా హాస్పిటల్‌కు నాకు చెడ్డ పేరు వస్తుంది దయచేసి బయటకు వెళ్లండి
కావ్య: డాక్టర్ నా భర్త నన్ను వదిలిపెట్టి వెళ్లిపోతే నేను తట్టుకోలేను డాక్టర్
డాక్టర్: కానీ ఇలాంటి వ్యక్తి ఇక్కడ ఉంటే మా బాధ్యతను కూడా మేము నిర్వర్తించలేము. ఇది మా వృత్తికే మంచిది కాదు
రాజ్: ఫ్లీజ్ డాక్టర్ కాస్త కనికరించండి.. నా భార్య తన కడుపులో ఉన్న బిడ్డకు ప్రాణం పోస్తుంది. కానీ ఆ ప్రాణం ఊపిరి పోసుకోవాలంటే నా ప్రాణం నిలబడాలి. నా భార్య ప్రాణం నేనే డాక్టర్. నా భార్య పరిస్థితి ఏంటో మీకు తప్ప ఇక్కడ ఎవ్వరికీ తెలియదు.. దయచేసి నా భార్య బతకాలన్నా.. నా బిడ్డను బతికించాలన్నా..? నేను ఇక్కడే ఉండాలి డాక్టర్ కాదనకండి ఫ్లీజ్ డాక్టర్
డాక్టర్: బయట పోలీసులు.. లోపల మీరు.. మీకు అర్థం అవుతుందా..?
రాజ్: అందుకే డాక్టర్ వాళ్లు లోపలికి రాలేరు కనుకే ఆపరేషన్ అయ్యే దాకా నేను నా భార్య పక్కనే ఉంటానంటున్నాను.. నా భార్య డెలివరీ అవ్వగానే ఒకసారి నా బిడ్డను చూసి వెళ్లిపోతాను. ఇంకే ప్రాబ్లమ్ క్రియేట్ చేయను. డాక్టర్ ఫ్లీజ్ డాక్టర్ అర్థం చేసుకోండి..
కావ్య: ఫ్లీజ్ డాక్టర్ నా భర్తను నా పక్కనే ఉండనివ్వండి.. ఫ్లీజ్
డాక్టర్: సిస్టర్‌ను కావ్యను ఆపరేషన్ థియేటర్‌కు షిప్ట్ చేయండి
అని చెప్తుంది. సరే అంటూ సిస్టర్ ఏర్పాట్లు చేస్తుంది. బయట ఉన్న అప్పు కానిస్టేబుల్స్ ను పది నిమిషాలు పక్కకు వెళ్లమని చెప్తుంది.
ఇందిరాదేవి: ఏమిటే మాట్లాడేది.. నీకు డ్యూటీ పిచ్చి పట్టింది
అప్పు: డ్యూటీ అంటే పిచ్చి కాదు అమ్మమ్మ.. మా అక్క అంటే ప్రేమ, బావంటే అభిమానం. అందుకే ఇప్పటికే బావ చేయని తప్పుకు దోషిలా మారాడు.. ఇప్పుడు ఇంకో తప్పు చేసి బావ ఇరుక్కుపోవద్దనే.. అరెస్ట్ చేసి స్టేషన్ లో అప్పగిస్తాను అన్నాను
అపర్ణ: అరెస్ట్ చేసి నా కొడుకును స్టేషన్ లో అప్పజెప్పి ఆదర్శమైన పోలీస్ అనిపించుకోవాలి అనుకుంటున్నావా.? మరి చావు బతుకుల మధ్య ఉన్న కావ్య పరిస్థితి ఏంటి..? దాని బతుకు ఏమవ్వాలి అనుకుంటున్నావు
అని అందరూ అప్పును తిడుతుంటే.. అప్పు కళ్యాణ్‌ను తీసుకుని ఈ కేసు ఇలా కాదు ఎక్కడ మొదలైందో అక్కడి నుంచే పరిష్కారం కనుక్కోవాలి అని స్టేషన్‌కు వెళ్తుంది. శాండీని ఇంటరాగేషన్ చేసి నిజం రాబడుతుంది. రాజ్ నిర్దోషి అని నిరూపించడానికి కోర్టుకు వెళ్తుంది. మరోవైపు రాజ్‌కు ఆడపిల్ల పుడుతుంది. తన బిడ్డను చూసుకుని రాజ్, కావ్య ఎమోషనల్ అవుతారు. అయితే బేబీ వీక్ గా ఉందని ఇంక్యుబేటర్ లో పెడుతుంది డాక్టర్. అదే టైంకు మినిస్టర్ భార్య తులసికి కూడా ఆడపిల్ల పుడుతుంది. పాప ఏడ్వడం లేదని ఇంక్యుబేటర్‌లో పెడతారు డాక్టర్లు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















