Brahmamudi Serial Today February 3rd: రాజ్ ఆఫీసుకు వచ్చిన శ్వేత – రాజ్ ను అనుమానించిన రుద్రాణి
Brahmamudi Today Episode: కావ్య ఆఫీసుకు వెళ్తుందంటే రాజ్ ఏదో తప్పు చేస్తున్నాడని రుద్రాణి అనుమానించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: కిడ్నాపర్ల నుంచి పాపను రక్షించేందుకు ఇంటి లోపలికి వెళ్లిన అప్పు వాళ్లకు పాప కనిపిస్తుంది. వెంటనే కట్లు విప్పి పాపను తీసుకుని వెళ్తుండగా రౌడీలు వస్తారు. మా కళ్లుగప్పి పాపను తీసుకుపోదామని ధైర్యం చేశారా? నీకు పాప ప్రాణాల కన్నా డబ్బే ముఖ్యమా అంటూ బెదిరిస్తారు. ఇప్పుడే పాపను చంపేసి ఆర్గాన్స్ అమ్ముకుంటాము అనగానే.. మీరు అట్లా చేస్తుంటే మేము చూస్తూ ఊరుకుంటామా? అంటూ అప్పు వార్నింగ్ ఇస్తుంది. అయితే మీరు మమ్మల్ని కొట్టి పాపను తీసుకెళ్తారా? అని రౌడీలు అడుగుతారు. పాపను తీసుకెళ్లడానికి మేము మిమ్మల్ని కొట్టాల్సిన అవసరం ఏముంది. ఆ పని పోలీసులు చూసుకుంటారు. అనగానే పోలీసులు డోర్ ఓపెన్ చేసుకుని వచ్చి రౌడీలను అరెస్ట్ చేసి.. అప్పును మెచ్చుకుని పోతారు. పాప కూడా అప్పును మెచ్చుకుంటుంది. మరోవైపు ఆఫీసులో డిజైన్స్ మార్చుకుని రమ్మని శృతికి చెప్తుండగానే ఇంతలో కావ్య కారు దిగుతుంది. కావ్య స్టైలిష్‌గా రెడీ కావడాన్ని చూసిన రాజ్ షాక్ అవుతాడు. కావ్య లోపలికి నడుచుకుంటూ వస్తుంటే అలాగే చూస్తుండిపోతాడు. కావ్య రాజ్ దగ్గరకు వచ్చి
కావ్య: ఏంటి పడిపోయారా?
రాజ్: ఏంటి?
కావ్య: అదే డిజైన్స్ పడేసుకున్నారా?
శృతి: ఇప్పుడు మీరింకా గ్లామరస్‌గా కనిపిస్తున్నారు మేడం. ఇంకా మోడ్రన్‌గా కూడా కనిపిస్తున్నారు.
రాజ్: ఏయ్ నీకు డిజైన్స్ పని చెప్పాను కదా చూసుకోపో..
అని చెప్పి రాజ్ తన చాంబర్‌లోకి వెళ్తుంటే కావ్య కూడా వెనకాలే వెళ్తుంటే.. ఎంప్లాయిస్ అందరూ సూపర్‌గా ఉన్నావని కావ్యను విష్ చేస్తారు. రాజ్ గిల్టీగా ఫీలవుతాడు. ఇంతలో రాజ్‌కు శ్వేత ఫోన్ చేస్తుంది. కలుద్దామని అడుగుతుంది. ఆఫీసుకు రమ్మని చెప్తాడు రాజ్. మరోవైపు రుద్రాణి గార్డెన్‌లో అటూ ఇటూ తిరుగుతూ ఏదో ఆలోచిస్తుంది. ఇంతలో రాహల్ వస్తాడు.
రాహుల్: మామ్ నువ్వు చెప్పినట్లే ఆఫీసుకు ఫోన్ చేసి కనుకున్నాను..
రుద్రాణి: కావ్యలో వచ్చిన మార్పుకు కారణం ఏంటో తెలుసుకున్నావా?
రాహుల్: ఏంటి తెలుసుకునేది అక్కడ మనం అనుమానించదగ్గది ఏమీ లేదు. కావ్య నిజంగానే తన కెరియర్‌ని డెవలప్ చేసుకోవడానికి వెళ్లిందట.
రుద్రాణి: ఆ కావ్య గురించి మీకు ఎవ్వరికీ తెలియకపోయినా నాకు బాగా తెలుసు. డబ్బు మీద కానీ కీర్తి కిరిటాల మీద కానీ తనకు ఎలాంటి ఆశ లేదు.
రాహుల్: మరి అప్పుడు ఆఫీసుకు ఎందుకు వెళ్లింది.
రుద్రాణి: వాళ్ల పుట్టింటి వాళ్లు కష్టంలో ఉన్నారని వెళ్లింది. అది తీరిపోగానే వదినకు మాట ఇచ్చి మరీ ఇంట్లోనే ఉండిపోయింది. మళ్లీ ఇప్పుడు ఆఫీసుకు ఎందుకు వెళ్లింది.
అని రాజ్, కావ్యలను అనుమానిస్తుంది రుద్రాణి. మరోవైపు శ్వేత, రాజ్ ఆఫీసుకు వస్తుంది. శ్వేతను చూసిన రాజ్, కావ్య వినబడేలా శ్వేతను పిలుస్తాడు. శ్వేత, రాజ్‌లను చూసిన కావ్య నేరుగా ఇక్కడికే పిలిపించుకున్నావా? అని మనసులో అనుకుంటుంది. రాజ్, శ్వేతను తీసుకుని తన క్యాబిన్‌లోకి వెళ్లిపోతాడు. కావ్య కోపంగా చూస్తుంది. కావ్య చూసినంతసేపు రాజ్ శ్వేతకు క్లోజ్‌గా ఉన్నట్లు నటిస్తాడు. ఇంతలో కావ్య కొన్ని ఫైల్స్ తీసుకుని రాజ్ చాంబర్‌లోకి వస్తుంది. రాజ్, శ్వేతలతో వెటకారంగా మాట్లాడుతుంది కావ్య. కావ్యను చాంబర్‌లోంచి వెళ్లిపోమ్మంటాడు రాజ్. కావ్య వెళ్లిపోయాక శ్వేత మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందని అడుగుతుంది. ఏం లేదని రాజ్ చెప్పగానే మీ వైఫ్ మనిద్దరి గురించి ఏదో అనుకుంటుంది అని శ్వేత అనగానే రాజ్ షాక్ అవుతారు. మరోవైపు తన చాంబర్‌లోకి వెళ్లిన కావ్య కోపంగా రాజ్‌ను తిట్టుకుంటుంది. నేనేం చేయాలి ఇప్పుడు అంటూ టెన్షన్ పడుతుంది. మరోవైపు శ్వేత మనిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని.. జస్ట్ ఫ్రెండ్స్ అని నువ్వు మీ ఆవిడకు చెప్పొచ్చు కదా అంటుంది. వాళ్ల కళ్లతో చూసిందే నిజమని నమ్మేవాళ్లను ఎలా నమ్మించను.. అని రాజ్ చెప్పగానే ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: చిరంజీవి ఇంట్లో కన్నడ స్టార్ శివన్న - స్పెషల్ లంచ్‌తో ఆతిథ్యమిచ్చిన మెగాస్టార్, ఫొటోలు వైరల్