Chiranjeevi-Shiva Rajkumar: చిరంజీవి ఇంట్లో కన్నడ స్టార్ శివన్న - స్పెషల్ లంచ్‌తో ఆతిథ్యమిచ్చిన మెగాస్టార్, ఫొటోలు వైరల్
Shiva Rajkumar: శివ రాజ్‌కుమార్ నేడు మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకంగా కలిశారు. స్వయంగా బెంగళూరు నుంచి చిరుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శివన్న కోసం చిరు స్పెషల్ లంచ్ ఏర్పాటు చేశారు.
Shiva Rajkumar at Chiranjeevi Home: సినీ రంగానికి అందించిన విశేష సేవలకుగానూ మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ అవార్డు వరించింది. రిపబ్లిక్ డే సందర్భంగా భారత ప్రభుత్వం ప్రకటించి పద్మ అవార్డుల్లో చిరంజీవి పద్మ విభూషణ్‌కు ఎన్నికైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి చిరుకు అభినందనలు వెల్లువెత్తున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు స్వయంగా చిరంజీవి నివాసానికి వెళ్లి మరి ఆయనను సత్కరించి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సినీ, రాజకీయ ప్రముఖుల రాకతోవారం రోజులుగా ఇరు ఇంట్లో సందడి వాతావారణం నెలకొంది.
ఇక తన మామకు పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా మెగా కోడలు ఉపాసన శనివారం సాయంత్రం విందు కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చిరుకు విషెస్ తెలిపారు. ఈ క్రమంలో నేడు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ చిరంజీవిని కలిశాను. ఆదివారం స్వయంగా ఆయన బెంగుళూరు నుంచి వచ్చి మెగాస్టార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శివరాజ్ కుమార్‌ను అప్యాయంగా ఆహ్వానించిన చిరు ఆయనకు తన ఇంట్లోనే ప్రత్యేక అతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా చిరు, శివన్న కలిసి భోజనం చేస్తుంటే మెగా డాటర్ సుష్మితా ఆయనకు ప్రేమగా వండించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను చిరింజీవి షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.
నా ప్రియ మిత్రుడిని కలవడం సంతోషంగా ఉంది
అంతేకాదు తన ప్రియ మిత్రుడు స్వయంగా ఇంటికి రావడం, తమ విందును సేకరించడం చాలా సంతోషంగా ఉందంటూ మురిసిపోయారు. చిరు తన ట్వీట్‌లో "నన్ను అభినందించేందుకు స్వయంగా బెంగళూరు నుంచి నా ప్రియ మిత్రుడు శివ రాజ్ కుమార్ రావడం నా మనసుకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఈ సందర్భంగా తనతో ఎంతో విలువైన సమయాన్ని గడిపాను. కలిసి భోజనం చేస్తూ మా మధ్య ఉన్న బంధాన్ని, తన కుటుంబంతో ఉందాన్ని సాన్నిహిత్యాన్ని.. నాటి రోజులను గుర్తు చేసుకున్నాం. ఎంతో సంతోషంగా ఉంది" అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శివన్నతో చిరు చూసి మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇద్దరు లెజెండరీలను ఒకే ఫ్రేంలో చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
Very touched that my dear @NimmaShivanna came all the way from Bangalore to congratulate me 🤗
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 4, 2024
Spent some wonderful time over lunch and fondly recalled our association and so many cherished memories with the Legendary Rajkumar garu and his entire family.🙏 Delighted. pic.twitter.com/gbWizevDso
ఇక చిరు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. ఇటీవల మూవీ రెగ్యూలర్ షూటింగ్‌ను మొదలైంది. మరోవైపు శివరాజ్ కుమార్ కూడా కన్నడలో తన సినిమాలతో బిజీగా ఉన్నారు. గతేడాది రజనీకాంతో జైలర్ సినిమాతో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. తమిళ డబ్బింగ్ మూవీ అయినా జైలర్ తెలుగులోనూ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇందులో శివన్న ఎంట్రీ థియేటర్లు దద్దరిల్లాయి. ఆయన మాస్ లుక్ ప్రతి ఒక్కరి చేత ఈళలు వేయించింది. ఇదిలా ఉంటే శివన్న రామ్ చరణ్ సినిమాలోనూ కీ రోల్ పోషించే అవకాశం ఉందంటున్నారు. బుచ్చిబాబు-చరణ్ కాంబో రాబోయే ప్రాజెక్ట్‌లో శివన్న కూడా నటించే అవకాశం ఉందంటున్నారు. మరి దీనిపై ఎలాంటి క్లారిటీ వస్తుందో చూడాలి.
Also Read: ఆమె నిజంగానే పోతే బాగుండు - పూనమ్ పాండే పబ్లిసిటీ స్టంట్‌పై నటి కస్తూరి ఫైర్